Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!

3 months ago 9
ARTICLE AD
<p>హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పనామా ప్రాంతంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డు పక్కన పడి ఉన్న ఒక వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు, వెంటనే &nbsp;స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి శరీరంపై పలుచోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం మృతుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే వివరాలతో పాటు, ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.</p>
Read Entire Article