Illu Illalu Pillalu Serial Today Episode నర్మద అత్తతో మాట్లాడటానికి కిచెన్‌కి వెళ్తుంది. వేదవతి మాట్లాడకుండా సీరియస్‌గా ఉంటుంది. కోపంలో మీ అందం పెరిగిపోతుంది అత్తయ్యా.. మీరు నాతో మాట్లాడకపోతే నేను మీతో మాట్లాడను అని వెళ్తుంది. మళ్లీ వచ్చి ప్లీజ్ అత్తయ్యా మాట్లాడండి అని బతిమాలుతుంది. నవ్వుతూ ప్రేమగా మాట్లాడండి.. లేదంటే నాకు ఏదో బ్యాడ్ జరుగుతుంది.. ప్లీజ్ మాట్లాడండి అని అంటుంది.

నర్మద ఎంత చెప్పినా వేదవతి వినదు. దాంతో నర్మద నేను మీ అక్క వాళ్లకి ఎదురు వెళ్తున్నా అని మీరు నాతో మాట్లాడటం లేదు కానీ అది నా డ్యూటీ మీరు ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటారు అని నర్మద వెళ్లిపోతుంది. వేదవతి మనసులో వాళ్లు ఏదో ఒకటి చేస్తారు నా కోపం నీకు కనిపిస్తుంది కానీ నా బాధ కనిపించడం లేదు అని అనుకుంటుంది.

నర్మద పని చేస్తున్న సబ్‌ రిజిస్టర్‌ ఆఫీస్‌కి ఓ వ్యక్తి వచ్చి ఎవరికో కాల్ చేసి సార్ మీరు చెప్పినట్లే వచ్చా పని పూర్తి చేసి మీకు కాల్ చేస్తా అని లోపలికి వెళ్లి.. నర్మదకు పొలం రిజిస్ట్రేషన్‌ అని ఫైల్ ఇస్తాడు. నర్మద చూసి సరిహద్దులు కరెక్ట్ లేదు కుదరదు అని అంటే చివరి పేజీ చూడమని అంటాడు. అందులో డబ్బు ఉంటుంది. లంచం చూసి నర్మద షాక్ అయిపోతుంది. కోపంగా చూసి ఏంటి ఇది.. గెటప్‌.. ఏంటి లంచం ఇవ్వాలి అని చూస్తున్నావా.. ఇది ఎందుకు ఇచ్చావ్ అని అడుగుతుంది. ఇంతలో ఏసీబీ అధికారులు పోలీసులు, మీడియా వచ్చి నర్మద లంచం తీసుకున్నట్లు అనుకుంటారు. నర్మద ఎంత చెప్పినా వినకుండా మీరు లంచం తీసుకున్నట్లు పక్కా సాక్ష్యాలు ఉన్నాయని అంటారు.

నర్మదనే డబ్బు అడిగింది అని అతను చెప్తాడు. నర్మద ఎంత చెప్పినా ఎవరూ వినరు. అధికారులు నర్మదని సస్పెండ్ చేస్తారు. రిమాండ్‌కి రావాల్సి ఉంటుందని చెప్పి డబ్బు తీసుకొని వెళ్లిపోతారు.

రామరాజు ఇంట్లో ఆనంద్‌రావు, భాగ్యం అరిసెలు, జంతికలు అన్నీ తింటూ అనుభవించు రాజా అని ఎంజాయ్ చేస్తుంటారు. శ్రీవల్లి వచ్చి తంతే గారెల బుట్టలో పడినట్లు భలే ఉంది కదా మీకు అని ఎంజాయ్ చేయమని అంటుంది. ఇంతలో శ్రీవల్లి న్యూస్‌లో నర్మదని చూస్తుంది. లంచం తీసుకుంటూ దొరికిపోయిన సబ్‌రిజిస్టర్‌ నర్మద అని చూసి సంబర పడిపోతారు. నర్మద పని అయిపోయింది అని హ్యాపీ అయిపోతారు.

శ్రీవల్లి ఇంట్లో అందరినీ సందడిగా పిలుస్తుంది. వేదవతి వచ్చి కొంపలు అంటుకుపోయినట్లు అలా పిలిచావేంటి అని అంటుంది. అందరూ న్యూస్ చూసి షాక్ అయిపోతారు. నర్మద లంచం తీసుకుందని శ్రీవల్లి అంటే అందరూ వల్లీ మీద అరుస్తారు. వేదవతి టెన్షన్ పడుతూ రామరాజుకి కాల్ చేయమని అంటుంది. రామరాజు ఫోన్ కలవదు.. నర్మదకి కాల్ చేసి ఏమైందో కనుక్కోమని వేదవతి సాగర్కి చెప్తుంది.

ఇంట్లో అందరూ బాధ పడుతూ ఉంట శ్రీవల్లి, భాగ్యం, ఇడ్లీబాబాయ్‌ బయటకు వచ్చి చిందులేస్తారు. ఇక భద్రావతి, సేనాపతి న్యూస్ చూసి నవ్వుకుంటారు. మనతో పెట్టుకోవడం అంటే తన పతనానికి తానే గొయ్యి తవ్వుకోవడం,, మనం అంటే దానికి ఇప్పుడు భయం వచ్చుంటుందని అనుకుంటారు. ఇక నుంచి మన విషయంలోకి రావాలి అంటే భయపడుతుంది. భద్రావతి పేరు వినిపిస్తే వణికిపోతుందని అనుకుంటారు. ఫ్యామిలీ మొత్తం ఏడుస్తుంటారని పరువు పోయింది రామరాజు అవమానంతో చస్తాడు అని అనుకుంటారు. నర్మద బాధగా ఇంటికి వస్తుంటే బయట సేనాపతి, భద్రావతి కూర్చొని లంచం తీసుకుంటూ దొరికిపోయింది అని వెటకారం చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.