Chiranjeevi Mana Shankara Varaprasad Garu Hook Step Song Story : మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా చిరు హుక్ స్టెప్ సాంగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వింటేజ్ మెగాస్టార్‌ లుక్ సహా మొబైల్ లైట్‌తో ఆయన ఎనర్జీ స్టెప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ స్టెప్ రాగానే థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలు స్టార్ట్ అవుతున్నాయి.

అంతలా ఫేమస్ అయిన ఈ హుక్ స్టెప్ సాంగ్‌కు 'ఆట' ఫేం సందీప్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా... బాబా సెహగల్ ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. థియేటర్లో మూవీ చూసిన కొరియోగ్రాఫర్ సందీప్ 'హుక్ స్టెప్' సాంగ్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ రెస్పాన్స్ చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ స్టెప్ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీని షేర్ చేసుకున్నారు.

ఈఎంఐస్ ఇరిటేషన్‌తో...

ఈఎంఐస్ ఇరిటేషన్‌ వల్ల కోపంలో వచ్చిన ఐడియాతో 'హుక్ స్టెప్' కంపోజ్ చేసినట్లు సందీప్ తెలిపారు. 'నేను కూడా ప్రతీ నెల ఈఎంఐలు కట్టాలి. ఈ సాంగ్‌కు స్టెప్స్ కంపోజ్ చేస్తున్న టైంలో వరుసగా ఈఎంఐ కట్టాలంటూ ఫోన్స్ వచ్చాయి. ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వస్తుందనే ఫోన్ తీసుకెళ్లా. అలా వరుస కాల్స్‌తో ఇరిటేషన్ వచ్చింది. కోపంతో ఫోన్ పగలగొట్టేద్దామనుకున్నా. అలా ఫోన్ పట్టుకుంటే ఓ ఐడియా వచ్చింది.

లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కేవలం మొబైల్ లైట్‌తో 'హుక్ స్టెప్' సాంగ్ కంపోజ్ చేశా. అది చూసి నా భార్య చప్పట్లు కొట్టారు. అలా ఆ స్టెప్‌ను ఇంకా కొంచెం డెవలప్ చేసి ఫైనల్ స్టెప్ డిజైన్ చేశాం. మెగాస్టార్ చిరంజీవి గ్రేస్, ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని దాన్ని డిజైన్ చేశాం.' అని చెప్పారు.

Also Read : ట్యాగ్ చేసిన అమ్మాయిల దారుణ హత్యలు - శోభిత 'చీకటిలో' ట్రైలర్... మూవీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?