Happy Kartik Purnima 2025: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగించాలి? ఎక్కడ, ఎప్పుడు దీపం వెలిగిస్తే శుభం?

1 month ago 2
ARTICLE AD

Kartika Purnima 2025: కార్తీకమాసం మొత్తం ప్రత్యేకమే.. ఈ నెల రోజుల్లో పౌర్ణమి మరింత ప్రత్యేకం. ఈ రోజున శైవ, వైష్ణవ ఆలయాలు పంచాక్షరి, అష్టాక్షరి మంత్రంతో మారుమోగుతుంటాయ్. నక్షత్రాలు భూమ్మీదకు వచ్చాయా అన్నట్టు దీపాలతో ఆలయాలు మెరిసిపోతుంటాయ్. ఈ రోజు భక్తులు 365 వత్తులు వెలిగిస్తారు. ఎందుకు? ఈ లెక్కేంటి? దీనివెనకున్న ఆంతర్యం ఏంటి?

దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే

జీవాత్మకే కాదు పరమాత్మకి కూడా దీపం  ప్రతిరూపం. అందుకే శుభకార్యం ప్రారంభించిన వెంటనే ముందుగా దీపం వెలిగిస్తారు. భగవంతుడిని పూజించేందుకు ముందు ఆయనకు ప్రతిరూపం అయిన దీపాన్ని ముందుగా వెలిగించి పూజిస్తారు. స్వామిఅమ్మవార్లకు చేసే షోడశోపచారాల్లో ఇది మొదటి ఉపచారం. 16 ఉపాచారాలు చేసినా చేయకపోయినా...దీపం, ధూపం, నైవేద్యం తప్పనిసరి అని చెబుతారు

బంగారం, వెండి లేదంటే మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి కానీ స్టీలు సామగ్రిని దీపారాధనకు వినియోగించవద్దు

దీపాన్ని అగ్గిపుల్లతో కాకుండా ఏకహారతి, అగరుబత్తితో వెలిగించండి.

ఒక ప్రమిదలో ఒకవత్తితో దీపంవెలిగించవద్దు అశుభం...శుభానికి మూడు వత్తులు ఉండాలి.దీపం ఎలా వెలిగించాలో ఈ శ్లోకంలో స్పష్టంగా ఉంటుంది.

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణమంగళందీపం త్రైలోక్యతిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాంనరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతి ర్నమోస్తుతే

మూడు వత్తులను నూనెలో తడిపి వెలిగించిన ఈ దీపం 3 లోకాల చీకట్లను పొగట్టాలి..నరకం నుంచి రక్షించే ..  భగవంతుడికి ప్రతిరూపం అయిన ఈ జ్యోతికి భక్తితో నమస్కరిస్తున్నా అని పై శ్లోకం అర్థం. 3 వత్తులు మూడు లోకాలకి,  సత్త్వ, రజ, తమో గుణాలకి సంకేతం.

ఇన్ని విశిష్టతలున్న ఈ దీపానికి కార్తీకమాసంలో మరింత ప్రాధాన్యత ఉంది. నిత్యం దీపారాధన చేసినా లేకున్నా కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపం పెట్టిన పుణ్యం లభిస్తుందని కార్తీకపురాణంలో ఉంది.

తమస్సును పోగొట్టే జ్యోతి కాబట్టే...

తమసోమా జ్యోతిర్గమయా అని ప్రార్థిస్తారు

అజ్ఞానాన్ని పోగొట్టి అంధకారాన్ని తొలగిస్తూ జ్ఞానానికి సంకేతం అయిన దీపాన్ని కార్తీకమాసంలో వెలిగిస్తే విశేష ఫలితం ఉంటుంది

కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి ఘడియలు ఉన్నందుకే కార్తీకమాసం అనే పేరొచ్చింది...

కృత్తిక అగ్ని సంబంధించిన నక్షత్రం...ఆ అగ్నికి సూక్ష్మ రూపమే దీపం...అందుకే ప్రత్యక్ష దైవాల్లో ఒకటైన అగ్నిని ఆరాధించడమే దీని వెనుకున్న ఆంతర్యం.

ఏ ఇంట్లో నిత్యం దీపం వెలుగుతుందో అక్కడ ఎలాంటి బాధలు ఉండవు..ప్రతికూల శక్తులు అడుగుపెట్టలేవు. ఏడాది మొత్తం దీపాన్ని వెలిగించలేనివారు ఆ ఫలితాన్ని పొందేందుకు కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగిస్తారు

365 వత్తులు ఎక్కడ వెలిగించాలి?

ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం కోసం వెలిగించే 365 వత్తుల దీపాన్ని శివాలయంలో, వైష్ణవ ఆలయంలో వెలిగించవద్దు. ఇంట్లో తులసి మొక్క దగ్గర వెలిగించడం కూడా శుభప్రదం. అయితే పౌర్ణమి ఘడియలు ఉన్న సమయంలో చంద్రుడి వెలుగులో ఈ దీపం వెలిగిస్తే శుభప్రదం..

గమనిక:  పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

నవంబర్ 05 కార్తీక పౌర్ణమి! మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి!

మారేడు దళం: శివునికి ఎందుకంత ప్రీతి? బిల్వ పత్రం వెనుక దాగి ఉన్న రహస్యాలు, పూజా విధానం తెలుసుకోండి!

రావణుడు రచించిన ఈ స్తోత్రమే 'బాహుబలి' సినిమాలో పాట!

Read Entire Article