Harley Davidson X440 T Features: హీరో-హార్లే భాగస్వామ్యంతో భారత మార్కెట్‌లోకి వచ్చిన మొదటి బైక్ X440 మంచి రెస్పాన్స్‌ తెచ్చుకుంది. ఇప్పుడు అదే లైనప్‌లోకి కొత్తగా Harley Davidson X440 T కూడా జాయిన్ అయింది. ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన అధికారిక ఫొటోలు బయటకు రావడంతో బైక్ లవర్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా రియర్ డిజైన్‌ విషయంలో చేసిన మార్పులు యూత్ దృష్టిని బాగా ఆకర్షించేలా ఉన్నాయి.

కొత్త రియర్ స్టైల్ - మరింత ఆకర్షణీయంగా
X440లో యూజర్లు ఎక్కువగా కంప్లెయింట్ చేసిన పాయింట్ రియర్ లుక్. అదే విషయాన్ని హార్లే ఈ కొత్త X440 Tలో చక్కగా సాల్వ్ చేసినట్టు కనిపిస్తోంది. కొత్త రియర్ త్రి–క్వార్టర్ సెక్షన్ మరింత అగ్రెసివ్‌గా, ప్రోపోర్షనేట్‌గా, షార్ప్‌గా కనిపిస్తోంది. వెనుక టైరు & ఫెండర్ మధ్య ఉన్న ఖాళీని తగ్గించి బైక్‌ను చూడడానికి మరింత సాలిడ్‌గా మార్చారు. రోడ్డుపై చూస్తే ఇది మరింత మస్కులర్ లుక్ ఇస్తుంది.

బార్ ఎండ్ మిర్రర్లు & కొత్త కలర్ ఆప్షన్లు
కొత్త X440 Tలో బార్ ఎండ్ మిర్రర్లను ఇచ్చారు. ఇవి బైక్‌కు స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి, యూత్‌కు ఇలాంటి స్టైల్ అంటేనే ఫ్లాట్‌ అవుతారు. అదే విధంగా, ఈ బైక్‌ కోసం నాలుగు కొత్త కలర్ ఆప్షన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటితో బైక్‌ రోడ్డుపై ఈజీగా స్టాండవుట్ అయ్యేలా ఉంటుంది.

ఫ్రంట్ డిజైన్ ఎందుకు చూపలేదు?
హార్లే రిలీజ్ చేసిన ఫొటోలంతా రియర్ (వెనుక) వైపు నుంచే ఉన్నాయి. ఫ్రంట్‌ను ఒక్క చిత్రంలో కూడా చూపలేదు. ఎందుకంటే ఫ్రంట్ డిజైన్ స్టాండర్డ్ X440 లాగే ఉండే అవకాశం ఉంది. బార్ ఎండ్ మిర్రర్లు మినహా పెద్ద మార్పులు ఉండవని అంచనా వేస్తున్నారు.

Ride-by-Wire థ్రోటిల్? అదనపు ఫీచర్లు ఉండే ఛాన్స్
ఫొటోలలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది - X440 లో ఉన్న పెద్ద థ్రోటిల్ కేబుల్, X440 T లో కనిపించడం లేదు. అంటే ఇది రైడ్‌ బై వైర్‌ (Ride-by-Wire) సెటప్‌నకు మారినట్టు తెలుస్తోంది.

Ride-by-Wire వస్తే ఇవి కూడా రావచ్చు:

రైడింగ్ మోడ్స్

ట్రాక్షన్ కంట్రోల్ (మార్చుకోగలిగేది)

స్విచ్‌బుల్ ABS

విశేషం ఏమింటంటే, ఈ బండిలో క్రూయిజ్ కంట్రోల్ మాత్రం లేదు. దీనిని తాజా హీరో బైక్స్‌లో ఇచ్చినా X440 T లో ఇవ్వలేదు.

మెకానికల్‌గా X440 కి దగ్గరగా
అధికారిక వివరాలు ఇంకా రిలీజ్ కాలేదు, కానీ అందుబాటులో ఉన్న ఫొటోల ఆధారంగా చూస్తే చాలా భాగాలు X440 కి దగ్గరగానే ఉన్నాయి.

అదే ఫ్రేమ్

అదే ఇంజిన్ సెటప్

అదే సస్పెన్షన్

17-ఇంచ్ వీల్స్

ముందు–వెనుక డ్యూయల్ డిస్క్ బ్రేక్స్

అంటే ఇది పూర్తిగా కొత్త బైక్ కాదని, X440 కి కాస్మెట్టిక్ అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పొచ్చు.

ధర ఎంత ఉండొచ్చు?
ప్రస్తుతం Harley-Davidson X440 ధరలు: ₹2.40 లక్షలు – ₹2.80 లక్షలు (ఎక్స్‌–షోరూమ్, తెలుగు రాష్ట్రాలు). కాబట్టి కొత్త X440 T కూడా ఇదే ప్రైస్ రేంజ్‌లో ఉండే అవకాశం చాలా ఎక్కువ.

X440 ని రీప్లేస్ చేస్తుందా?
ఇది కూడా ఇప్పుడు హాట్ డిబేట్ విషయం. X440 T పూర్తిగా X440 ని రీప్లేస్ చేస్తుందా? లేక రెండు మోడల్స్ సైడ్ బై సైడ్‌గా కొనసాగుతాయా? అనే విషయంపై అధికారిక కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.