Designated terrorist Gurpatwant Singh Pannun seen shouting Khalistan Zindabad at Donald Trump presidential inauguration : భారత్ లో ఉగ్రదాడులు చేస్తామంటూ తరచూ బెదిరించే గురు పట్వంత్ సింగ్ పన్నూ ట్రంప్ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో కనిపించారు. అక్కడ ఆయన ఖలిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేస్తూ వీడియో కూడా తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

🚨SHOCKING!

Designated terrorist Gurpatwant Singh Pannun seen shouting "Khalistan Zindabad" at Donald Trump's presidential inauguration.

Pannun has issued several death threats to Indian diplomats and leaders, including threats of air-b0mbing.

How such extremist can get… pic.twitter.com/RBfLpyhL9r

— The Hawk Eye (@thehawkeyex) January 21, 2025

గురుపట్వంత్ సింగ్ పన్నూను ఖలిస్థానీ ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది. ఇటీవలి కాలంలో పన్నూన్ చాలా సార్లు భారత్ లో దాడులు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తూంటారు. కెనడాలోని హిందువులంతా దేశం విడిచి వెళ్లిపోవాలని కొన్ని రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేశాడు.సిక్కుల కోసం భారత్‌లో ఖలిస్తాన్‌ అనే ప్రత్యేక దేశం ఏర్పాటే తన జీవితాశయమని ప్రకటించుకున్న గురుపట్వంత్‌ సింగ్‌ పన్నూ.. పంజాబ్‌ రాష్ట్రంలో అమృత్‌సర్‌ సమీపంలోని ఖంజోత్‌ అనే గ్రామంలో జన్మించాడు. అంటే జన్మతహా భారతీయుడే. న్యాయ విద్య అభ్యసించాడు.

తర్వాత కెనడాకు వలస వెళ్లి, అక్కడే స్థిరపడ్డాడు.. కెనడా పౌరసత్వం కూడా సంపాదించాడు. తర్వాత అమెరికా పౌరసత్వం కూడా పొందాడు. అమెరికాలో సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే సంస్థను స్థాపించాడు. భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. భారత్‌లో జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో అతడి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఖలిస్తాన్‌ ఉద్యమానికి మద్దతుగా కెనడాతోపాటు అమెరికా, యూకే, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో ర్యాలీలు నిర్వహించాడు పన్ను. ఖలిస్తాన్‌కు అనుకూలంగా వివిధ దేశాల ప్రభుత్వాల మద్దతును కూడగట్టడానికి లాబీయింగ్‌ చేస్తున్నాడు.

2020 జూలైలో పన్నూను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు కెనడా, అమెరికాలో ఆజ్ఞాతంలో ఉన్నాడు. ఎంతగా ఉంటే..తనను భారత్ చంపేస్తోందేమోనని భయంతో వణికిపోతున్నాడు. ఈయనను అడ్డం పెట్టుకుని కెనడా, అమెరికా భారత్ కు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నాయి. పన్నును హ త్య చేయడానికి ఓ భారత రా ఏజెంట్ వచ్చాడని ఓ మాజీ అధికారిపై అమెరికాలో కేసు పెట్టారు. ఇప్పుడు ట్రంప్ ప్రమాణ స్వీకారంలోనే కనిపించాడు.

Also Read: Donald Trump Speech Highlights: అమెరికా భూభాగం విస్తరణపై ఫోకస్, దక్షిణ ప్రాంతంలో నేషనల్ ఎమర్జెన్సీ: ట్రంప్ ఫస్ట్ స్పీచ్ హైలైట్స్