Himanshu’s Journey from Tea Shop to IAS : ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఒక చిన్న టీ కొట్టులో పనిచేసిన హిమాన్షు గుప్తా.. UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి IAS అధికారిగా మారారు. అన్ని ఉన్నా కెరీర్పై ఫోకస్ చేయని ఈరోజుల్లో టీ కొట్టు నుంచి ప్రారంభమైన అతని జర్నీ.. ఎంతోమందికి ఆదర్శంగా మారింది. ఎలాంటి కోచింగ్ లేకుండా UPSC పరీక్షకు సిద్ధమైన హిమాన్షు నేడు IAS అధికారిగా నిలిచాడు. అసలు అతని పర్సనల్ లైఫ్ ఏంటి? యూపీఎస్సీకి ఎలా సిద్ధమయ్యాడు.. అతని జర్నీ ఏంటి వంటి విషయాలు చూసేద్దాం.

చిన్నతనం ఎలా సాగిందంటే..

హిమాన్షు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రికి చిన్న టీ కొట్టు ఉండేది. హిమాన్షు చిన్నతనంలో వారి టీ షాపులో పని చేసి.. తండ్రికి సహాయంగా ఉండేవాడు. కుటుంబానికి సహాయం చేసేవాడు. చదువుకునే సమయంలో కూడా తండ్రి కొట్టులో పనిచేయడం.. ఖాళీ సమయంలో వార్తాపత్రికలు చదవడం ద్వారా నాలెడ్జ్ పెంచుకున్నాడు. ఇలా చదువు కంటిన్యూ చేస్తూ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు.

హిమాన్షు ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. కళాశాలలో ప్రవేశం పొందిన తరువాత.. ఇంటికోసం, ఫీజుల కోసం ట్యూషన్లు చెప్పేవాడు. ఇవేకాకుడంా హిమాన్షు పెయిడ్ బ్లాగులు రాసి ఆర్థికంగా కాస్త నిలదక్కుకోగలిగాడు. మెట్రో నగరానికి వెళ్లడానికి, పెద్ద నగరంలో చదువుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేసేందని తెలిపాడు.

గ్రాడ్యుయేషన్ తర్వాత

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత.. హిమాన్షుకు మంచి ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. కానీ దేశానికి సేవ చేయాలనే కోరిక అతనిలో బలంగా ఉంది. అతను UPSC సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాడు. దాని కోసం అతను పరిశోధనా విద్యార్థిగా ఒక ప్రభుత్వ కళాశాలలో చేరాడు. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. హిమాన్షు తన బ్యాచ్‌లోనే టాప్ ర్యాంకర్. ఆ సమయంలో విదేశాల నుంచి PhD చేసే అవకాశం వచ్చినప్పటికీ.. అతను సివిల్ సర్వీసెస్ మార్గాన్నే ఎంచుకున్నాడు. దేశానికి సేవ చేయడం తన మొదటి ప్రాధాన్యత అని అతను బలంగా నమ్మాడు.

మొదటి ప్రయత్నంలోనే IRTS

హిమాన్షు మూడుసార్లు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశాడు. మొదటి ప్రయత్నంలో IRTSకి.. రెండో ప్రయత్నంలో 2019లో 304వ ర్యాంక్ సాధించాడు. IPS అధికారిగా ఎంపికయ్యాడు. మూడో ప్రయత్నంలో తాను కోరుకున్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్(IAS)కు అర్హత సాధించాడు. నిరంతర ప్రయత్నం, కష్టపడి పనిచేయడం ద్వారా హిమాన్షు ఎట్టకేలకు విజయం సాధించాడు. IAS అధికారిగా తన కుటుంబానికి, సమాజానికి ఒక ఉదాహరణగా నిలిచాడు.