Honda Upcoming Bikes in India: భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌ను హోండా మోటార్ సైకిల్ అండ్‌ స్కూటర్ ఇండియా షేక్ చేసేందుకు సిద్ధమైంది. టూవీలర్‌ పోర్ట్‌ఫోలియోలో ఒకటో రెండో కాదు ఏకంగా పది మోడల్స్‌ తీసుకు వస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో అన్ని వర్గాలను ఆకట్టుకునే మోడల్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఫ్లెక్స్‌ ఫ్యూయల్ వాహనాలు కూడా ఉండటం పోటీదారులను అలర్ట్ చేసింది.

ఇప్పటి వరకు కేవలం రొటీన్ కమ్యూటర్‌ బైక్‌లు, యాక్టివా కేటగిరీకే పరిమితమైందనే విమర్శలకు చెక్ పెడుతూ హోండా సరికొత్త డిజైన్ ఫిలాసఫీ, ఇ-క్లచ్‌, ఫ్రంట్‌ ఆఫ్‌ ప్యాక్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వంటి నెక్స్ట్‌ జెన్ టెక్నాలజీతో గ్లోబల్ స్టాండర్డ్స్‌ భారత రోడ్లపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో దుమ్మురేపేందుకు తీసుకొచ్చిన హోండా QC3 ఇ-స్కూటర్‌, ఓలా, టీవీఎస్‌ ఐక్యూబ్‌ లాంటి పోటీదారులకు బిగ్ ఛాలెంజ్‌ విసురుతోంది.

హోండా QC3 స్మార్ట్‌ ఫ్యామిలీ ఇ-స్కూటర్‌

భారత ఎలక్ట్రిక్ స్కూటర్‌ మార్కెట్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ హోండా QC3 ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఆవిష్కరించింది. గంలో వచ్చిన QC1 మోడల్ పరిమితులను అధిగమించి, కస్టమర్ల ఫీడ్‌ బ్యాక్ ఆధారంగా ఈ మోడల్‌ను పూర్తి స్థాయిలో ఇంజినీరింగ్ చేశారు.

QC3 స్కూటర్‌లో 3kWh లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు. దీని వల్ల సింగిల్‌ ఛార్జ్‌పై ఏకంగా 150 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ లభిస్తుంది. కేవలం రెండు గంటల 40 నిమిషాల్లోనే 0-80 శాతం ఛార్జింగ్‌ పూర్తి అవుతుంది. 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఫ్యామిలీ రైడర్లను దృష్టిలో పెట్టుకొని అండర్ సీట్‌ స్టోరేజ్‌ సామర్థ్యాన్ని 32 లీటర్లకు పెంచారు. ఇందులో పెద్ద హెల్మెట్‌తోపాటు డైలీ గ్రోసరీస్‌ సులభంగా పెట్టుకోవచ్చు. ఐదు ఇంచ్‌ల సరికొత్త టీఎఫ్టీ కలర్‌ డిస్‌ప్లే అందుబాటులోకి వచ్చింది. బ్లూటూత్‌ కనెక్టివిటీ, టర్న్‌బై టర్న్‌ నేవిగేషన్, స్మార్ట్‌ కీ, డ్రైవింగ్‌ మోడ్స్, రియల్ టైమ్‌ డిస్టెన్స్‌ టు ఎంప్టీ ఇండికేటర్లు ఇందులో ఉన్నాయి.

భారత్‌ తొలి ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ అడ్వెంచర్‌ స్కూటర్‌- హోండా ADV 160

భారత్‌ ఆటోమొబైల్‌ రంగాన్ని విస్తుపోయేలా చేసిన మరో మోడల్‌ హోండా ADV16. అర్బన్ అడ్వెంచ్‌ లుక్‌తో ఎస్‌యూవీ డిజైన్ లాంగ్వేజ్‌ కలిగి ఉన్న ఈ స్కూటర్‌, భారత్‌లో E85 ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ సపోర్ట్‌ చేసే మొదటి స్కూటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది.

ఇందులో 160సిసి వాటర్ కూల్డ్‌ ఇంజిన్ అమర్చారు. ఇది సిటీ ట్రాఫిక్‌లోనే కాకుండా హైవే రైడింగ్‌, ఆఫ్‌రోడ్‌ ప్రయాణాలకు అద్భుతమైన టార్క్‌ను అందిస్తుంది. 8.1 లీటర్ల పెద్ద ఫ్యూయల్‌ ట్యాంక్‌, 27 లీటర్ల అండర్‌ సీట్‌ స్టోరేజ్‌ దీని ప్రత్యేకత. రఫ్‌ రోడ్లు, గుంతల రోడ్లపై కుదుపులు లేకుండా ప్రయాణించడానికి లాంగ్‌ ట్రావెల్‌ సస్పెన్షన్, ఎలివేటడ్‌ ఎగ్జాస్ట్‌, ఆల్‌ టైర్రైన్‌ బ్లాక్‌ పాటర్న్‌టైర్లు ఇచ్చారు.

రెట్రో హెరిటేజ్‌ అండ్‌ క్రూజర్‌ మోడల్‌లో హోడా సీబీ 500, రెబెల్‌ 300 అండ్ రెబెల్‌ 500

రాయ్ ఎన్‌ఫీల్డ్, జావా, హార్లే డేవిడ్సన్ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు హోండా తన గ్లోబల్‌ పవర్‌ హౌస్‌ క్రూజర్లను ఇండియాకు తీసుకువచ్చింది. హోండా సీబీ 500 సింగి్‌ సిలిండర్‌ ఎయిర్‌/ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్ సామర్థ్యం వస్తుంది. క్లాసిక్‌ రెట్రో స్పోర్టీ లుక్‌ కలిగి ఉంది. అల్లాయ్‌ వీల్స్‌, స్పోక్‌ ట్యూబ్‌లెస్‌, స్పోక్‌ ట్యూబ్‌లెస్‌ విత్‌ గ్రాఫిక్స్‌ అనే మూడు విరేయంట్లలో లభ్యంకానుంది.

హోండా రెబెల్‌ 300 మోడల్‌ 286సీసీ లిక్విడ్‌-కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తున్న ఎంట్రీ లెవెల్‌ బాబర్‌ క్రూజర్‌. తక్కువ సీట్‌ హైట్‌ ఉండటం వల్ల అందరికీ ప్రయాణం చాలా సులువుగా ఉంటుంది. హోండా రెబెల్‌ 500 సరికొత్త 470 సీసీ పారలల్‌ ట్విన్ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో వచ్చే లైఫ్‌స్టైల్‌ మిడ్‌ సైజ్‌ క్రూజర్‌. లాంగ్‌ హైవే రైడింగ్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్‌. రెబెల్‌ 300, 500 రెండింటిలోన హోండా విప్లవాత్మక ఈ క్లచ్‌ వేరియంట్‌ అందుబాటులో ఉన్నాయి.

రఫ్‌ రోడ్లలో దూసుకెళ్లే హోండా ఎక్స్‌ఆర్‌ 300ఎల్‌ అండ్‌ ఎక్స్‌ఆర్‌ 300

హిమాలయన్ 450, కేటీఎం అడ్వెంచర్‌ మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు హోండా ఆఫ్‌రోడ్‌ డీఎన్‌ఏ ఉన్న ఎక్స్‌ఆర్‌ 300 సిరీస్‌ లాంచ్ చేసింది. హోండా ఎక్స్‌ ఆర్‌ 300ఎల్‌ 293.5 సిసి ఎయిర్‌ /ఆయిల్ కూల్డ్‌ ఇంజిన్ కలిగిన తేలిపాటి డ్యూయల్‌ పర్పస్ ఆఫ్‌రోడర్‌. ఆన్‌రోడ్ ప్రయాణంతో పాటు పల్లెటూరి రఫ్‌ రోడ్లపై సునాయాసంగా వెళ్తుంది.

హోండా ఎక్స్‌ఆర్‌ 300 ప్రాపర‌ డాకార్ ర్యాలీ డిజైన్ ఇన్స్పిరేషన్‌తో రూపొందించిన టూర్‌ బైక్‌. విండ్‌స్క్రీ్‌, ఎక్స్‌టెండడ్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌, లాంగ్‌ డ్యూటీ ఆఫ్‌రోడ్ సస్పెన్షన్‌తో సుదూర ప్రయాణాలు చేసే అడ్వేంచ్‌ రైడర్లు మైండ్‌ బ్లోయింగ్‌ ఆప్షన్ ఇది.

విప్లవాత్మక టెక్నాలజీో హోండా సీబీ350 సిరీస్‌

హోండా మోటార్‌ సైకిల్స్‌లో విపరీమైన క్రేజ్ ఉన్న సీబీ350, సీబీ350సీ, సీబీ350ఆర్‌ఎస్‌ మోడళ్లు కొత్త కలర్‌ ఆప్షన్లు, అప్‌డేటెడ్‌ ఎర్గోనామిక్స్‌తో రీఫ్రెష్ అయ్యాయి.

హోండా ఇ- క్లచ్ అంటే ఏంటీ?

భారీ ట్రాఫిక్‌లో బైక్‌ నడిచేటప్పుడు క్లచ్‌ లీవర్‌ పదే పదే నొక్కుతూ పడే బాధల నుంచి రైడర్లకు ఉపశమనం కలిగించే వ్యవస్థ ఈ హోడా ఇ -క్లచ్‌. దీని వల్ల క్లచ్‌తో పని లేకుండా గేర్లు మార్చవచ్చు. సిటీలో బంపర్ టు బంపర్‌ ట్రాఫిక్‌లో బైక్ ఆగిపోకుండా లేదా జర్కులు రాకుండా స్మూత్‌గా మూవ్ అవుతుంది. రైడర్‌ తనకు కావాల్సినప్పుడు సాధారణ క్లచ్‌లా కూడా వాడే వెసులుబాటు ఉంటుంది. హోండా ఈ పది మోడల్స్‌ను దశలవారీగా వచ్చే నెలల్లో మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.