Illu Illalu Pillalu Serial Today Episode ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(అక్టోబరు 12) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మన ప్రేమ ముందుకు ఎలా వెళ్తుంది..

వేదవతి భర్తకి సర్ది చెప్పి భోజనం తినిపిస్తుంది. మరోవైపు అమూల్య, విశ్వక్ చాటుగా కలుసుకుంటారు. సంతోషంగా ఉంటే దేవుడు చూడలేడు ఏమో.. మా చెల్లి మీ అన్నయ్య కలుసుకొని సంతోషంగా ఉన్నారని అనుకునేలోపు వల్లీ బాగోతం బయట పడింది.. మా పెద్దత్త ఇందులో ఉందని తెలిశాక షాక్ అయ్యాను.. నాకు ఓ విషయం చెప్పాలి కదా అని విశ్వక్ అంటే.. మాఅన్నయ్య..మీ చెల్లిని కలపడం వరకే మన స్నేహం. నీకు అన్నీ తెలుసు అని నాకు తెలుసు.. ఏం తెలీదు అని నటించకు.. అయినా నన్ను ట్రాప్ చేయడానికే నువ్వు మా వల్లీ వదినతో స్నేహం చేశావ్ కదా అని అమూల్య దెప్పిపొడుస్తుంది. నేను మారిపోయా అమూల్య,, నువ్వు నన్ను నమ్మకపోతే మన ప్రేమ ముందుకు ఎలా వెళ్తుంది చెప్పు అని విశ్వక్ అంటే ఏంటి ఏం వాగావ్ అని అమూల్య అంటుంది. ఇంతలో బామ్మ ఎవరు అక్కడ అని అడగటంతో అమూల్య పారిపోతుంది. రేయ్ రాత్రి పూట ఎవరికీ తెలీకుండా ప్రేమ పక్షుల్లా మాట్లాడుకుంటున్నారేంటి.. అమూల్య అలా పరుగులు పెడుతుంది ఏంటి అని బామ్మ అంటే నేను అమూల్యని ప్రేమిస్తున్నా నానమ్మ.. పగలు ప్రతీకారాలు వదిలేశా అని అంటాడు. బామ్మ సంతోషంగా విశ్వక్‌ని ఎంకరేజ్ చేస్తుంది. ఇక విషయం మొత్తం తెలుసుకొని రేపు వేదవతితో మాట్లాడుతా అని అంటుంది.

ఇలా అయింది ఏంటే..

బామ్మ పొద్దున్న వేదవతి వాళ్ల దగ్గరకు వెళ్లి మీకు మాత్రమే ఇలా అయింది ఏంటే.. చూడటానికి అమాయకంగా ఉన్న వల్లీ ఇలా చేస్తుంది అనుకోలేదు అని బామ్మ అంటే మేం కూడా అలాగే అనుకున్నాం అమ్మమ్మా అని చందు అంటాడు. ఇంతలో నర్మద తల్లిదండ్రులు పూలుపళ్లు చీర సారె తీసుకొని వస్తారు. సమయం సందర్భం లేకుండా వచ్చారేంటి అని నర్మద, రామరాజు అడిగితే మా అల్లుడు కూతురికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాం అని అంటారు. దాంతో అందరూ నర్మద, సాగర్‌కి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారు.

మీ వెనక గొప్ప కుటుంబం ఉంది..

ప్రసాద్‌రావు నర్మదతో నువ్వు పెళ్లి చేసుకున్నావ్ అని బాధ పడ్డాం కానీ మీ వెనక గొప్ప కుటుంబం ఉంది.. నీకు పంతం ఎక్కువ ఎలాగూ పుట్టింటికి రావు.. మేం రాకుండా తీసుకురాకుండా ఉండలేం అని చెప్పి విష్ చేస్తారు. నర్మద తల్లి వేదవతితో గుడికి వెళ్లి పూజ చేసుకొని వచ్చాం.. ఓ ఐదుగురు ముత్తయిదువులతో ఆశీర్వం ఇప్పిస్తే సంవత్సరంలో పిల్లలు పుడతారు అని అంటుంది. దానికి నర్మద ఇంట్లో పరిస్థితులు బాలేవు ఇప్పుడు ఏం వద్దు అంటుంది. రామరాజు ఒప్పుకోడు.. ఆ తంతు జరిపించమని అంటారు. వేద నర్మదని ఒప్పిస్తుంది.

అందరూ నిన్ను మర్చిపోయారే..

వల్లీకి ఈ విషయం వెంటనే చెప్పాలి అని సుకన్య అనుకుంటుంది. ఇక వల్లీ గోడ మీద వల్లీ లవ్స్ చందు అని వల్లీ డై ఫర్ చందు అని రాసుకొని నువ్వు అంటే నాకు ప్రాణం బావ అని ఏడుస్తుంది. ఇక సుకన్య ఫోన్ చేయగానే వల్లీ చందు అనుకొని బా నీ కోసమే ఆలోచిస్తున్నా నీ కోసం వచ్చేస్తా అని అంటుంది. వచ్చేయ్‌వే వచ్చేయ్ అని సుకన్య అంటుంది. ఇక్కడ అందరూ నిన్ను మర్చిపోయారే.. మనం చేసిన పుణ్యాలు అలాంటివి.. ఇక్కడ అంతా హడావుడి ఉంది.. చిన్న పాటి ఫంక్షన్ చేస్తున్నారు అని నర్మద, సాగర్‌ల పెళ్లి రోజు అని ఫంక్షన్ చేస్తున్నారు అని చెప్తుంది. ఈ ఈవెంట్ వాడుకొని ఇంట్లోకి ఎలా రావాలో ఆలోచించు అని సుకన్య అంటుంది.

ఆ ఇంటికి వెళ్లిపోదాం..

సుకన్య ఫోన్‌లో మాట్లాడటం తిరుపతి చూస్తాడు. సుకన్య దగ్గరకు వెళ్లి ఏం చేస్తున్నావ్ ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు. సుకన్య సినిమా ఆఫర్ ఫ్రెండ్ అని కవర్ చేస్తుంది. అందరికీ సాయం చేయ్ అని తిరుపతి అంటే ఈ ఇంట్లో ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు.. మనం బంగ్లాలోకి అడుగు పెడదాం అని అంటుంది. అక్కడ అడుగు పెడితే పెద్దక్క నీ కాలు కోసేస్తుంది అని తిరుపతి అంటాడు. మరోవైపు సేనాపతి భద్రావతి దగ్గరకు వెళ్లి రామరాజు కుటుంబం ముక్కలు అవ్వడం మొదలైంది.. వాడి కుటుంబం ఇక చిన్నాభిన్నం అయిపోతుందని వల్లీని ఇంట్లో నుంచి గెంటేశారని చెప్తాడు. నర్మద పెళ్లి రోజు అని తెలిసి నర్మదకి ఊహించని గిఫ్ట్ ఇస్తా అని భద్రావతి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.