Newlywed Couples Spiritual Guidance: వివాహం అనేది రెండు శరీరాల కలయిక కాదు..రెండు ఆత్మల పవిత్రమైన సమ్మేళనం. హిందూ శాస్త్రాల ప్రకారం..గృహస్థాశ్రమం ప్రారంభమయ్యే ఈ ముహూర్తంలో దంపతులు కలసి చేసే మొదటి పుణ్యకార్యం దాంపత్య జీవితానికి బలమైన పునాది వేస్తుంది. మరి నూతన దంపతులు మొదట ఏం చేయాలి?

పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!

కులదైవం - ఇష్టదైవం దర్శనం

శాస్త్రాలు చెప్పినట్టు పెళ్లి తర్వాత మొదటగా నూతన దంపతులు కుల దైవం లేదా ఇష్ట దైవాన్ని దర్శించుకోవాలి. ఇది వారి కొత్త ప్రయాణానికి దైవిక ఆశీర్వాదాన్ని అందిస్తుంది. వారి జీవితంలో నూతన వెలుగును ఆహ్వానించినట్టు అవుతుంది. ఇద్దరూ కలసి వెళ్లి కులదైవం ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేయడం వల్ల వారి దాంపత్య జీవితం దైవిక రక్షణలో ఉంటుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఇది కేవలం ఆచారం కాదు.. ఇద్దరూ ఒకరికొకరు అంకితమయ్యే ముందు భగవంతుడి ఆశీస్సులు తీసుకోవడం.

పెద్దలు - గురువుల ఆశీర్వాదం

దేవుడి ఆశీర్వాదం తర్వాత పెద్దలు, కుటుంబసభ్యులు, గురువుల ఆశీర్వచనం తీసుకోవడం ముఖ్యం. గురువులు, పెద్దల పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా కర్మ సంబంధాలు బలపడతాయి. వారి దీవెనలు దాంపత్య జీవితంలో సుఖం, సంతోషం, సంపదను తీసుకొస్తుందని నమ్మకం.

చేతికి, కాలికి నల్లదానం ఎందుకు? ఆధ్యాత్మిక రహస్యం & సైన్స్ ఏం చెబుతున్నాయ్?

ఇంట్లో కలసి దీపం వెలిగించాలి

దంపతులు ఇద్దరూ కలసి మొదట ఇంట్లో అడుగుపెట్టగానే.. ఇద్దరూ కలసి దేవుడి మందిరంలో దీపం వెలిగించాలి. నైవేద్యం సమర్పించి, ధూపం వేయడం , కలసి ప్రార్థనలు చేయడం ద్వారా ఇంటిని పవిత్రం చేసుకున్నట్టు అవుతుంది. ఇది దంపతుల మధ్య ఆధ్యాత్మిక బంధాన్ని బలపరుస్తంది.

శక్తి కొలది దానం చేయాలి

నూతన దంపతులు తమ శక్తికి తగ్గట్టుగా దాన ధర్మాలు చేస్తే వారి బంధం కలకాలం సంతోషంగా సాగిపోతుందని నమ్మకం. అన్నదానం, వస్త్రదానం, గోసేవ చేయడం అత్యంత శుభప్రదం. పెళ్లి లాంటి మంగళకార్యం తర్వాత దానం చేయడంవల్ల పుణ్యం రెట్టింపవుతుంది. ఇది నూతన దంపతుల గృహస్థ జీవితాన్ని ధర్మ బద్ధంగా ప్రారంభించేందుకు సహాయపడుతుంది

12 సంవత్సరాల తర్వాత అరుదైన యోగం!ఆషాఢ గుప్త నవరాత్రులు ఘటస్థాపన శుభసమయం, పూజా విధానం!

ధార్మిక గ్రంధాలు పఠనం లేదా శ్రవణం

ఐదో పుణ్యకార్యంగా...నూతన దంపతులు ధార్మిక గ్రంథాలు చదవడం లేదా వినడం మంచిది. రామాయణంలో సుందరకాండ, శివపురాణం, భగవద్గీత గ్రంధాలు...దంపతులకు ధర్మ బోధన చేస్తాయి.

ఆధ్యాత్మికంగా చూస్తే...వివాహం తర్వాత దంపతులు కలసి చేసే మొదటి పుణ్యకార్యం వారి జీవితానికి దైవిక శక్తిని అందిస్తుంది. ఇది కేవలం ఆచారాలు మాత్రమే కాదు..ధర్మం కరుణ భక్తికి పునాది. పరస్పర గౌరవం, ప్రేమ, సహనం, దైవభక్తి... ఈ శుభారంభంతోనే ఇల్లు సంతోషంగా మారుతుంది.

వంట నుంచి సైన్స్ కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు