Illu Illalu Pillalu Serial Today Episode ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(ఆగస్టు 12న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నా మీద నీకు అది వస్తుందా?

అమూల్య, విశ్వక్ ప్రేమ, ధీరజ్‌లను కలపడం కోసం చాటుగా మాట్లాడుకుంటారు. ప్రేమ వదిన నాకు ఒంటరిగా దొరికేలా చేయ్ అని అమూల్య అంటే ఎందుకు అని విశ్వక్ అడుగుతాడు. దానికి అమూల్య అమ్మమ్మ బర్త్డేని అడ్డు పెట్టుకొని మీ నాన్న, అత్త ఎంత ప్లాన్‌గా మా ఇంటికి వచ్చి అందరితో సంతోషంగా ఉన్నట్టు ఆస్కార్ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసి మా అమ్మని నాన్నని రెచ్చగొట్టి ఆ కల్యాణ్ గాడి విషయం మా అన్నయ్య చేత చెప్పించేలా డ్రామా చేశారు కదా? ఆ విషయం ప్రేమ వదినకి అర్థమయ్యేలా చెప్పి, బర్త్డే ఫంక్షన్లో ఎలా అయితే అందరి ముందు, వాళ్లని విడదీశారో ఈ గుడిలో అందరి సమక్షంలో మీ నాన్న అత్తయ్య బండారం బయటపెట్టి ప్రేమ వదినని మా అన్నయ్యని కలిపి మా ఇంటికి తీసుకెళ్తాం అని అమూల్య అంటుంది. దానికి విశ్వక్ సూపర్.. సూపర్ ప్లాన్ అమ్మాయి. ఇక నేను చూసుకుంటాలే అవునమ్మాయ్ ఇప్పుడు ప్రేమ, ధీరజ్ బావని కలిపించే ప్రోగ్రాం సక్సెస్ అయితే నా మీద నీకు అది వస్తుందా? అమూల్య కోపంగా చూస్తుంది.. దానికి విశ్వక్ ఈ మాటర్ మనం పర్సనల్గా మాట్లాడుకుందాం అని వెళ్లిపోతాడు.

ALSO READ: Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?

ఎంత ప్రేమించానే..

ధీరజ్ ప్రేమ చేష్టలకు బాధగా వెళ్లిపోతాడు. ఎంత ప్రేమించానే నిన్ను ఇంత ద్వేషంగా ఎలా మారిపోయావే.. నేనే ప్రాణం నేనే ప్రపంచం అన్నావ్ కదా.. మరి ఒకేసారి నేను నీకు ఏమీ కాని వాడిని అయిపోయానా అని బాధపడుతూ నడుస్తూ ఉంటాడు. మరోవైపు ప్రేమ కూడా పూజలో నీ పేరు చెప్పనందుకు.. నీతో కుంకుమ పెట్టించుకోనందుకు చాలా బాధగా ఉందిరా,,. కానీ నేను ఎవరితోనే లేచిపోయా అని చెప్పావ్ చూడు అది నా మనసులో నీ ప్రేమని చంపేస్తుందిరా అని అనుకుంటుంది.

ALSO READ: White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

ధీరజ్‌కి ప్రమాదం..

ధీరజ్ అలా గుడి ఆవరణతో ఉంటే ఎదురుగా ఓ పెద్దాయన కళ్లు తిరిగి పడిపోబోతే ధీరజ్ పట్టుకోవడానికి వెళ్తాడు. ఆయన్ను పంపించిన తర్వాత ధీరజ్ ఓ పందిరి కింద నిల్చొంటాడు. అప్పుడే పందిరి కూలిపోతుంది. దాంతో ధీరజ్ తలకి గాయం అవుతుంది. అందరూ కంగారుగా అక్కడికి వెళ్తారు. వేదవతి చాలా ఏడుస్తుంది. ప్రేమ చూస్తుంది కానీ దగ్గరకు వెళ్లకుండా దూరం నుంచి చూస్తుంది. ధీరజ్ తలకి కాస్త పెద్దగానే దెబ్బ తగలడంతో వేదవతి చాలా ఏడుస్తుంది. ప్రేమ పంతులు చెప్పిన మాటలు తలచుకొని కన్నీరు పెట్టుకుంటుంది. ప్రేమ ధీరజ్‌ని చూసి ఏడుస్తుంది కానీ ధీరజ్ దగ్గరకు వెళ్లదు. తర్వాత గుడిలోకి పరుగులు తీస్తుంది. పంతులు దగ్గరకు వెళ్లి నా భర్త పేరు ధీరజ్ అర్చన చేయండి అని అంటుంది. పంతులు అర్చన చేస్తారు. ధీరజ్ పేరు చెప్పకుండా తప్పు చేశా.. క్షమించు తల్లీ వాడు క్షేమంగా సంతోషంగా ఉండాలి అని మొక్కుకుంటుంది.

ALSO READ: Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి

నాకేం చెప్పొద్దు..

ప్రేమ బయటకు వస్తే ధీరజ్ ప్రేమ దగ్గరకు వచ్చి ప్రేమ నీతో మాట్లాడాలి అని అంటాడు. ప్రేమ వెళ్లిపోతుంటే చేయి పట్టుకొని ఆపుతాడు. చేయి వదులు అని ప్రేమ అరిస్తే సారీ ప్రేమ అసలు ఆరోజు ఏం జరిగిందో నీకు చెప్పాలి అని ధీరజ్ అంటే ఏం చెప్పొద్దు అని ప్రేమ అంటుంది. వేదవతి, నర్మద కూడా వచ్చి మేం చెప్పింది వినవే అని అడిగితే అప్పుడు మీ కొడుకు ఆ మాట జారిపోతే ఆపలేకపోయాను మీరు ఇప్పుడేం చెప్తారు అని ప్రేమ అంటుంది. ఆ రోజు ఏం జరిగిందో మీ వాళ్లు మన ఇంటికి ఎందుకు వచ్చారో చెప్పాలని ప్రయత్నిస్తున్నాం అని నర్మద అంటే ప్రేమ ఏం చెప్పొద్దని అనేస్తుంది.

Also Read: Rukmini Vasanth Mollywood Debut - మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?

ప్రేమకు అవమానం..

ధీరజ్ జేబులో నుంచి చైన్ తీసి నాన్న మీ అందరి కోసం చైన్స్ తీసుకొచ్చారు. ఇది నీదే తీసుకో అని అంటే ప్రేమ వద్దు అని వెళ్లిపోతుంటే ధీరజ్ ఆపడానికి చేయి పట్టుకుంటే ప్రేమ జాకెట్ చిరిగిపోతుంది. రెండు ఫ్యామిలీలు అది చూసి షాక్ అయిపోతారు. ప్రేమ సిగ్గు అవమానంతో తల దించుకుంటుంది. రామరాజు ధీరజ్‌ని లాగిపెట్టి కొడతాడు. తనకి ఇష్టం లేకపోతే మాట్లాడకూడదు.. ఇలా అందరి ముందు సిగ్గు పడేలా చేస్తావా.. మొన్నటి మొన్న నీ మాటలతో తను బాధ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేశావ్,, ఇప్పుడు ఇలా.. ఒక భర్తలా ప్రవర్తిస్తున్నావా అని రామరాజు ధీరజ్‌ని తిడతాడు. ఏంటయ్యా.. నువ్వు నా మేనకోడలుని ఏం చేద్దామనుకుంటున్నారు. దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వరా మీరు అని భద్రావతి మొసలి కన్నీరు కార్చుతుంది. ఇది వాడికి, వాడి భార్యకి సంబంధించిన విషయం, వాళ్లు మాట్లాడుకుంటారు. భార్యకు కలిగిన బాధకు వాడు సమాధానం చెప్పుకుంటాడు. మధ్యలో నువ్వు జోక్యం చేసుకోకు అని వేదవతి అంటుంది. ఎలా జోక్యం చేసుకోకుండా ఉంటాను. మీరు అడుగు అడుగునా దానిని బాధపెడుతుంటే నరకం చూపిస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉండగలను అని భద్రావతి ఏడుస్తుంది. ఏదో పొరపాటు జరిగిపోయిందని అంటున్నాడుగా దానికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు అని భద్రావతిని తన తల్లి శారద అంటుంది.

Also Read: Kalki 2 - ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

ప్రేమ నాతో వచ్చేయ్..

ధీరజ్ భద్రావతిని ఆపమని అడ్డుకుంటాడు. తను బాధలో ఉంటే ఓదార్చాను. భయంతో ఉంటే ధైర్యం చెప్పాను. ఈ జీవితం నాకెందుకు అనే నిరాశలో ఉంటే నీకోసం నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చాను. అన్నింటికంటే ముఖ్యంగా మీ అందరికంటే ఎక్కువగా ప్రేమించాను. మరి నేను ప్రాణంగా ప్రేమించిన నా భార్యను నేనెందుకు బాధపెట్టుకుంటాను. అందరికీ దండం పెట్టి చూడండి. తనకి సర్దిచెప్పి తనని నాతో తీసుకెళ్లిపోవడానికి వచ్చాను. దయచేసి ఎవరు మధ్యలోకి రాకండి. ప్రేమ.. నీకు బాధ కలిగినందుకు వందసార్లు క్షమాపణ చెప్తాను. జరిగింది మర్చిపోదాం. ఇలా ద్వేషంతో కాకుండా ఇంతకుముందులా ప్రేమగా కలిసి ఉందాం. దయచేసి నా మాట విను. నన్ను అర్థం చేసుకో ప్రేమ అని ధీరజ్ అడుగుతాడు.

Also Read : వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా ఊడుతుందా? కారణాలివే.. తగ్గించేందుకు నిపుణులు చెప్పిన చిట్కాలు

నీ భర్త కావాలి అంటే వెళ్లిపో..

ధీరజ్ మాటలకు ప్రేమ కరిగిపోకూడదు అని భద్రావతి ప్రేమతో కన్నీరు పెట్టుకొని ప్రేమా ఏ క్షణమైతే నువ్వు తనని పెళ్లి చేసుకున్నావో. ఆ క్షణమే నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నీకు వచ్చింది. నువ్వు బాగుండాలి. సంతోషంగా ఉండాలి. నీ జీవితం బాగుండాలని మేము కోరుకున్నాం తప్పా అలా ఉండు ఇలా ఉండు మేము చెప్పినట్టు ఉండు అని నిన్ను నీ జీవితాన్ని శాసించే హక్కు అధికారం మాకు లేవు. నీకు నీ భర్త, నీ అత్తిళ్లు కావాలనుకుంటే సంతోషంగా వెళ్లిపోమ్మా. మేము నీకు అడ్డు చెప్పం అని భద్రావతి అంటుంది. సేనాపతి అక్కతో వాడు నా కూతురిని ఎంతలా మానసిక క్షోభ పెట్టాడో చూసిన తర్వాత కూడా మళ్లీ ఆ నరకంలోకి అడుగుపెట్టమంటావేంటీ అక్క అంటాడు. వేదవతి రామరాజు ప్రేమని ఇంటికి వచ్చేయమని కోపంలో నిర్ణయం తీసుకోవద్దు అని అంటే వీడు నాకు వద్దు నేను రాను అని ప్రేమ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.