Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ వల్లీని పిలవగానే ప్రేమ తనని కత్తితో చంపడానికి తరిమినట్లు వల్లీ కలకంటుంది. మళ్లీ ప్రేమ వచ్చి పిలవడంతో బిత్తరపోతుంది. ప్రేమ దగ్గరకు రాగానే నాకేం తెలీదు... నాకేం తెలీదు అని వణికిపోతుంది.

ప్రేమ వల్లీతో ఎందుకు భయపడుతున్నావ్.. ఇలా చలి జ్వరం వచ్చినట్లు ఎందుకు వణికిపోతున్నావ్.. నీ వాలకం చూస్తే ఏదో పెద్ద తప్పు చేశావని అర్థమైంది ఏంటి సంగతి అని అడుగుతుంది. ఈ లోకంలోనే నా అంత మంచిది ఉండరు అని వల్లీ అంటుంది. వల్లీ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అది కనిపెట్టాలి అని అనుకుంటుంది.

ధీరజ్ తన క్యాబ్‌లో ఓ పెద్దాయన్ని ఎక్కించుకుంటాడు. అతను కారు ఎక్కి అందులో డైరీ చూస్తారు. అందులో షూ కొనాలి.. పోలీస్ ట్రైనింగ్ ఇప్పించాలి.. హైదరాబాద్ అకాడమీలో చేర్పించాలి అని ఉంటుంది. ఆయన అది చూసి బాగా బరువు బాధ్యతలు ఉన్నట్లు ఉన్నాయి అని అంటాడు. ధీరజ్ అతనితో గ్రహాలు అన్నీ గ్రూప్ డిస్కషన్ పెట్టి నన్ను ముంచేశాయి. పెళ్లి అయిపోయింది అని చెప్తాడు. క్యాబ్ నడిపే డబ్బు సంపాదించాలా.. మీ నాన్న పట్టించుకోడా అని అడుగుతాడు. మానాన్న టూమచ్‌గా చూసుకుంటారు.. జాబ్ దగ్గర నుంచి జీవితం వరకు అన్నీ ఆయన చెప్పినట్లే చేయాలి.. పిల్లల మీద విపరీతమైన ప్రేమ వల్ల ఆయన చెప్పినట్లు ఉండాలి అనుకుంటారు.. బొమ్మరిల్లు ఫాదర్‌లా ఇప్పటికీ మా చేయి వదలరు అని చెప్తాడు. ఆయన మీ నాన్నతో ఒకసారి మాట్లాడాలి అని అంటే ఎందుకులేండి సార్ మా హిట్లర్ నాన్నతో మాట్లాడితే మీరు మారిపోతారు అని అంటాడు.

విశ్వ శ్రీవల్లికి కాల్ చేస్తాడు. శ్రీవల్లి తెగ కంగారు పడిపోతుంది. ఇప్పటికే నర్మదని అవినీతి కేసులో ఇరికించడంతో నా హస్తం ఉందని ఎక్కడ తెలిసిపోతుందో అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు ఒకడివి నా ప్రాణానికి.. నేను నీకు సాయం చేయను.. ఈ రాయభారాలు నావల్ల కాదు అని వల్లీ అంటుంది. అయితే మా పది లక్షలు ఇచ్చేయ్ అని విశ్వ అంటాడు. ఆ పిల్ల మాటకి కత్తి పట్టుకొని వచ్చేస్తుంది. నువ్వేమో డబ్బు ఇచ్చేయ్ అంటావ్ నేను మీకు ఎలా కనిపిస్తున్నానురా.. మీరంతా భయపెడితే భయపడటానికి నేను ఎవరు అనుకున్నానురా.. శ్రీవల్లి నా నగలు తాకట్టు పెట్టి అయినా నీకు పది లక్షలు ఇచ్చేస్తా అంటుంది.

విశ్వ శ్రీవల్లికి అయితే నువ్వు నాకు భయపడవా.. డబ్బు ఇస్తావా.. సరే అయితే మీ ఇంట్లో అందరికీ నువ్వే నాకు అమూల్యకి మధ్య రాయిభారిగా ఉన్నావ్ అని చెప్తా అని అంటాడు. శ్రీవల్లి బిత్తర పోయి ఏడుస్తుంది. చెప్పినట్లు చేయకపోతే చెప్పేస్తా అని విశ్వ బ్లాక్మెయిల్ చేయడంతో చేస్తాను అని వల్లీ అంటుంది.

శ్రీవల్లి తల్లిదండ్రులు మళ్లీ రామరాజు ఇంటికి వచ్చి ఇలా అయినా పాతక లక్షలు కొట్టేయాలి అనుకుంటారు. శ్రీవల్లి తల్లిదండ్రుల్ని చూసి రాత్రే ఇక్కడ నుంచి వెళ్లారు కదా మళ్లీ పొద్దున్న వచ్చేశారు ఏంటి అని అడగుతుంది. దాంతో అప్పులోళ్లు ఉంచడం లేదు అని అందుకే వ్యాపారం అని చెప్పి పాతిక లక్షలు కొట్టేయాలి అని అనుకుంటున్నాం అని భాగ్యం అంటుంది. నర్మద ఆ మాటలు వింటుంది. వల్లీ తల్లితో మా అత్తయ్య గారి వైపు నుంచి నరుక్కొచేద్దాం రండి అని అంటుంది.

వేదవతి దగ్గరకు భాగ్యం, ఇడ్లీబాబాయ్‌లు ఏడుస్తూ వస్తారు. ఏమైంది అని వేదవతి అంటే నర్మద మీ ప్లాన్ ఏంటి అని చెప్పండి అని అంటుంది. ఏమైంది అని వేదవతి అడిగితే పచ్చళ్ల వ్యాపారం చేయాలి అనుకుంటున్నాం.. పాతిక లక్షలు అప్పు ఇప్పించండి అని అంటుంది. వేదవతి నోరెళ్ల బెడుతుంది. పచ్చళ్ల బిజినెస్‌కి అంత ఎక్కువ ఎందుకు అని ప్రేమ అంటుంది. భాగ్యం పికెల్స్ పెడతాం కాదా ఆ మాత్రం ఉంటుంది అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.