Thaman's Hrudhayam Murali Telugu Trailer Review : అప్పుడెప్పుడో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్‌లో మ్యూజిక్ లెజెండ్ తమన్ నటించారు. మళ్లీ దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓ తమిళ మూవీ 'ఇదయం మురళి'లో కీలక పాత్రలో నటించారు. తెలుగులో 'హృదయం మురళి' పేరుతో రిలీజ్ చేస్తుండగా... తాజా ట్రైలర్ ట్రెండ్ అవుతోంది.

ట్రైలర్ ఎలా ఉందంటే?

లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన 'హృదయం మురళి' మూవీలో తమన్ కీలకపాత్ర పోషించడం సహా ఆయనే మ్యూజిక్ కూడా అందిస్తున్నారు. కాలీజీ లైఫ్, ఫ్రెండ్స్, యూత్ సరదాలతో పాటు లవ్, ఎమోషన్‌ను కూడా ట్రైలర్‌లో చూపించారు. కాలేజీలో తాను ప్రేమించిన అమ్మాయికి ఏళ్లు గడిచినా లవ్ ఎక్స్‌ప్రెస్ చేయకుండా నాన్చే అబ్బాయి, ప్రేమను చెప్పేయాలంటూ ఫోర్స్ చేసే ఫ్రెండ్స్... మనసులోనే ప్రేమను దాచుకుని మథన పడే హీరో.

చదువులు పూర్తై ఉద్యోగాల్లో సెటిలైనా హీరో... హీరోయిన్‌కు తన ప్రేమను చెప్పాడా? హీరోను వదిలి హీరోయిన్ ఎందుకు వెళ్లిపోయింది? నలుగురు స్నేహితుల మధ్య జరిగింది ఏంటి? అనేదే స్టోరీ. మూడేళ్లైనా చెప్పని ప్రేమను... 3 నిమిషాల్లోనే చెప్పేస్తావా? అంటూ తమన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. యూత్‌కు కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ... తమన్ మ్యూజిక్ వేరే లెవల్‌లో ఉంది.

Also Read : Sing Geetham OTT : ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?