Illu Illalu Pillalu Serial Today Episode సాగర్ తమ మిల్లు దగ్గర నుంచి బియ్యం బస్తాలు తీసుకెళ్లి షాప్‌ల దగ్గరకు మోస్తుంటాడు. కాసేపట్లో రిజల్ట్స్ వస్తాయని చాలా సంతోషపడతాడు. ఇంతలో నర్మద తండ్రి పేపర్ తీసుకొని వస్తాడు. సాగర్ తన మామ గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాడు అనుకుంటాడు. కానీ నర్మద తండ్రి వచ్చి నువ్వు ఇలాంటి వాటికే పనికొస్తావ్.. మూటలు మూసుకోవడమే నీ బతుకు.. నువ్వు వీఆర్‌ఓ పోస్ట్‌కి సెలక్ట్ అవ్వలేదు అని అంటాడు.

సాగర్ చాలా బాధ పడతాడు. కచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొడతాను.. అని ఛాలెంజ్ చేశావ్ కదా.. ఇదేనా ఆ ఛాలెంజ్.. నువ్వు ఆ జాబ్ కొట్టడానికి దరిదాపుల్లో కూడా లేకపోవడమా ఛాలెంజ్ అంటే.. ఒకమ్మాయిని లేపుకెళ్లడం అంత ఈజీ కాదు గవర్నమెంట్ జాబ్ అంటే.. ఈ మూటలు మోసుకోవడమే నీకు తగిన పని.. నా కూతురు సరిదిద్దుకోలేని పెద్ద తప్పు ఏంటో తెలుసా నిన్ను సెలక్ట్ చేసుకోవడం.. నువ్వు ఒక అసమర్థ భర్తవి అది గుర్తించుకో ఏం చేతకాని దద్దమ్మవి అని తిడతాడు.

సాగర్‌ని మామ తిట్టి వెళ్తుంటే నర్మద ఎదురుగా వస్తుంది. నర్మదని చూసి ఆయన కోపంగా వెళ్లిపోతారు. నర్మద సాగర్‌ని బాధగా చూస్తుంది. వేదవతి పాలు వేడి చేస్తూ ఉంటుంది. అమూల్య ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అడుగుదామా అని వేదవతి అనుకుంటుంది. ఇంతలో ప్రేమ అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ అన్నయ్య బండి మీద అమూల్య ఎక్కింది అని అంటుంది. అమూల్య ఎందుకు మా అన్నయ్య బండి ఎక్కుతుంది. ఛాన్సే లేదు అని అంటుంది. మొత్తం దూరం నుంచి వల్లీ వింటూ కంగారు పడుతుంది. స్టార్టింగ్‌లోనే ఈ స్పీడ్‌ బ్రేకర్ ఏంట్రా స్వామి అని వల్లీ అనుకుంటుంది.

అమూల్య రావడం చూసి ఏదో ఒకటి చేయాలి అని వల్లీ అనుకుంటుంది. అమూల్య ఇంట్లోకి రావడం చూసి చున్నీ తీసుకొని పరుగున అమూల్య దగ్గరకు వెళ్లి నువ్వు పని అయిపోయింది. నువ్వు విశ్వ బండి మీద వెళ్లావా లేదా అని అడుగుతుంది. వెళ్లాను అని అమూల్య అంటుంది. మీ అమ్మ చూసేసింది అమూల్య నీ డ్రస్ చూసిందంట కొంప మునిగిపోయింది అని అంటుంది.

వల్లీ అమూల్య చున్నీ తీసుకొని అమూల్యకి మరో చున్నీ ఇచ్చి కవర్ చేయ్ అని అంటుంది. సరే అని అమూల్య వెళ్తుంది. వేదవతి అమూల్యని ఆపి ఉదయం వేరే రంగు చున్నీ వేసుకున్నావ్ అని అంటుంది. లేదు అమ్మా ఇదే వేసుకున్నా అని అమూల్య అంటుంది. ఉదయం నిన్ను విశ్వ బండి మీద చూశా అని వేదవతి అంటే అతను అంటే నాకు చిరాకు కోపం నేను అతని బండి ఎందుకు ఎక్కుతాను అని అమూల్య అంటుంది. వల్లీ వచ్చి ఇలాంటి డ్రస్‌లు చాలా మంది వేసుకుంటారు. చున్నీలు, చీరలు చాలా మంది వేసుకుంటారు అని అంటుంది. ప్రేమ కూడా అడిగే సరికి వల్లీ ఏడ్వమని అమూల్యకి చెప్పడంతో అమూల్య ఏడుస్తూ నన్నే అనుమానిస్తారా అని అంటుంది. చిన్న పిల్ల తనని ఎందుకు అలా అంటారు అని వల్లీ అమూల్యని తీసుకెళ్లిపోతుంది. అమూల్య వల్లీకి థ్యాంక్స్ చెప్తుంది.

సాగర్ చాలా బాధ పడుతుంటాడు. నర్మద వచ్చి ఓదార్చుతుంది. మళ్లీ ఎగ్జామ్ రాసుకోవచ్చు అని అంటుంది. నేను నిజంగా చేతకాని వాడిని నర్మద అని సాగర్ బాధ పడతాడు. వల్లీ చాటుగా ఇద్దరి మాటలు వింటుంది. నాకోసం ఎంతో చేసినా నా భార్యకి నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్యకి తల్లిదండ్రుల్ని దగ్గర చేయలేకపోతున్నా.. నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ఉండుంటే నువ్వు మీ నాన్న వాళ్లకి దగ్గరయ్యేదానివి అని బాధ పడతాడు. విషయం మొత్తం తెలుసుకున్న వల్లీ మొగుడితో నర్మద గవర్నమెంట్ జాబ్ చేయించాలి అనుకుంటుందా.. అని అంటుంది. హాల్‌ టికెట్ పట్టుకొని నర్మదని భయపెట్టేయొచ్చు అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.