Happy Teachers Day 2025 Best Wishes in Telugu : ప్రతి విద్యార్థి జీవితంలో గురువు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అందుకే జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఇస్తారు. శిష్యులను, విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువు పోషించే పాత్ర వెలకట్టలేనిది. అందుకే గురువులను స్మరించుకుంటూ.. సత్కరించుకునేందుకు, అభినందించేందుకు వీలుగా టీచర్స్ డేని జరుపుకుంటారు. దీనిని ఒక్కో దేశంలో ఒక్కోరోజు జరుపుకుంటారు. ఇండియాలో సెప్టెంబర్ 5వ తేదీన నిర్వహిస్తారు.

టీచర్స్ డే చరిత్ర.. (Teachers Day History)

టీచర్స్ డేరోజున సెలవు ఇవ్వరు కానీ.. స్కూల్స్‌లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచం అంతా అక్టోబర్ 5వ తేదీన టీచర్స్ డే జరుపుకుంటే.. ఇండియాలో టీచర్స్ డే సెప్టెంబర్ 5వ తేదీన ఎందుకు జరుపుతారు తెలుసా? ఉపాధ్యాయ వృత్తిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ తెచ్చిన గుర్తింపు, గౌరవానికి ప్రతీకగా.. అతని పుట్టిన రోజు (సెప్టెంబర్ 5)న ఇండియాలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు.

టీచర్స్ డే విషెష్ (Teachers Day Wishes)

ఉపాధ్యాయుల దినోత్సవం రోజు.. మీరు గురువులకు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్పాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ విధంగా ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి.

జీవితానికి సరైన మార్గనిర్దేశం చూపే మహానుభావులే గురువులు. అలాంటి వారందరికీ హ్యాపీ టీచర్స్ డే.

జ్ఞానాన్ని బోధించే ప్రతి గురువుకీ హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే 2025.

మీరు సూచించిన గైడ్‌లైన్స్ ఫాలో అవ్వడం వల్లే నా జీవితంల ఇలా అందమైన జర్నీని సొంతం చేసుకుంది. Thankyou For Evreything. Happy Teachers Day.

మీరు దిద్దించిన అక్షరాలే ఈరోజు నాకు గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. మీ సూచనలే నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు టీచర్.

నాలోని ప్రతిభను గుర్తించి.. నన్ను అన్ని విధాలుగా ప్రోత్సాహించి.. గొప్పవాడిని అవుతానని నమ్మి.. నా ఆశయాన్ని గుర్తించేలా చేసిన మీకు శతకోటి వందనాలు. హ్యాపీ టీచర్స్ డే సార్/మేడమ్.

ఈ ప్రపంచానికి మీరు టీచరే కావొచ్చు. కానీ మీ దగ్గర చదివిన మాకు మీరు ఓ సూపర్ హీరో. టీచర్స్ డే శుభాకాంక్షలు.

విద్య అంటే కేవలం పుస్తకాలు కాదని.. జీవితంలో ఎలా జీవించాలో నేర్పినందుకు మీకు ఎనలేని కృతజ్ఞతలు. హ్యాపీ టీచర్స్ డే అండి.

నా విజయాల వెనుక మీరు చూపిన దారి ఉంది. ప్రతి దశలోనూ నాకు మార్గదర్శకంగా నిలిచిన ప్రతి ఉపాధ్యాయులకు హ్యాపీ టీచర్స్ డే.

మీరు కూడా ఈ టీచర్స్ డేకి.. మీ గురువులతో ఉన్న ఫోటోలు లేదా.. కోట్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్పేయండి. లేదంటే ఉపాధ్యాయులకు గిఫ్ట్ ఇస్తూ.. స్వీట్ నోట్‌గా వీటిని రాసి పోస్ట్ చేయండి. విద్యను నేర్పిన గురువు దేవుడితో సమానమని గుర్తించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.