ICC Champions Trophy News: భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కి తాజాగా షాక్ తగిలింది. ఐసీసీ ప్ర‌క‌టించిన ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ జ‌న‌వ‌రి అవార్డు వెస్టిండీస్ స్పిన్న‌ర్ జోమెల్ వ‌ర్రీక‌న్ కు ల‌భించింది. గ‌త‌నెల‌లో పాకిస్థాన్ తో జ‌రిగిన టెస్టు సిరీస్ లో వ‌ర్రీక‌న్ విశేషంగా రాణించాడు. రెండు టెస్టుల సిరీస్ లో 19 వికెట్లు తీసి స‌త్తా చాటాడు. ముఖ్యంగా ముల్త‌న్ లో జ‌రిగిన టెస్టులో విండీస్ విజ‌యం సాధించ‌డం వెన‌కాలా వ‌ర్రీక‌న్ విశేష ప్ర‌తిభ దాగుంది. ఆ మ్యాచ్ లో అటు బ్యాట్ తో, ఇటు బంతితో స‌త్తా చాటాడు. దీంతో 35 ఏళ్ల త‌ర్వాత విండీస్ ఆసియా గ‌డ్డ‌పై టెస్టు సిరీస్ గెల‌వ‌డంతో కీల‌క‌పాత్ర పోషించాడు. దీంతో ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా ద‌క్కించుకున్నాడు. తాజాగా జ‌న‌వ‌రి నెల ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డును కూడా వ‌ర్రీక‌న్ ద‌క్కించుకున్నాడు. అంతకుముందు తొలి టెస్టులో పది వికెట్ల‌తో రాణించిన ఆ మ్యాచ్ లో పాక్ విజ‌యం సాధించింది.

1️⃣9️⃣ wickets in 2️⃣ Tests 🥵

Jomel Warrican's extraordinary Test series against Pakistan lands him a massive reward 👏

More ➡️ https://t.co/wkdflwajO3 pic.twitter.com/4tk1zhZ9cT

— ICC (@ICC) February 11, 2025

గౌర‌వంగా భావిస్తున్నా..
త‌నకు ఐసీసీ అవార్డు రావ‌డంపై వ‌ర్రీక‌న్ ఆనందం వ్య‌క్తం చేశాడు. కుటుంబ స‌భ్యులు, టీమ్ మెంబ‌ర్ల, జ‌ట్టు స‌హాయ‌క సిబ్బందితోనే ఈ అవార్డును సాధించిన‌ట్లు తెలిపాడు. ఈ ఏడాది ఒక్క ఫైఫ‌ర్ అయినా సాధించాల‌ని భావించాన‌ని, అయితే ఇంత‌టి విశేష స్థాయిలో రాణిస్తాన‌ని అనుకోలేద‌ని ఆనందం వ్య‌క్తం చేశాడు. త‌మ జ‌ట్టు విజ‌యం సాధించ‌మే కాకుండా, త‌న‌కు ఈ అవార్డు రావ‌డంలో ముఖ్య భూమిక పోషించిన ముల్త‌న్ వేదిక‌ను గుర్తు చేసుకున్నాడు. మ‌రోవైపు గత జ‌న‌వ‌రిలో క‌చ్చితంగా వ‌రుణ్ కు ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డు వ‌స్తుంద‌ని అంతా భావించారు. ఇంగ్లాండ్ తో సొంత‌గ‌డ్డ‌పై ఆడిన 5 టీ20ల సిరీస్ లో త‌ను విశేషంగా రాణించాడు. 14 వికెట్ల‌తో ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. ఒక ద్వైపాక్షిక సిరీస్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్ గా కూడా త‌ను రికార్డుల్లోకి ఎక్కాడు. ఇక మహిళల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన బేత్ మూనీకి జనవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది.

Scaling new heights on and off the field 👏

Beth Mooney wins her maiden ICC Women's Player of the Month award 🎖️

Read more ➡️ https://t.co/vhm98Z7N88 pic.twitter.com/oIPxVrodZ7

— ICC (@ICC) February 11, 2025

ఐసీసీ టోర్నీపై చూపు..
టీ20ల్లో ప్ర‌ద‌ర్శ‌న‌తో అనూహ్యంగా వ‌న్డే జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న వ‌రుణ్.. తాజాగా రెడో వ‌న్డేలో అరంగేట్రం చేశాడు. ఒక వికెట్ తీసి, బాగానే బౌలింగ్ చేశాడు. బుధ‌వారం ప్రారంభ‌మ‌య్యే మూడో వన్డేలోనూ స‌త్తా చాటి ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీకి ఎంపిక కావాల‌ని భావిస్తున్నాడు. ఇక ఈ టోర్నీ ఈనెల 19 నుంచి పాక్ లో ప్రారంభ‌మ‌వుతుంది. భార‌త్ త‌న మ్యాచ్ ల‌ను దుబాయ్ లో ఆడుతుంది. ఈనెల 20 బంగ్లాదేశ్‌, 23న పాక్, మార్చి 2 న న్యూజిలాండ్ తో మ్యాచ్ లు ఆడుతుంది.

Read Also: Gujarat Titans: కొత్త యాజ‌మాన్యం చేతుల్లోకి గుజ‌రాత్ టైటాన్స్.. డీల్ ఆల్మెస్ట్ క్లోజో.. ఈ సీజ‌న్ నుంచే ప‌గ్గాలు..