<p>హైదరాబాద్: నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదం చోటుచేసుకుంది. చార్మినార్ డివిజన్ ఏసీపీ (ACP) గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ పరిధిలోని బృందావన కాలనీలో నివాసం ఉంటున్న ఏసీపీ చంద్రశేఖర్, హేమలత దంపతుల ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఆమె తన నివాసంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణం చెందారు.</p>
<p>ఈ ఘటనపై సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే, ఆమె ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాల వల్లే హేమలత చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. </p>