Illu Illalu Pillalu Serial Today Episode విశ్వక్‌తో మాట్లాడటానికి నిన్ను ప్రేమే కదా తీసుకెళ్లింది అని అమూల్యని ధీరజ్ అడుగుతాడు. ప్రేమ వదినను అపార్థం చేసుకున్నావని తనకి అసలు ఏం తెలీదు అని అమూల్య చెప్తుంది. మరి ఎవరు తీసుకెళ్లారని అడిగితే శ్రీవల్లిని కోపంగా చూసి ఎవరూ తీసుకెళ్లలేదు నేనే వెళ్లాను.. చివరి సారి మాట్లాడాలి.. ఇక జీవితంలో నిన్ను ఇబ్బంది పెట్టను అని బతిమాలడంతో నిజమే అని నమ్మి వెళ్లి మోసపోయాను.. వాడు నన్ను కిడ్నాప్ చేస్తాడని అనుకోలేదు అని అమూల్య ఏడుస్తుంది.

కామాక్షి కోపంగా ప్రేమతో ఆపపడుచు కట్నం ఇవ్వని చిన్న మరదలా అమూల్య నీకు కాల్ చేసినప్పుడు ఇంట్లో ఎవరికో ఒకరికి చెప్పాలి కదా.. మా నాన్నకి అయినా చెప్పాలి కదా.. కనీసం నీ మొగుడికైనా ఇలా ఫోన్ వచ్చింది అని చెప్పాలి కదా.. అంతే కానీ నీ బోడి సలహాలు ఏంటమ్మా అని అడుగుతుంది. ఆ టైంలో ప్రేమ చేసిందే కరెక్ట్ కదా అని నర్మద అంటే వచ్చిందమ్మా ఆడపడుచు కట్నం ఇవ్వని గవర్నమెంట్ మరదలు.. ఆవిడ తానా అంటే ఈవిడ తందానా అంటూ ఎంత బాగా సమర్ధించడానికి వచ్చిందో.. ఇది మా చెల్లి జీవితానికి సంబంధించిన విషయం అమ్మా అని అంటుంది. వదినా అమూల్య ప్రేమ చెప్పినట్లు తాళి వేసుకొని రాకపోయి ఉంటే అమూల్య క్యారెక్టర్ మీద మచ్చ వేసేవాడు.. అప్పుడు మనమంతా ఏమైపోయేవాళ్లం అని అంటుంది. శ్రీవల్లి కూడా తన బండారం బయట పడుతుందని నర్మద, ప్రేమలకు సపోర్ట్ చేస్తే చందు, ధీరజ్‌లు తప్పని సొంత నిర్ణయం తీసుకోవడం ఏంటి ఇంట్లో చెప్పాలి అని అంటారు. దాంతో అమూల్య ఆలోగా నేను చచ్చిపోయేదాన్ని అన్నయ్యా అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు.

అమూల్య ఏడుస్తూ నా క్యారెక్టర్ మీద నింద పడితే నాన్న తట్టుకోలేరని నేనే ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోయేదాన్ని.. ఆ టైంలో ప్రేమ వదిన సలహా వల్లే నేను బతికున్నాను.. లేదంటే నా శవం కూడా మీకు దొరికేది కాదు.. దయచేసి ప్రేమ వదినను ఏమీ అనొద్దు అని అంటుంది. రామరాజు కూతురి చేయి పట్టుకొని అమ్మా అమూల్య నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావని నువ్వు నా కడుపున పుట్టకపోయి ఉంటే బాగున్ను అన్నాను కానీ నువ్వు నా కోసం ఆలోచించి ఆ ఇంట్లో నరకం చూశావ్.. అని అంటాడు. వేదవతి ఏడుస్తూ నోరారా నిన్ను చాలా మాటలు అన్నాను.. అమ్మా అని పిలిస్తే నీ మీద నీరు వేశాను.. ఈ అమ్మని క్షమించవే అని అంటుంది. అమూల్య ఏడుస్తూ తల్లిని హగ్ చేసుకుంటుంది. అందరూ భోజనానికి వెళ్తారు. ప్రేమ ధీరజ్‌తో మాట్లాడితే ధీరజ్ మాట్లాడొద్దు అని అంటాడు. నర్మద ధీరజ్‌తో ఎందుకు అలా అంటావ్ తను అమూల్య గురించే అలా చెప్పింది కదా అర్థం చేసుకోకుండా ఇలా అంటావేంటి అంటుంది. తను కావాలనే అలా చెప్పింది.. తన ఒంట్లో ఉన్నది ఆ ఇంటి రక్తమే కదా ఆ బుద్ధి చూపించినట్లుందని అంటాడు.

రేవతి విశ్వక్‌ని కొడుతుంది. భద్రావతి, సేనాపతి ఎందుకు కొడుతున్నావ్ అంటే ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేశాడు.. పగ మనతో అంతం అయిపోవాలి అనుకోవాలి కానీ ఇలా మన పిల్లలకు పంచకూడదు అంటుంది. సేనాపతి రేవతిని కొట్టి పంపేస్తాడు. పెద్దావిడ విశ్వక్‌ని తిడితే నేను పెళ్లే చేసుకోలేదు అని అంటుంది. మన ప్రేమ తన మామ రామరాజు పరువు పోకూడదు అని ఇదంతా చేసిందా అని భద్రావతి అంటుంది. ప్రేమ ఇదంతా చేసింది అంటే నమ్మలేకపోతున్నా.. పుట్టింటికే మోసం చేస్తుందా అని సేనాపతి అంటాడు. మీ వల్ల ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది కదా.. మన వైపు తప్పుంది కదా మనం వాళ్లింద్దరికీ పెళ్లి చేద్దాం..వాళ్లతో మాట్లాడుదాం పదండి అని బామ్మ అంటే భద్రావతి నవ్వుతూ అంత లేదు అని అంటుంది.

ధీరజ్ దగ్గరకు ప్రేమ వెళ్లి మాట్లాడాలని చూస్తే ధీరజ్ చిరాకు పడతాడు. నన్ను ఎందుకు ఇంత మోసం చేస్తున్నావ్.. ఇంతలా నేను నిన్ను ప్రేమిస్తున్నా నా మీద నీకు కనికరం లేదా.. ఇన్ని రోజులు వాళ్లు నా చెల్లిని ఎంత నరకం పెట్టుంటారు.. మీ అన్నయ్యా కావాలని మా చెల్లిని కొట్టినా నీ మనసు కరగలేదా.. ఎన్ని సార్లు అడిగాను దీని వెనక ఎవరైనా ఉన్నారా ఉన్నారా అని అడుగుతూనే ఉన్నాను కదా అంటాడు. ప్రేమ ఎంత సర్ది చెప్పాలి అని చూసినా ధీరజ్ వినడు.. నువ్వు నా కళ్ల ముందుకు రాకు.. నాతో మాట్లాడాలని ప్రయత్నించకు.. అసలు పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయిన నిన్ను నేను ప్రేమించాను చూడు నాది తప్పు.. ఆ రోజు మా అమ్మ మాటలు విని నిన్ను కాపాడాను చూడు నాది తప్పు.. నీ లాంటి వాళ్లకి ఆ కల్యాణ్ లాంటి వాళ్లే కరెక్ట్ అని అంటాడు. ప్రేమ అలా ఉండిపోతుంది. నర్మద విని ధీరజ్‌తో తప్పు ధీరజ్ ఇలా మాట్లాడటం.. నువ్వు కూడా అందరిలా ఆలోచించకు అని అంటుంది. దాంతో కలిసి నువ్వు కూడా ఈ విషయం దాచావు అది నాకు నచ్చలేదు వదినా అని అంటాడు.

ప్రేమ చాలా ఏడుస్తుంది. నర్మద ఊరుకోమని చెప్పినా ఎన్ని మాటలు అన్నాడు అక్కా అని ఏడుస్తుంది. శ్రీవల్లి తల్లికి వీడియో కాల్ చేసి జరిగిందా అంతా పూస గుచ్చి చెప్తుంది. ప్రేమని ధీరజ్ అయితే దగ్గరకు కూడా రానివ్వడం లేదు.. ఇంట్లో అందరూ నర్మద, ప్రేమని ఇంటి పరువు తీస్తున్న కోడళ్లగా అనుకుంటున్నారు అని అంటుంది. ముగ్గురు చిందులేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.