Hyderabad Crime News: వీడు మొగుడు కాదు రాక్షసుడు - అనుమానంతో భార్య హత్య - ముక్కలు చేసి ఉడికించేశాడు!
10 months ago 8
ARTICLE AD
హైదరాబాద్ లోని మీర్ పేటలో గురుమూర్తి,మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. గురుమూర్తికి అనుమానం ఎక్కువ. తాను పనుల మీద బయటకు వెళ్లినప్పుడు తన భార్య ఎవరితోనో మాట్లాడుతోందని.. ఎవరితోనే గడుపుతోందని అనుమానపడేవాడు. కానీ బయటకు మాత్రం చాలా నార్మల్ గా ఉండేవాడు. బంధువులు వచ్చినప్పుడు భార్యను కాలు కింద పెట్టుకుండా చూసుకుంటున్నానని నమ్మించేవాడు.
ఈ మధ్య కాలంలో తన  భార్య ఎవరితోనే అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె తల్లిదండ్రుల వద్ద పంచాయతీ కూడా పెట్టాడు. ఆమె ప్రియుడితో లేచిపోయే ప్లాన్లో ఉందని కూడా ఆరోపించేవాడు. ఈ టార్చర్ ను భరిస్తూ.. ఆమె ..భర్తను మార్చునే ప్రయత్నం చేసింది. ఓ రోజు కనిపించకుండా పోయింది. గురుమూర్తి ..మాధవి తల్లిదండ్రులకు మీ కూతురు ఎవరితోనే లేచిపోయిందని నమ్మించి అందరితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా గురుమూర్తి నటనను నమ్మేశారు. భార్య అదృశ్యం వెనుక అతని పాత్ర లేదనుకున్నారు.
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో జిల్లెల గూడ చెరువులో గుర్తు తెలియని మృతదేహాన్ని ముక్కులుగా నరికి పడేసిన ఆనవాళ్లు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు కానీ.. ఎవరిదో కనిపెట్టలేపోయారు. ఆ మృతదేహాన్ని ఊడికించినట్లుగా ఉంది. సమీపంలోని  మిస్సింగ్ కేసులన్నీ ఆరా తీస్తే.. మాధవి విషయం వెల్లడి అయింది. అప్పుడు గురుమూర్తి మీద అనుమానంతో ఇంట్లో పోలీసులు సెర్చ్ చేయడంతో చాలా ఆధారాలు దొరికాయి.
పోలీసులు తమదైన కోటింగ్ ఇవ్వడంతో గురుమూర్తి నిజం చెప్పారు. తానే భార్యను హత్య చేశానని.. ముక్కలుగా నరికానని ఒప్పుకున్నాడు. దొరకకుండా మృతదేహాన్ని ఉడికించి చెరువులో పడేశానని చెప్పాడు. దాంతో పోలీసులు కూడా ఉలిక్కి పడ్డారు. ఇంత ఘోరమైన నేరం చేసి.. ఇంత నిమ్మళంగా ఎలా ఉన్నాడోనని ఆశ్చర్యపోయారు. అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
అనుమానంతో భార్యను చంపడమే కాదు.. ఆమె ఎవరితోనే వెళ్లిపోయిందని ఆమె తల్లిదండ్రులను, పోలీసులను కూడా నమ్మించేందుకు భర్త గురుమూర్తి చాలా పక్కా ప్లాన్ తో వ్యవహిరంచారు. ఆయన మనస్థత్వాన్ని చూసి ఎవరైనా భయపడే పరిస్థితి కల్పించారు. మాధవి తల్లిదండ్రులు తన కుమార్తెకు జీవితాన్ని ఇచ్చామనుకున్నారు కానీ... కట్నం ఇచ్చి చావును ఇచ్చామని రోదిస్తున్నారు.
Also Read: Hanumakonda Murder Case: హనుమకొండలో పట్టపగలే దారుణం, నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ దారుణహత్య
Read Entire Article