Holidays in January : కొత్త సంవత్సరం విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. జనవరిలో మొత్త 9 రోజులు సెలవులు ఉండనున్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. ఈ 9 రోజుల్లో 4 ఆదివారాలు కూడా ఉంటాయి. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో నాలుగు సాధారణ సెలవులు ఉన్నాయి. అవి నూతన సంవత్సరం (జనవరి 1), భోగి (జనవరి 13), సంక్రాంతి/పొంగల్ (జనవరి 14), గణతంత్ర దినోత్సవం (జనవరి 26). గణతంత్ర దినోత్సవం సాధారణ సెలవు దినం. కానీ ఈ ఏడాది ఆదివారం వస్తోంది. ఈ సెలవుల్లో, హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని అన్ని పాఠశాలలు మూతపడతాయి.

మూడు ఐచ్ఛిక సెలవులు

ఆదివారాలు, సాధారణ సెలవులు కాకుండా, జనవరి నెలలో పాఠశాలలకు మూడు ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. అవి హజ్రత్ అలీ (జనవరి 14), కనుము (జనవరి 15), షబ్-ఎ-మెరాజ్ (జనవరి 25) పుట్టిన రోజు. ఈ ఐచ్ఛిక సెలవుల్లో అన్ని పాఠశాలలకు మూసివేయకపోవచ్చు. అది ఆ ప్రాంతం, డిమాండ్ ను బట్టి ఉంటుంది. కానీ షబ్-ఎ-మెరాజ్ రోజు మాత్రం చాలా మైనారిటీ పాఠశాలలకు సెలవు ఇస్తారు.

Also Read : CMR College Issue: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ

2025 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సాధారణ, ఆప్షనల్ హాలిడేస్ ను ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం, మొత్తం 27 సాధారణ సెలవులుంటాయి. 23 ఐచ్ఛిక సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు సాధారణ సెలవుల జాబితాను పరిశీలిస్తే..

నూతన సంవత్సరం - జనవరి 1

భోగి - జనవరి 13

సంక్రాంతి - జనవరి 14

రిపబ్లిక్ డే - జనవరి 26

మహా శివరాత్రి - ఫిబ్రవరి 26

హోలీ - మార్చి 14

ఉగాది - మార్చి 30

ఈద్ ఉల్ ఫితర్ - మార్చి 31

రంజాన్ - ఏప్రిల్ 1

బాబు జగ్జీవన్ రామ్ జయంతి - ఏప్రిల్ 5

శ్రీరామనవమి - ఏప్రిల్ 6

అంబేద్కర్ జయంతి - ఏప్రిల్ 14

గుడ్ ఫ్రైడ్ - ఏప్రిల్ 18

బక్రీద్ - జూన్ 7

మొహర్రం- జూలై 6

బోనాలు - జూలై 21

స్వాతంత్ర్య దినోత్సవం - ఆగస్టు 15

శ్రీకృష్ణాష్టమి - ఆగస్టు 16

వినాయక చవితి - ఆగస్టు 17

ఈద్ మిలాద్ నబీ - సెప్టెంబర్ 5

బతుకమ్మ - సెప్టెంబర్ 21

దసరా గాంధీ జయంతి - అక్టోబర్ 2

విజయ దశమి తర్వాతి రోజు - అక్టోబర్ 3

దీపావళి - అక్టోబర్ 20

కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి - నవంబర్ 5

క్రిస్మస్ - డిసెంబర్ 25

క్రిస్మస్ తర్వాతి రోజు - డిసెంబర్ 26

ఐచ్ఛిక సెలవుల జాబితా

హజరత్ అలీ పుట్టినరోజు - జనవరి 14

కనుమ - జనవరి 15

శ్రీపంచమి- ఫిబ్రవరి 3

షబ్ ఈ బరత్ - ఫిబ్రవరి 14

మహవీర్ జయంతి - ఏప్రిల్ 10

Also Read : Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు