Illu Illalu Pillalu Serial Today Episode ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(జులై 13న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏం వినలేదు అంటూ మొత్తం వినేసిందా..

చందు బయట పడుకోవడానికి వెళ్తుంటే వల్లీ ఆపుతుంది. నువ్వు అంటేనే నాకు కంపరం.. మరి నువ్వు ఉన్న గదిలో నేను ఎలా ఉంటాను అని చందు అంటాడు. దానికి వల్లీ నువ్వు బయటకు వెళ్తే మామయ్య చూస్తే ఏం చెప్తావ్.. ఒక రోజు చెప్తావ్.. రెండు రోజులు చెప్తావ్ తర్వాత నిజం తెలిసిపోతుంది. నన్ను అసహ్యించుకుంటున్న భర్తతో నేను కాపురం చేసేంత దిగజారలేదు.. మీరు మీద పడుకోండి.. నేను కింద పడుకుంటా.. అని చెప్పి కింద పడక వేసుకుంటుంది. బెడ్ మీద చందుకి పడక వేస్తుంది. కింద పడుకొని వల్లీ వేదవతి మాటలు గుర్తు చేసుకుంటుంది. ప్రేమ, ధీరజ్‌ల పెళ్లి రహస్యం వినలేదు అని అని చెప్పింది కానీ వల్లీ మొత్తం వినేసుంటుంది. ప్రేమ, ధీరజ్‌కి ఇష్టం లేని పెళ్లి తానే చేశానని వేదవతి ప్రేమ వాళ్లతో మాట్లాడిన విషయం గుర్తు చేసుకొని రగిలిపోతుంది. ప్రేమ కల్యాణ్‌తో లేచిపోవడం తర్వాత ప్రేమని ధీరజ్ పెళ్లి చేసుకోవడం ఇవన్నీ వల్లీకి తెలిసిపోతాయి. మీ పెళ్లి వెనక ఇంత పెద్ద రహస్యం ఉందా.. మీ పని చెప్తా.. ప్రేమగా చూసుకొనే నా భర్తని నన్ను దూరం చేశారు.. నా జీవితంలో లేని సంతోషం మీకు దూరం చేస్తా అని వల్లీ అనుకుంటుంది.

ALSO READ: Karthika Deepam 2 Jyotsna: కార్తీక దీపం 2 కోసం బండెక్కిన జ్యోత్స్నా... గాయత్రీ సింహాద్రి ఫోటోలు

ఆ విషయం తెలిస్తే ఏంట్రా..

ప్రేమ దిగులుగా ఉంటే ధీరజ్ ఏమైందని అడిగితే మన పెళ్లి విషయం గురించి మీ అమ్మ నిన్న మాట్లాడినప్పుడు మీ వదిన వినేసిందని భయపడ్డానురా.. ఒక వేళ ఆ విషయం మీ నాన్నకి కానీ మా ఇంట్లో వాళ్లకి తెలిస్తే ఏంట్రా పరిస్థితి అని ప్రేమ ఏడుస్తుంది. ఆ రోజు నన్ను కాపాడటానికి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావ్.. నా జీవితంలో రిగ్రేట్స్ ఏం లేవురా.. ఆ కల్యాణ్‌ని నమ్మడం తప్ప.. నేను కల్యాణ్ కోసం లేచిపోయిన విషయం మా ఇంట్లో తెలిస్తే నేను తట్టుకోలేనురా.. అందరి ముందు బ్యాడ్ అవుతానురా.. ఆ గిల్ట్ నేను తట్టుకోలేనురా అని ప్రేమ అంటుంది. నా జీవితంలో కల్యాణ్‌ అనే చేదు నిజం ఉందనే విషయం ఎప్పటికీ మా వాళ్లకి తెలీకూడదు.. కల్యాణ్ మోసం చేస్తే నేను చచ్చిపోవాలని అనుకుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావ్ అని మా వాళ్లకి తెలీకూడదు.. ఎప్పటికీ ఈ విషయం మా వాళ్ల దగ్గర మాట్లాడను అని మాటివ్వరా అని ధీరజ్ దగ్గర మాట తీసుకుంటుంది.

వాడిని పెళ్లి చేసుకోవే..

సుకన్య తట్టాబుట్టా సర్దేస్తుంది. భాగ్యం సుకన్యతో అప్పుడే ఎక్కడికే అని అంటే వల్లీని చూసుకోమని నాకు క్యారెక్టర్ ఇచ్చావ్.. ఇప్పడు నా క్యారెక్టర్ అయిపోయింది కదా పోతా అని సుకన్య అంటే నీ లైఫ్‌ సెట్ అయిపోయే విషయం చెప్తా విను అని భాగ్యం అంటుంది. ఏంటి అత్త అది అని సుకన్య అడిగితే దానికి భాగ్యం నువ్వు అంటే ఆ తిరుపతికి ఇష్టం కదా వాడిని పెళ్లి చేసుకోవే లైఫ్ సెట్ అయిపోతుందని భాగ్యం అంటుంది. హీరోయిన్ అవ్వాల్సిన నేను ఆ కమెడియన్‌గాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని సుకన్య అంటే వాడు చూడటానికి అలా ఉంటాడు కానీ వాళ్ల నాన్న జమిందారే వాడిని పెళ్లి చేసుకుంటే లెక్క లేనంత ఆస్తి వస్తుంది.. దానికి నువ్వే యజమాని అవుతావ్ అని భాగ్యం అంటుంది. ఆలోచిస్తే నువ్వు చెప్పింది కరెక్టే అత్త., కానీ వాడు నా వెనక కుక్క తిరిగినట్లు తిరిగాడు,.. కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు అని సుకన్య అంటే ఇప్పటికీ మన ఇంటి చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడు అని తిరుపతిని చూపించి వాడిని కరిగించేయ్ అని అంటుంది. సుకన్య తిరుపతి దగ్గరకు వెళ్లి ముందు అంతా ఏదో అనుకున్నా కానీ నీ కోట్లు చూసి నా గుండె తిరు తిరు అని కొట్టేసుకుంటుందని అంటుంది. నా గుండె కూడా సుక్కు సుక్కు అని కొట్టేస్తుందని అంటాడు. అప్పుడప్పుడూ వస్తూ ఉండండి అని సుకన్య అంటుంది. సుక్కు నాకు పడిపోయింది అని సంతోషంతో బండి స్పీడ్‌గా నడిపి చెట్టుకు గుద్ధి చెట్టెక్కిపోతాడు.

ప్రేమని పోలీస్ చేసేద్దాం..

చందు రైస్ మిల్లు లెక్కలు తండ్రికి చూపిస్తాడు. మీ నాన్న రైస్‌ మిల్లు బాధ్యతలు నీకు ఇచ్చేశారు కదా.. ఇంకా ఎందుకురా మీ నాన్నకి ప్రతీది చూపిస్తావ్ అని వేదవతి అడిగితే నాన్నకి ప్రతీ రూపాయి లెక్క చూపించడం నా బాధ్యత అని చందు అంటాడు. అప్పుడే సాగర్ ఆఫీస్‌కి వెళ్తూ ఉంటే రామరాజు చూసి బుజ్జమ్మా నా కష్టానికి నా బాధ్యతలకు నిజమైన వారసుడు అంటే పెద్దోడే.. కొంత మందిలా రైస్ మిల్లు చూసుకోవడం అంటే కూలిపని నామోషీ అని అనుకోడే అని సాగర్‌కి సెటైర్లు వేస్తాడు. దాంతో సాగర్ కావాలనే ఫోన్ తీసి సార్ నేను నా భార్యే మా ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగులం.. మిగతా వాళ్లు చెప్పుకునే అంత సీన్ లేదు.. ఒకరు కారు డ్రైవర్.. ఇంకొకరు రైస్మిల్లులో పని చేస్తున్నారు అని అందరూ వేలిముద్రగాలు అని సాగర్ వెటకారం చేస్తాడు. దాంతో ధీరజ్ వేదవతి దగ్గరకు వెళ్లి ప్రేమని పోలీస్‌ చేయడానికి ఇదే మంచి అవకాశం అని వేదవతికి ప్లాన్ చెప్తాడు. వేదవతి నర్మదకి ఆ ప్లాన్ చెప్తుంది. ఏంట్రా నువ్వే గవర్నమెంట్ అని అనుకుంటున్నావా అని ధీరజ్ అంటే అవునురా మన ఇంట్లో ఇంకెవరు ఉన్నారురా అంత చదువుకున్నవాళ్లు.. అని సాగర్ అంటే నా భార్య ఉందిరా అని ధీరజ్ అంటాడు. సాగర్ నువ్వుతాడు. దాంతో వేదవతి ఏరా నవ్వుతున్నావ్.. ప్రేమకి పోలీస్ అవ్వాలని ఉందిరా.. తను తలచుకుంటే అయిపోతుంది అని వేదవతి అంటే అవునురా నేనే దగ్గరుండి తనని పోలీస్‌ని చేస్తా అని ధీరజ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.