Illu Illalu Pillalu Serial Today Episode ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(జూన్‌ 20న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రామరాజుని బతిమాలుదాం..

విశ్వక్‌ని కోర్టుకి తీసుకెళ్తారు.. అమూల్య చెప్పే సాక్ష్యంతో విశ్వక్‌కి శిక్ష పడుతుందని భద్రావతి, సేనాపతి, రేవతి, బామ్మ బాధపడతారు. రామరాజుని అడిగితే విశ్వక్‌కి శిక్ష పడదు అని బామ్మ అంటుంది. మన మీద పీకల్లోతు కోపంతో ఉన్న వాడు మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దు అని వాడి కూతురికి చెప్తాడా అని భద్రావతి ప్రశ్నిస్తే మనం రామరాజుని బతిమాలితే చెప్తాడు అని బామ్మ అంటుంది. రేవతి కూడా బతిమాలితే ఒప్పుకుంటాడు అని అంటుంది. ఆ కూలోడి ముందు నేను తల దించాలా.. అవసరం అయితే నా ఆస్తి మొత్తం వదులుకుంటా.. అని చెప్తుంది. విశ్వక్‌తో ఈ కేసు అయిన వరకు అమూల్య జోలికి వెళ్లొద్దని అంటుంది.

ALSO READ: Nikhil Maliyakkal: గోరింటాకు నుంచి బిగ్ బాస్ 8 విన్నర్ వరకు.. నిఖిల్ మలయక్కల్ రియల్ లైఫ్ విషయాలు

అమూల్యని వదిలి పెట్టను..

విశ్వక్ బయటకు వెళ్లి కోర్టులో వాదనలు జరిగి నాకు శిక్ష పడుతుంది. ఈ లోపు ఆ అమూల్యని ఏదో ఒకటి చేయడకుండా వదిలిపెట్టను.. నేను జైలుకి వెళ్లే లోపు దాని అంతు చూస్తా అని పగతో రగిలిపోతాడు.

ఈ కోర్టు నోటీస్ ఏంటి..

రామరాజు ఇంటికి కోర్టు నోటిస్ వస్తుంది. రామరాజు ఇంగ్లీష్‌లో ఉన్న ఆ పేపర్‌ని ధీరజ్‌కి ఇస్తాడు. ధీరజ్ చూసి ప్రేమకి ఇస్తాడు. ప్రేమ నర్మదకి ఇస్తాడు. రామరాజు, వేదవతి ఏం అర్థం కాక ముగ్గురి ముఖాలు చూస్తు ఉంటారు. వేద ధీరజ్ వాళ్లతో ఏంట్రా అది అందులో ఏం ఉంది.. నేను చదువుదాం అంటే ఇంగ్లీష్ రాదు.. ఏం ఉందో చెప్పండిరా అని అంటుంది. దానికి ధీరజ్ అమూల్యతో విశ్వక్ మీద కేసు పెట్టించాం కదా వచ్చే వారం నుంచి కోర్టులో ఆ కేసు హియరింగ్ ఉంది అని అంటాడు. అంటే ఏంట్రా అని వేద అడిగితే అమూల్య కోర్టుకి వెళ్లి లాయర్ సమక్షంలో విశ్వక్ తనని కిడ్నాప్ చేసిన విషయం గురించి చెప్పాలి అని నర్మద అంటుంది. అమూల్య కోర్టుకి వెళ్లాలా అని వేద నోరెళ్ల బెడుతుంది. చదువుకున్న పిల్ల పెళ్లి కావాల్సిన పిల్ల ఇలా కోర్టుకి వెళ్తే ఎలారా.. మన ఆడపిల్లని మనమే అల్లరి పాలు చేసినట్లు అవుతుంది కదా అని వేద అంటుంది.

వాడిని వదిలేయండి అన్నయ్యా..

నేనూ అదే చెప్తున్నా అని అంటూ వేదవతి తల్లి, వదిన ఎంట్రీ ఇస్తారు. రేవతి రామరాజుతో అన్నయ్య వాడు చేసిన తప్పునకు నెల రోజులు జైలులో ఉండి వచ్చాడు.. అదే వాడికి శిక్ష అనుకొని వదిలేయండి అన్నయ్యా ప్లీజ్..దయచేసి అమూల్యని ఈ కేసు వెనక్కి తీసుకోమని చెప్పండి అని బతిమాలుతుంది. ఏంటి కేసు వెనక్కి తీసుకోవాలా.. ఆ రోజు వాడు నా చెల్లిని కిడ్నాప్ చేస్తే మా అమ్మ గుండె పగిలేలా ఏడ్చింది.. మా నాన్న ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు.. మా చెల్లికి ఏమైనా అయినా.. మా నాన్నకి ఏమైనా అయినా మీరు వచ్చి ఇలాగే మాట్లాడే వాళ్లా అని ధీరజ్ అడుగుతాడు.

వాడు క్షమించరాని తప్పు చేశాడు...

బామ్మ ధీరజ్ తో ఓరేయ్ మనవడా వాడు క్షమించరాని తప్పు చేశాడు. మీరు మానసిక క్షోభ అనుభవించిన మాట వాస్తవమే.. కానీ వాడికి క్షమాభిక్ష పెడితే మారుతాడు అని బామ్మ అంటే.. జైలుకి వెళ్లి వచ్చినా వాడిలో మార్పు రాలేదు.. పశ్చాత్తాపం రాలేదు అలాంటి వాడిని క్షమించే ప్రసక్తి లేదు అని ధీరజ్ అంటాడు. అన్నయ్య వాడి మీ జోలికి రాకుండా చూస్తా కేసు వెనక్కి తీసుకోండి.. అని అంటుంది. లేదు వాడు చేసిన పనికి నేనే వాడికి శిక్ష వేయాలి కానీ నా భార్యకి మీ ఇంటితో ఉన్న బంధం చూసి ఆగిపోయా అని అంటాడు. అవును అన్నయ్యా నా కొడుకు మూర్ఖడే.. దుర్మార్గుడే కానీ నాకు కన్న ప్రేమ ఉంటుంది కదా.. వాడు జైలుకి వెళ్తే నేను తట్టుకోలేను ఈ ఒక్క సారికి క్షమించండి అని రేవతి దండం పెడుతుంది.

ఈ విషయంలో సాయం అడగొద్దు..

చూడమ్మా నోరారా అన్నయ్యా అంటున్నావ్.. నీకు ఏదైనా కష్టం వస్తే ఈ అన్నయ్య ప్రాణాలు అడ్డు పెట్టి అండగా నిలబడతాడు, కానీ ఈ విషయంలో నాకు సాయం అడగకు అమ్మా.. నా కూతురి జీవితం నాశనం చేయాలి అని చూసిన వాడికి శిక్ష పడాల్సిందే అని రామరాజు వెళ్లిపోతాడు. రేవతి ప్రేమ దగ్గరకు వెళ్లి మీ అత్తమామలకు నువ్వు అయినా చెప్పవే అంటే కూతురి కోసం వాళ్లు బాధ పడటం నేను కల్లారా చూశానమ్మా మరి ఎలా అడగను.. నువ్వు ఇలా అడగటం స్వార్థం అవుతుంది అమ్మా అని ప్రేమ అంటుంది. దాంతో బామ్మ రేవతిని తీసుకొని వెళ్లిపోతుంది.

ఏ ఫొటో కిక్ ఇవ్వట్లేదు..

కాట్రాజ్ అమ్మాయి ఫొటోలను ముందు పెట్టుకొని చూస్తూ ఏ అమ్మాయి ఫొటో కూడా కిక్ ఇవ్వడం లేదు. ఏ ఫొటో కూడా గుండెలకు గుచ్చుకోవడం లేదు.. అందం అనే పదానికి పర్యాయ పదమే ఆడవాళ్లు కదా.. మరి ఈ భూమ్మీద రోజు రోజుకి అందాలు అంతరించిపోవడం ఏంటి అని తెగ సిగరెట్లు కాల్చేస్తాడు. ఇంతలో అతని అసిస్టెంట్ కొన్ని ఊరి ఫొటోలు చూపిస్తాడు. అందులో ప్రేమ ఫొటో కూడా ఉంటుంది. అది చూసి ఆ డ్రాన్స్ మాస్టర్ మతి పోతుంది. కాంపిటేషన్ లో సెలక్ట్ అయ్యావని చెప్పి ప్రేమని రప్పించమని అసిస్టెంట్‌కి చెప్తాడు.

విశ్వక్ దిమ్మ తిరిగిపోయిందే..

విశ్వక్ అమూల్యని చూసి మా నాన్నకి మీ అన్న యాక్షిడెంట్ చేస్తాడా ఈ రోజు ఆ బాధ నీకు తెలుస్తుందని అమూల్యని ఢీ కొట్టడానికి కారులో వెళ్తాడు. అమూల్య దగ్గరకు వెళ్లేటైంకి ధీరజ్ వచ్చి అమూల్యని పిక్ చేసుకుంటాడు. దాంతో ధీరజ్‌కి కనిపిస్తే అంతే సంగతి అని విశ్వక్ కారు అద్దాలు ఎత్తేసి దాక్కుంటాడు. ఇంతలో ధీరజ్ మళ్లీ వెనక్కి వచ్చి కారు దగ్గర నిల్చొంటే విశ్వక్ వణికిపోతాడు.

నా చెల్లి వచ్చే రూట్‌లో ఏం పనిరా..

నా చెల్లి వచ్చే రూట్‌లో నీకు ఏం పనిరా.. చూస్తే నాకు డౌట్‌గా ఉంది.. ఏదో ప్లాన్ చేశావని అర్థమవుతుందని ధీరజ్ అంటాడు. నాకు పని ఉంది అందుకే వచ్చా అని విశ్వక్ అంటాడు. నీ యవ్వారం తేడాగా ఉందిరా.. అని ధీరజ్ అనుమానిస్తాడు. పోలీసులకు ఇప్పుడే కాల్ చేస్తా అని ధీరజ్ ఫోన్ చేస్తే విశ్వక్ సారీ చెప్పి వదిలేయమని అంటాడు. నా చెల్లి వెళ్లే దారిలోనే కాదు తను ఉన్న ఏరియాలో కనిపించినా నీ జీవితం కటకటాల పాలే అని వార్నింగ్ ఇచ్చి ధీరజ్ వెళ్లిపోతాడు.

కచేరికి వెళ్దాం పద..

వల్లీ చంకలో డ్రింక్ బాటిల్ పెట్టుకొని స్నాక్స్ పట్టుకిని బయల్దేరితే ఎక్కడికి అని సుకన్య అంటే కచేరికి అని అంటుంది. ఏంటే ఉదయం నుంచి కచేరి కచేరి అని అంటున్నావ్ అంటే దాని గురించి చెప్తే అర్థం కాదు చూస్తే అర్థం అవుతుందని వల్లీ సుకన్యని తీసుకెళ్తుంది. నువ్వు రావు అనుకున్నాం వల్లి అక్కాయ్ స్కూల్ పిల్లలా భలే టైంకి వచ్చేశావ్ అని ప్రేమ అంటుంది. నర్మద కూడా సెటైర్లు వేస్తుంది. మొత్తానికి నలుగురు ఆరు బయట కచేరి మొదలు పెట్టడానికి కూర్చొంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.