Illu Illalu Pillalu Serial Today Episode | ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(జులై 20న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వాళ్లింట్లో నీ పుట్టిన రోజు వేడుక చేద్దాం..

రేవతి అందరి కోసం టిఫెన్స్ సర్దుతూ ఉంటుంది. భద్రావతి, సేనాపతి వచ్చి తన తల్లిని పిలుస్తారు. తినను అని చెప్పాను కదా.. అయినా వినరా అని బామ్మ అంటుంది. మనింట్లో పనోడితో లేచిపోయిన దాన్ని పుట్టిన రోజు వేడుకలకు పిలవమని చెప్పడం ఏంటమ్మా.. మన పరువు తీసిన దాన్ని మన ఇంట్లోకి రమ్మని అంటున్నావ్.. రెండు కుటుంబాలతో గ్రూప్‌ ఫొటో కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నావ్ అని సేనాపతి అంటాడు. భద్రావతి తల్లితో ఏంటమ్మా ఇది ఇలా పంతం పడితే ఎలా అని భద్రావతి అంటే ఇది పంతం కాదు.. బాధ.. జీవితంలో ఒక్కసారి అయినా నా చిన్న కూతురితో మీరు కలిసిపోతే చూడాలి అనుకుంటున్నా.. కానీ నేను బతికుండగా అది చూడలేను అని అర్థమైంది అని బామ్మ బాధ పడుతుంది. ఇప్పుడేంటి నీ పుట్టిన రోజు వేడుకల్లో ఆ కుటుంబం ఉండాలి అంతే కదా.. నాకు ఆ ఫ్యామిలీ ఇష్టం లేదు.. కానీ కేవలం నీ సంతోషం కోసం ఒప్పుకుంటున్నా అని అంటుంది. బామ్మ, రేవతి సంతోషపడితే.. సేనాపతి మాత్రం నేను ఒప్పుకోను అక్కా పుట్టినరోజు వద్దు ఏం వద్దు అంటే భద్రావతి తమ్ముడిని తిట్టి ఆ రోజు నాన్నని పోగొట్టుకున్నా.. ఇప్పుడు అమ్మని పోగొట్టుకోలేం అని చెప్పి.. అమ్మా నువ్వు కోరుకున్నట్లు అంతా జరుగుతుంది కానీ పుట్టిన రోజు వేడుకలు వాళ్ల ఇంట్లో జరిపిద్దాం అక్కడికి మనం వెళ్దాం అని భద్రావతి అంటుంది. బామ్మ చాలా సంతోషపడుతుంది. (వల్లీ ఇచ్చిన ప్లాన్‌ ప్రకారమే భద్రావతి ఇదంతా చేస్తుంది.)

ALSO READ: Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు

మీ అక్క ఒప్పుకుందే..

బామ్మ సంతోషంగా రామరాజు ఇంటికి వస్తుంది. శ్రీవల్లి ఎదురెళ్లి ఏంటి బామ్మ గారు మీరు ఒక్కరే వచ్చారు మిగతా అందరూ రాలేదా అని శ్రీవల్లి అంటే అదేంటి అలా అడిగావ్ అని బామ్మ అంటే అదే మీరే వచ్చారా అని అడిగాను అంటుంది. ఇక శ్రీవల్లి ఇంట్లో అందరికీ పిలుస్తుంది. మా అమ్మ వస్తుంది అని నాకు తెలీదా.. నువ్వు చెప్పాలా అని వేదవతి శ్రీవల్లిని అంటుంది. చాలా సంతోషంగా ఉంది వేదవతి.. ఇది కలో నిజమో కూడా తెలీదు.. మంచి విషయం తీసుకొచ్చా అని బామ్మ అంటుంది. ఏంటి అని అందరూ అడిగితే రేపు నా 70వ పుట్టిన రోజు.. మన రెండు కుటుంబాల మధ్య పుట్టిన రోజు జరగాలి అని రెండు కుటుంబాలతో గ్రూఫ్ ఫొటో కావాలి అని మీ అక్కని బతిమాలాను మీ అక్క ఒప్పుకుంది అని బామ్మ అంటుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు.

ఇదో కుట్ర.. ఆ రెండూ కాదు..

ధీరజ్ బామ్మతో అమ్మమ్మగారు మీరు ఇందాక అన్నారు కదా ఇది కలో నిజమో అని ఈ రెండూ కాదు.. ఇదో కుట్ర అని అంటాడు. శ్రీవల్లి బిత్తరపోతుంది. తన ప్లాన్ తెలిసిపోతుందా అని కంగారు పడుతుంది. అదేంట్రా అలా అంటున్నావ్ అని ప్రేమ అంటే.. అవును.. మొన్న కోర్టులో కూడా మన మీద బుసలు కొట్టిన మీ అత్త.. రెండు రోజుల్లో మారిపోయి.. మనల్ని తన కుటుంబంలో కలుపుకోవడానికి రెడీ అయిపోయి పుట్టిన రోజు వేడుకలు చేయాలని ఒప్పుకుందంటే దీని వెనక ఏదో ఉందని అర్థం చేసుకోవాలి అని అంటాడు. వీడిది చిన్న బుర్ర కాదు అని వల్లీ అనుకుంటుంది. రేయ్ మా అత్త నానమ్మ కోసం ఓ మెట్టు దిగింది అని ప్రేమ అంటే అంత సీన్ లేదు మీ అత్త అన్నం తినకుండా ఈ ఇంటి మీద పగ తింటూ బతుకుతుంది అలాంటిది నమ్మకం లేదు అని ధీరజ్‌ అంటాడు.

ఏంటి అత్తయ్యా గారు మా ఇంట్లో చేయమన్నారా..

బామ్మ ధీరజ్‌తో ముందు అడిగితే వద్దు అన్నారు.. కానీ నేను తిండి తిప్పలు మానేస్తామని అంటే ఈ ఇంట్లో పుట్టిన రోజు చేయమని చెప్పిందని బామ్మ అంటుంది. ఏంటి అత్తయ్య గారు మా ఇంట్లో చేయమని చెప్పారా.. నాకు అనుమానంగా ఉంది.. పాతికేళ్లగా నా మీద కోపంతో రగిలిపోతున్నా వాళ్లు నా ఇంటికి వచ్చి మీ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటా అనడం అనుమానంగా ఉందని రామరాజు అంటాడు. దాన్ని వల్లీ కవర్ చేయడానికి వాళ్లతో ఇంత మార్పు రావడానికి అమూల్యనే కారణం అండీ.. అమూల్య విశ్వక్ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంది కదండీ.. మేనల్లుడి జీవితం జైలు పాలు కాకుండా కాపాడిందని ఆ భద్రావతిలో కొంచెం మార్పు వచ్చింది అని వల్లీ అంటుంది. ఏయ్ నిన్ను ఎవరు అడిగారే అని వేదవతి అంటుంది. మీ ఇంట్లో జరిపించండి మేం అక్కడికి వస్తాం అని ధీరజ్ అంటే మా అత్త ఒక మెట్టు దిగింది.. నువ్వేందుకురా అలా అంటావు అని ప్రేమ అంటే నాకు అనుమానంగా ఉంది అని ధీరజ్ అంటాడు. నాకు అనుమానంగా ఉందని చందు అంటాడు.

నా భార్య కోసం ఒప్పుకుంటా..

బామ్మ రామరాజు దగ్గరకు వెళ్లి అయ్యా రామరాజు నా పెద్ద కూతురు పెళ్లి చేసుకోలేదు అని బాధతో నా భర్త చనిపోయారు.. రెండు కుటుంబాలు కలవాలి అని పాతికేళ్లగా చూస్తున్నా.. దయచేసి నా బాధ అర్థం చేసుకోండి.. అని ఏడుస్తూ అడుగుతుంది. వేదవతి కూడా ఒప్పుకోమని చెప్తుంది. దాంతో రామరాజు సరే అంటాడు. అత్తయ్యా గారు నాకు వాళ్లు చేసిన పనుల మీద తప్ప వాళ్ల మీద ఎలాంటి కోపం లేదు.. ఈ రూపంలో నా భార్య కళ్లతో సంతోషం చూడటానికి ఒప్పుకుంటున్నా అని రామరాజు అంటారు. బామ్మ చాలా చాలా సంతోషపడుతుంది. ఏర్పాట్లు అన్నీ చూడమని రామరాజు తిరుపతికి చెప్తాడు. బామ్మ వెళ్లిపోయిన తర్వాత వేదవతి చాలా సంతోషంగా పాతికేళ్ల తర్వాత మా అక్క అన్నయ్యా మన ఇంటికి వస్తున్నారు.. కాళ్లు చేతులు ఆడటం లేదు అని వేదవతి రామరాజు భుజం మీద వాలిపోతుంది. వల్లీ ధీరజ్, ప్రేమని కోపంగా చూసి రేపు జరగబోయేది.. సంతోషం కాదు.. రేపు సాయంత్రం మీరంతా కన్నీరు పెట్టుకుంటారు.. మీ చిన్నకొడుకు, కోడలు విడిపోతారు అని అనుకుంటుంది.

నీకు బుద్ధిలేదే..

ఇలా ఎందుకు చేశావా.. భాగ్యం, వల్లీతో మంచి ఆయుధం ఇస్తే నువ్వేంటే ఇలా చేశావ్.. బంగారం లాంటి అవకాశం పొగొట్టేశావ్ అని భాగ్యం అడిగితే దానికి వల్లీ నా భర్తతో తిట్టించి అత్తతో కొట్టించిన వాళ్ల కాపురం బాగుండనిస్తానా.. రేపు పుట్టిన రోజు వేడుకల్లో నేను ఇచ్చిన బ్రహ్మాండమైన బాంబ్ భద్రావతి చేతిలో పెట్టా.. మీరు మాత్రం అటు రావొద్దు మీ మీద అనుమానం వస్తుందని వల్లీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.