Dussehra 2025: శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన దసరా రోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. ఏటా తొమ్మిది రోజులు.. ఈ ఏడాది ఒకే తిథి రెండు రోజులు రావడంతో 10 రోజుల పాటూ రోజుకో అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు. విజయ దశమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత అయిన రాజరాజేశ్వరీదేవి .. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను అనుగ్రహించే దేవత. చేతిలో చెరుకుగడతో చల్లని చూపులతో ప్రశాంతమైన చిరునవ్వుతో వరాలు ప్రసాదిస్తున్నట్టు ఉంటుంది. ప్రారంభించే పనుల్లో అడ్డంకులు తొలగి విజయం వరించాలంటే రాజరాజేశ్వరి అమ్మను భక్తిశ్రద్ధతో పూజించాలి. సౌభాగ్యం కోసం ఈ రోజు వివాహితులు కుంకుమపూజ చేస్తారు. ఇంట్లో అయినా, ఆలయంలో అయినా లలితా సహస్రనామం పారాయణం చేయడం మంచిది.

ఈ రోజు తప్పనిసరిగా చవువుకోవాల్సిన , వినాల్సి అష్టకం ఇది

శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం (Sri Rajarajeswari Ashtakam)

అంబా శాంభవి చంద్రమౌళీ రబలా వర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రిణయనీ కాత్యాయనీభైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మి ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి

అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనంద సందాయనీ
వాణీ వల్లవపాణీ వేణు మురళీగాన ప్రియాలోలినీ
కళ్యాణీ ఉడు రాజబింబ వదనా ధూమ్రాక్ష సంహారిణి
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి

అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హేరావళి
జాతీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ విరాజితా
వీణా వేణు వినోద మండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి

అంబా రౌద్రాణి భద్రకాళి భగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా
చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణి వల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి

అంబా శూలధను: కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ
వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీ రామాసేవితా
మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి

అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా
గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి

అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యావై జగన్మోహినీ
యాపంచ ప్రణవాది రేఫ జననీ యాచిత్కళామాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి

అంబాపాలిత భక్తి రాజి రనిశం అంబాష్టకం యఃపఠే
అంబాలోకకటాక్ష వీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా
అంబా పావన మంత్రరాజ పఠనా ద్దంతీశ మోక్ష ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి

అక్టోబరు 01 బుధవారం మధ్యాహ్నం దశమి ఘడియలు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 02 మధ్యాహ్నం వరకూ దశమి ఘడియలున్నాయి. సూర్యోదయానికి తిథిని పరిగణలోకి తీసుకుంటారు. అందుకే అక్టోబరు 02న విజయ దశమి. ఈ రోజు రాజరాజేశ్వరి పూజ ఆచరించి..జమ్మిచెట్టుకి పూజచేస్తారు.

గమనిక:  ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించనవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

ABP దేశం ప్రేక్షకులకు విజయ దశమి శుభాకాంక్షలు. మీరు మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే ఈ శ్లోకాలతో తెలియజేయండి.