Dulquer Salmaan's I'm Game New Release Date : స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఐయామ్ గేమ్ (Im Game). దుల్కర్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ మూవీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఆగస్ట్ 20న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినా తాజాగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 3న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఒకేసారి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ముందుగా అనుకున్న డేట్‌కు అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో అన్నీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని వాయిదా వేసినట్లు ప్రకటించారు.

ఈ మూవీకి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తుండగా... దుల్కర్ సల్మాన్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే ఆంటోని వర్గీస్, మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ ఫోర్ట్, కతిర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ మూవీని నిర్మిస్తున్నారు.

Also Read : This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?