Gutta Sukhender Reddy: కుల గణన చారిత్రాత్మకం, ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి

9 months ago 8
ARTICLE AD

Telangana Caste Census | నల్గొండ:  దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో సామాజిక , ఆర్థిక , విద్య ,ఉపాధి , రాజకీయ, కుల సర్వే ( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ) నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయం అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితాకు, కుల గణన సర్వేలో తేలిన సమగ్ర సర్వేలో తేలిన లెక్కలకు అసలు పొంతన లేదన్నారు. కొందరికి రెండు చోట్ల ఓట్లు ఉండటం, కొందరు సర్వేలో పాల్గొనకపోవడం అందుకు కారణమన్నారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రములో నిర్వహించని విధంగా 94, 863  ఎన్యుమరేటర్స్ , 9 ,628 సూపర్ వైజర్స్ , 76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్లు ద్వారా 50  రోజుల్లో సమగ్ర సర్వేను నిర్వహించాం. ఈ సర్వేలో 97 శాతం ప్రజలు తమ వివరాలు నమోదు చేసుకున్నారు.

👉ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే లెక్కలు సరిగ్గా లేవు అనడం కరెక్ట్ కాదు. ఓటర్ లిస్ట్ కి , సర్వే లెక్కలకు తేడా ఉంటుంది ఎందుకు అంటే ఒక్కో వ్యక్తికి రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఓటర్ లిస్ట్ ఆధార్ కి అనుసంధానం చేస్తే కరెక్ట్ గా లెక్కలు వచ్చేయి.

👉కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సర్వే లెక్కలు తప్పుల తడఖా  అని విమర్శలు చేయడం సబబు కాదు. ప్రభుత్వం చేసిన కృషిని ఏ పార్టీ వారైనా అభినందించాలి .

👉రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలి . అధికారంలో ఉన్నప్పుడు ఒకలా , ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం మంచిది కాదు.

👉3 లక్షల కుటుంబాలు సర్వే అధికారులకు వివరాలు ఇవ్వలేదు .వారు కూడా ఇప్పుడు వివరాలు ఇవ్వవచ్చు  .

👉సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉన్నతాధికారులను , అధికారులను అభినందిస్తున్నాను

👉గత పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డ్స్ కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ని ఇస్తుంది.

👉అలాగే , BPL ,APL  కార్డ్స్ ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. దీనికి  సీఎం గారు సానుకూలంగా స్పందించారు.

👉BPL, APL కార్డ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

👉నిన్నటి వరకు రెండు ఎకరాల వరకు రైతు భరోసాను సర్కారు అందించింది. ఎకరాకు 6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది. అలాగే సేద్యం చేసే భూములన్నీకి కూడా రైతు భరోసా పథకాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను .

👉పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్ట్ ప్రకటనపై నేను  మాట్లాడను. రాజకీయాలకు  నాకు సంభందం లేదు.

👉కుల , మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఎవరు మాట్లాడిన అది తప్పే . బిసిలు, అగ్రకులాల మధ్య విద్వేషాలు పెంచే విధంగా మాట్లాడం అస్సలు కరెక్ట్ కాదు.

👉మదర్ డైరీ ఆస్తులు అమ్మడం సరికాదు. ఆస్థి అమ్మడమే  పరిష్కారం కాదు.సంస్థను కాపాడుకోవాలి.

Read Entire Article