High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు

2 weeks ago 2
ARTICLE AD

High Court On Tuni Missing Case: కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. చిన్నారి ఆచూకీని తొందరగా కనిపెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

కేసు వివరాలు

కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారంలో ఉన్న పామాయిల్ తోట సమీపంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. చిన్నారితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చినప్పటికీ, పాప ఆచూకీ మాత్రం దొరకలేదు. ఈ కేసులో సుమారు 250 మందికి పైగా పోలీసులు, SDRF బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయినప్పటికీ చిన్నారి జాడ దొరక్కపోవడంతో బాధితుల కుటుంబం ఆవేదనతో హైకోర్టును ఆశ్రయించింది.

Also Read:  ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే- అమల్లోకి ఎలక్షన్ కోడ్

రాష్ట్రంలో మిస్సింగ్ కేసులపై నివేదిక

హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో నమోదవుతున్న మిస్సింగ్ కేసుల పరిస్థితిపై పోలీసులు ఉన్నత న్యాయస్థానానికి సమగ్ర నివేదికను సమర్పించారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,508 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో 4,284 మంది ఆచూకీని కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా 224 మంది జాడ తెలియాల్సి ఉందని కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. చిన్నారి జ్ఞానేశ్వరితో పాటు మిగిలిన మిస్సింగ్ కేసుల్లోనూ సమగ్రమైన దర్యాప్తు జరిపి ఆచూకీ కనిపెట్టాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది.

Also Read: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం

Read Entire Article