First Apple Store opening soon in Hyderabad: హైదరాబాద్‌లోని టెక్ ప్రియులకు ఒక అద్భుతమైన వార్త. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ హైదరాబాద్‌లో తన మొట్టమొదటి అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముంబై, ఢిల్లీలలో అపూర్వ విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు తన మూడవ సిటీగా హైదరాబాద్‌ను ఎంచుకోవడం నగర ప్రాధాన్యతను చాటిచెబుతోంది. దీనికి సంబంధించి ఆపిల్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయడంతో ఈ వార్త ఖరారైంది.

యాపిల్ ఏ ఏ ఉద్యోగాలు ప్రకటించింది?

ఆపిల్ తన హైదరాబాద్ స్టోర్ కోసం సుమారు 10 కంటే ఎక్కువ రకాల విభాగాల్లో నియామకాలను చేపడుతోంది. వీటిలో ప్రధానంగా:

స్టోర్ లీడర్ & మేనేజర్: స్టోర్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు.
జీనియస్ : సాంకేతిక సమస్యలను పరిష్కరించే నిపుణులు.
స్పెషలిస్ట్ & క్రియేటివ్: వినియోగదారులకు ఉత్పత్తుల గురించి వివరించి, సేల్స్ పెంచే వారు.
ఆపరేషన్స్ ఎక్స్‌పర్ట్: స్టోర్ నిర్వహణ , ఇన్వెంటరీ చూసుకునేవారు.
మొత్తంగా ఈ స్టోర్ ద్వారా దాదాపు 100 నుండి 150 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశం ఉంది.

అర్హతలు- నైపుణ్యాలు:
ఆపిల్ కేవలం డిగ్రీలను మాత్రమే కాకుండా, అభ్యర్థులలోని వ్యక్తిత్వానికి , నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.

కమ్యూనికేషన్ స్కిల్స్: వినియోగదారులతో మర్యాదగా, స్పష్టంగా మాట్లాడగలగడం చాలా ముఖ్యం.
టెక్నాలజీపై పట్టు: ఆపిల్ ఉత్పత్తులు iPhone, Mac, iPad వాటి సాఫ్ట్‌వేర్‌పై కనీస అవగాహన ఉండాలి.
అనుభవం: రిటైల్ రంగంలో లేదా కస్టమర్ సర్వీస్‌లో ముందస్తు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
భాషా నైపుణ్యం: ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ తెలిసి ఉండటం అదనపు బలం.

First Apple Store opening soon in Hyderabad!
Based on recent job postings, Apple seems to be hiring for multiple roles for its first retail store in Hyderabad. The exact location is not confirmed yet.
A few months ago, the Hon. CM had hinted that T-Square could host premium… pic.twitter.com/d1bu41Tl9E

— Hyderabad Real Estate & Infra (@HydREGuide) February 5, 2026

లోకేషన్ సస్పెన్స్
గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీ-స్క్వేర్ వద్ద ఇలాంటి ప్రీమియం స్టోర్లు వచ్చే అవకాశం ఉందని సూచించినప్పటికీ, ప్రస్తుత సమాచారం ప్రకారం ఆపిల్ తన స్టోర్‌ను గచ్చిబౌలి లేదా మాదాపూర్‌లోని ఏదైనా ప్రముఖ మాల్‌లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ఆపిల్ తన స్టోర్లను అత్యధిక జనసందోహం , విలాసవంతమైన ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తుంది. ఈ స్టోర్ ప్రారంభమైతే, హైదరాబాద్ వాసులు థర్డ్ పార్టీ రీసెల్లర్స్ మీద ఆధారపడకుండా నేరుగా ఆపిల్ నుండి సర్వీస్, ఉత్పత్తులను పొందవచ్చు. ఇది నగరం అంతర్జాతీయ రిటైల్ ఇమేజ్‌ను మరింత పెంచనుంది.