Illu Illalu Pillalu Serial Today Episode ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(అక్టోబరు 19) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కేసు వెనక్కి తీసుకుంటా..

వేదవతి భాగ్యం వాళ్లు గొడవ పడతారు. అందరూ కోర్టులో తేల్చుకుందాం అంటే కోర్టులో తేల్చుకుందాం అని అనుకుంటారు. ఇంతలో వల్లీ వచ్చి కోర్టులకు వెళ్లొద్దు.. కేసులు వద్దు.. నేను కేసు వెనక్కి తీసుకుంటున్నా అని అంటుంది. అందరూ షాక్ అవుతారు. నీ జీవితం బాగు చేయాలి అని మేం అనుకుంటే నువ్వేంటే కేసు వెనక్కి తీసుకుంటా అంటావ్.. కోర్టుకి వెళ్తే ఆ జడ్జి వీళ్లకి బుద్ధి చెప్తారు నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్తారు అని భాగ్యం అంటే.. కేసు వద్దు ఏం వద్దు.. నా భర్త బంగారం.. మా అత్తామామలు దేవుళ్లు.. వీళ్లని జైలుకి పంపితే నా కాపురం నేనే నాశనం చేసుకుంటాను.. కేసు పెడితే అందరికి నా మీద అసహ్యం పెరుగుతుంది.. జడ్జిగారు ఎన్ని సంవత్సరాలకు కేసు తేల్చుతారు అప్పటి వరకు నా బతుకు ఏంటి అని వల్లీ అంటుంది. తల్లితో ఇప్పటి వరకు నా జీవితానికి నువ్వు చేసింది చాలు ఇక నన్ను వదిలేయ్.. నేను ఇక్కడికి నా భర్త కోసం నా అత్తింటి కోసం వచ్చా అందరూ కోర్టుకి వెళ్లాలి చూశారు కానీ ఎవరూ నన్ను ఇంటికి తీసుకెళ్తా అనలేదు.. మా అమ్మానాన్న నాతో కేసు పెట్టించారు అని వల్లీ అనగానే ఎస్‌ఐ భాగ్యం వాళ్లని తిడుతుంది. భాగ్యం కూతుర్ని కొట్టి సర్వనాశనం చేసేశావ్ అంటుంది. తర్వాత భాగ్యం ఎస్‌కి క్షమాపణలు చెప్తుంది. తర్వాత వల్లీ అత్తామామలకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకెళ్లమని బతిమాలుతుంది. చందుని బతిమాలితే ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించకు అని వెళ్లిపోతాడు.

అమూల్య ఏడుపు..

రామరాజు వాళ్లు ఇంటికి రాగానే అమూల్య తండ్రిని పట్టుకొని ఏడుస్తుంది. ఇక తిరుపతి సుకన్యని టీ చేసి అందరికీ తీసుకు రమ్మని అంటాడు. తర్వాత సుకన్య దగ్గరకు వెళ్లి వేడివేడిగా ఏమైనా ఇవ్వు అని రొమాంటిక్‌గా అడిగితే టీ గిన్న తీసుకెళ్లి చేతిలో పెడుతుంది. తిరుపతి కెవ్వుమంటాడు. నా పెద్ద కోడలు మాత్రమే ఈ ఇంటికి సరైన కోడలు అనుకున్నా కానీ ఇంత మోసం తట్టుకోలేకపోతున్నా అని రామరాజు అంటాడు.

విడాకులు కావాలి..

చందు తండ్రితో నాన్న నాకు విడాకులు కావాలి.. మళ్లీ దాన్ని తీసుకొచ్చి తనని నా నెత్తి మీద పెడతా అంటే నేను భరించలేను అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. విశ్వక్ చందుతో ఇదంతా మా అత్త చేయించింది అంటే.. ఎవరో చెప్తే చేస్తుందా.. అని అంటాడు. వల్లీ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు మీరేం చేస్తారో మీ ఇష్టం అని వేదవతి అంటుంది. ఇక ధీరజ్‌కి కార్ల బిజినెస్‌కి సంబంధించి ట్రావెల్స్ ఆఫీస్‌ వేలంపాటకి వచ్చిందని ఫోన్ వస్తుంది. ధీరజ్ ఆ అవకాశాన్ని వదులుకుంటా అని అంటే రామరాజు, చందు, నర్మదలు పాల్గొమని అంటారు.

ఇంట్లో నుంచి పోవే..

వల్లీ ఏడుస్తూ ఉంటే భాగ్యం బ్యాగ్ తీసుకొచ్చి ఇంట్లో నుంచి పోవే అని వల్లీని గెంటేస్తుంది. వల్లీ ఏడుస్తూ నువ్వే ఇలా అంటే ఏంటమ్మా అని అంటుంది. నా జీవితం నాశనం అవ్వడానికి కారణం నువ్వే అమ్మా.. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పావ్.. అబద్ధంతో పెళ్లి చేశావ్.. కుట్రలు చేశావ్ నీ స్వార్థం నా మీద రుద్దావ్ అని అంటుంది. దానికి భాగ్యం ఏడుస్తూ నా జీవితం నీకు రాకూడదు అని ఈ పెళ్లి చేశా.. నీ కోసం ఆ నర్మద, వేదవతిలతో ఎన్ని సార్లు దెబ్బలు తిన్నాను.. అని వల్లీని ఇంట్లో నుంచి వెళ్లిపోమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.