Illu Illalu Pillalu Serial Today Episode ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(అక్టోబరు 10న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బయటకు నడవవే..

వల్లీ రామరాజు, వేదవతిని బతిమాలినా ఇద్దరూ కనికరించకుండా వెళ్లిపోమని అంటారు. నర్మద, ప్రేమ, ధీరజ్ అందర్ని బతిమాలుతుంది. కానీ ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాం మరి ఇవ్వమని అంటారు. ఇక సాగర్ అయితే అసలు నువ్వు మాట్లాడకు వదినా.. మా అన్నయ్యని ఇంత ఇబ్బంది పెట్టావని తెలిశాక అస్సలు క్షమించమని అంటారు. ఇక వేదవతి, వల్లీని గెంటేస్తారు. మీ కుటుంబం అంతా నాశనం అయిపోతుందని భాగ్యం అంటే నా జోలికి వస్తే చంపేస్తా అని నర్మద భాగ్యాన్ని లాగి పెట్టి కొట్టి తోసేసి గేటు వేసేస్తుంది.

టీ ఇచ్చిన సుకన్య..

చందు బాధ పడుతూ అన్నదమ్ములు.. మరదళ్లు, తిరుపతి అక్కడే ఉంటారు. సుకన్య అందరికీ టీ ఇస్తుంది. ప్రేమ, నర్మద తీసుకోరు. మీ అందరికీ ముందే తెలుసు కదా ముందే విషయం చెప్పుంటే ఇంత వరకు వచ్చేది కాదు కదా.. అని తిరుపతి కోప్పడతాడు. నర్మద ఎప్పుడూ మన కుటుంబం గురించే ఆలోచిస్తుంది.. తనని ఏం అనొద్దు అని చందు సాగర్‌కి చెప్తాడు. ఇక సుకన్య మీద కూడా ప్రేమ అరిస్తే అందరూ అడ్డుకొని..సుకన్యకి బుద్ధిగా ఉండమని అంటారు.

మీ వల్ల నా కాపురం ముక్కలైపోయింది..

వల్లీ చందుకి ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు.. భాగ్యం, ఇడ్లీబాబాయ్ తినమని అంటే మీరే నా కాపురం నాశనం చేశారు.. ఏ ముఖం పెట్టుకొని తినమంటున్నారు అని అడుగుతుంది. నాకు ప్లాన్ ఉంది నేను సెట్ చేస్తా అని భాగ్యం అంటే ఏంటి నువ్వు సెట్ చేసేది.. నీ వల్ల ఇంత అయింది.. నేనే అందర్ని బతిమాలుకుంటా.. మా మామయ్యగారు మంచోళ్లు ఆయనకు బతిమాలుకుంటా అని అంటుంది.

కుమిలిపోతున్న రామరాజు!

కొడుకు జీవితం నాశనం అయిపోయిందని రామరాజు ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటాడు. ఇంతలో వల్లీ రామరాజుకి ఫోన్ చేస్తుంది. అది చూసిన రామరాజు బాధ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేయడు. వేదవతి చూసి ఫోన్ కట్ చేసేస్తుంది. వల్లీ ఏడుస్తూ మా మామయ్య కూడా మాట్లాడటం లేదు అంటే ఇదంతా మీ వల్లే అసలు మిమల్ని అని తల్లిదండ్రుల్ని చితక్కొటేస్తుంది. ఇక రామరాజు నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది.. నేను ఓ చేతకాని తండ్రిని అయిపోయా.. మంచి సంబంధం తీసుకురాలేదు అని వేదవతితో చెప్పి ఏడుస్తాడు. వేద కూడా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.