Aus Vs Ind Test News: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో భారత్ 184 పరుగులతో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీందో ఐదు టెస్టుల సిరీస్ లో 1-2తో వెనుకంజలో నిలిచింది. పదేళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ని కోల్పోయే దుస్థితిలో నిలిచింది. ఇందుకు ముఖ్య కారణంగా సీనియర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మను చెప్పుకోవచ్చు. అలాగే వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ నిర్లక్ష్య పూరిత బ్యాటింగ్ ను కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అప్పటివరకు సజావుగా సాగుతున్న భారత ఇన్నింగ్స్ పంత్ వికెట్ ఒక్కసారిగా పడిపోయాక, సైకిల్ స్టాండును తలపించింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు వెనుదిరిగారు. ఇక పంత్ వికెట్ తీసిన ఆనందంలో ఆసీస్ ఆల్ రౌండర్ ట్రావిస్ హెడ్ విచిత్రమైన సంబరాలను చేశాడు. దీనిపై తాజాగా భారత మాజీ క్రికెటర్ కమ్ పొలిటీషియన్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఫైరయ్యాడు

ఇంగీతం ఉండక్కర్లేదా..?
పంత్ ఔటయ్యాక హెడ్ విచిత్రమైన సంకేతాన్ని చూపాడు. తన ఎడమచేతిని గుండ్రగా చుట్టి, అందులో కుడి చేతి చూపుడు వేలును తిప్పుతున్నట్లు అసహ్యకరంగా సంకేతాన్ని ఇచ్చాడు. దీన్ని చూసిన చాలామంది క్రికెట్ ప్రేమికులు ఆక్వర్డ్ గా ఫీలయ్యారు. అయితే ఈ సంబరాలను తాజాగా సిద్దూ ఖండించాడు. జెంటిల్మన్ గేమ్ గా పేరున్న క్రికెట్ కు మచ్చ తెచ్చేందుకు హెడ్ ఇలాంటి వికృతాలకు పాల్పడుతున్నాడని ఆరోపించాడు. అతని చేష్టలతో 1.5 బిలియన్ల భారతీయులను అవమానించాడని ధ్వజమెత్తాడు. అతనిపై వెంటనే చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఎవరూ ఇలా మతిలేకుండా ప్రవర్తించుకుండా కఠినంగా వ్యవహరించాలని ఐసీసీని కోరాడు. టీవీల్లో మ్యాచ్ లను పిల్లలు, మహిళలు, ఇంకా చాలామంది వివిధ ఏజ్ గ్రూపుల్లోని వాళ్లు చూస్తారని, ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని చురకలు అంటించాడు.

Travis head’s obnoxious behaviour during the course of the Melbourne test doesn’t auger well for for the gentleman’s game…… sets the worst possible example when there are kids, women , young & old watching the game……. this caustic conduct did not insult an individual but a…

— Navjot Singh Sidhu (@sherryontopp) December 30, 2024

వెనకేసుకొచ్చిన కమిన్స్
ఇక హెడ్ చేసిన పనిని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెనకేసుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హెడ్ సంబరాలను తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించాడు. వేడేక్కిన తన చూపుడు వేలును, ఐస్ బకెట్లో పెట్టిన రీతిలో సంకేతాన్ని చూపాడని పేర్కొన్నాడు. ఇది సాధరణమేనని, అదోక జోక్ అని సమర్థించాడు. ఏదేమైనా మెల్ బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఓటమితో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరే అవకాశాలకు భారత్ క్లిష్టం చేసుకుంది.

ఫైనల్ రేసులో ఉండాలంటే సిడ్నీలో జరిగే ఐదో టెస్టును తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. అలాగే శ్రీలంక-ఆసీస్ టెస్టు సిరీస్ ఫలితం తనకు అనుకూలంగా రావాల్సి ఉంటుంది. ఇక, ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు సౌతాఫ్రికా చేరుకోగా, రెండోస్థానం కోసం భారత్, ఆసీస్, లంకల మధ్య పోటీ నెలకొంది.

Also Read: <a title="Ind Vs Aus Test Series: సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్ " href="https://telugu.abplive.com/sports/cricket/former-india-cricketer-surinder-khanna-took-a-dig-at-virat-kohli-and-rohit-sharma-over-their-poor-form-in-recent-matches-in-the-longest-format-of-the-game-192387" target="_blank" rel="nofollow noopener">Ind Vs Aus Test Series: సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్