Illu Illalu Pillalu Serial Today Episode ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(జులై 4న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి..

ఉదయం వెళ్లిన ప్రేమ ఇంకా రాలేదు అని వేదవతి చాలా టెన్షన్ అవుతూ ఉంటుంది. నర్మద వేదవతి దగ్గరకు వచ్చి మూతి తిప్పి ప్రేమ వాళ్లు ఎంత వరకు వచ్చారా అని ఫోన్ చేయాలని అనుకుంటుంది. ఇక డ్యాన్స్ కాంపిటేషన్‌లో డ్యాన్స్‌ ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి. ధీరజ్ ప్రేమ మీద చేయి ఎత్తి నీకు బుద్ధి ఉందా.. అసలు ఎవడు నీకు ఇక్కడికి రమ్మన్నాడు.. ముక్కూముఖం తెలీనివాళ్లని నమ్మి ఎలా వస్తావ్ రోజులు అసలే బాలేవు.. చదువుకున్నావ్ కదా ఆ మాత్రం తెలీదా.. ఏమైనా జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి అని తిడతాడు. దానికి ప్రేమ నీకు కారు కొనివ్వాలి అని వచ్చానురా.. అని అంటే ధీరజ్ ప్రేమని ఇంకా తిడతాడు. ఇంతలో ప్రేమ పెర్ఫ్మామ్ చేయాలి అని అనౌన్స్ మెంట్ వస్తుంది. ప్రేమ అని పిలుస్తున్నారు వినబడటం లేదా వెళ్లు అని ధీరజ్ అంటాడు. ప్రేమ షాక్ అయిపోతుంది. నీకు సెలక్ట్ అయ్యే అంత సీన్ లేదు కానీ ఎలాగూ వచ్చావ్ కదా వెళ్లి డ్యాన్స్ చేయ్ అని అంటాడు. దాంతో ప్రేమ సంతోషంగా ధీరజ్‌కి ముద్దు పెట్టి వెళ్తుంది.

ALSO READ: Illu Illalu Pillalu Serial Today July 3rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమని టార్చర్ చేసిన కామాంధుడు! ధీరజ్‌కి ప్రేమ పరిస్థితి తెలిసిందా!

బాబు మీ ఆవిడ ఎక్కడ..

ప్రేమ వెళ్లగానే ధీరజ్‌కి నర్మద కాల్ చేసి ఏంటి పరిస్థితి అని అడుగుతుంది. అంతా బాగుంది వదినా కాసేపట్లో ప్రేమని తీసుకొని బయల్దేరుతా అని ధీరజ్ అంటాడు. నర్మద ధీరజ్‌తో మాట్లాడటం చూసిన వేదవతి అడిగితే బెట్టు చేస్తుంది కానీ పిల్లులు ఎప్పుడు వస్తారో తెలుసుకునేది ఎలా.. అని అటూ ఇటూ అవుతూ ఏంటట ఎప్పుడు వస్తారు అని అంటుంది. నర్మద అటూ ఇటూ చూసి తనని కాదు అన్నట్లు నటిస్తుంది. శ్రీరామ శ్రీరామ అంటే అన్నాను అంటారు కానీ వెక్కించబోయి బొక్కాబొర్లా పడ్డట్టు సమాధానం చెప్పకుండా అలా దిక్కులు చూడటం ఏంటో అని వేదవతి అంటుంది. ఏంటి నన్నా..అని నర్మద అంటే ఇక్కడ నువ్వు కాకపోతే ఇంకెవరు ఉన్నారు మీ తాతా అని వేద అంటే మీరు నాతో మాట్లాడరు కదా అని నర్మద అంటుంది. ఇంతకీ ధీరజ్ ఏం అన్నాడు అని వేద అడిగితే మీకు ఎందుకు చెప్పాలి.. మామూలుగా అయితే చెప్పేదాన్ని కానీ మీకు నాకు మాటలు లేవు కదా అందుకే చెప్పను అని నర్మద వెళ్లిపోతుంది. దాంతో గడుసు గడుసుది అని వేదవతి అనుకుంటుంది.

ALSO READ: Karthika Deepam 2 Serial Today July 3rd: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి ముద్దు పెట్టిందా! సూరజ్‌ కోసం ఆఫీస్‌కి వచ్చిన దక్షిణామూర్తి!

బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే..

ప్రేమ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే అంటూ ప్రేమ డ్యాన్స్ ఇరగదీస్తుంది. ధీరజ్ దూరం నుంచి చూసి మురిసిపోతాడు. మధ్యలో డ్యాన్స్ వేసి ప్రేమ పడిపోతుంది. అందరూ షాక్ అయి చూస్తారు. జడ్జ్‌లు కూడా ఏమైందా అనుకుంటారు. ప్రేమ నిల్చొ లేకపోతుంది. దాంతో ధీరజ్ స్టేజ్ మీదకు వెళ్లి కస్తూరిలా మారి నీ నుదిటనే చేరి కడదాకా కలిసుండనా అంటూ మురారి సినిమాలో మహేశ్ బాబు సాంగ్‌కి డ్యాన్స్ వేస్తాడు. ప్రేమ, ధీరజ్‌ డాన్స్‌లకు అందరూ ఫిదా అయిపోతారు. జడ్జ్‌లు వచ్చి ప్రేమ విన్నర్ అని ప్రకటించి 10 లక్షలు ఫ్రైజ్‌ మనీ ఇస్తారు. ప్రేమ ధీరజ్ ఇద్దరూ కలిసి పది లక్షలు చెక్ తీసుకుంటారు.

కారుతో ఇంటికొచ్చిన ధీరజ్..!

ఉదయం అయినా ప్రేమ ధీరజ్ ఇంకా రాలేదు అని ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో ప్రేమ ధీరజ్‌లు కొత్త కారులో ఇంటికి వస్తారు. అందరూ బయటకు వెళ్తారు. ఈ కారు ఎవరిదిరా చిన్నోడా అని వేద అడిగితే ఎవరిదో ఏంటి అమ్మ మనదే ఆ రోజు ఫైనాన్సర్ తీసుకెళ్లాడు కదా అదే అని ధీరజ్ చెప్తాడు. అతను మానవత్వం లేని వాడు కదరా.. ఆ రోజు ఎంత బతిమాలినా ఇవ్వని వాడు ఇప్పుడు ఎలా ఇచ్చాడు అంటే కారు డబ్బు మొత్తం వాడి ముఖాన కొట్టి కారు తీసుకొచ్చా అని ధీరజ్ అంటాడు. కారు డబ్బు మొత్తం కట్టేశావా అని నర్మద అంటే అవును వదినా ఇప్పుడు ఇది మన సొంత కారు అని డబ్బు మొత్తం కట్టేశా అని ధీరజ్ అంటాడు. రాత్రికి రాత్రే అంత డబ్బు అంటే ఏదైనా స్కీమ్‌లు స్కామ్‌లు చేసుండాలి అని వల్లీ అంటే కొంత మంది అంతేలే వదినా ఉదయం లేచినప్పుడు నుంచి వాళ్లకి అదే పని కానీ మా చిన్న అన్నయ్య చిన్న వదినా కొంత మందిలా దిగజారి ప్రవర్తించరు అని అమూల్య అంటుంది. ఒక్క రోజులో పది లక్షలు ఎలా ఏదైనా అద్భుతం జరిగిందా లాటరీ తగిలిందా అని అంటుంది. దాంతో ధీరజ్ సూపర్ వదినా మీరు కరెక్ట్‌గా చెప్పారు.. ఆ లాటరీ తగిలే పది లక్షలు వచ్చాయి అని అంటాడు. అవును మామయ్య ఇచ్చిన డబ్బుతో చీర కొంటే లక్కీ డ్రిప్‌లో పది లక్షలు వచ్చాయి అని ప్రేమ అంటుంది. మీ ఫ్రెండ్ వాళ్ల అమ్మకి బాలేదు అని వెళ్లావ్ మరి ఇదంతా ఏంటి అని అంటే పక్కనే షాప్ ఉందని వెళ్లా అంతే అని అంటుంది ప్రేమ. వేదవతి ప్రేమ లక్కీ అని భర్తకి బాగా కలిసొస్తుందని అని నర్మదని చూసి కొంత మంది ఉంటారు మొగుడుని అప్పుల పాలు చేసేస్తారు అని వెటకారం చేస్తుంది. నర్మద ప్రేమని పక్కకి తీసుకెళ్లి కోపంగా చూస్తే అక్కా నా మొగుడు తిట్టిన తిట్టు తిట్టకుండా కొట్టడానికి కూడా చేయి ఎత్తాడు. నువ్వు ఇప్పుడు అలా చూడకు భయం వేస్తుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.