Gunde Ninda Gudi Gantalu: స్టార్‌మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ ఈరోజు ట్విస్టులపై ట్విస్టులతో సాగుతుంది. అరుణ్ అడ్డుకున్నా సరే బాలు మీనా సాయంతో ట్యాక్సీ స్టాండ్‌ వద్ద అమ్మవారి విగ్రహం పెట్టడానికి పోలీసుల పర్మిషన్ సంపాదిస్తాడు. అటు తాయారు శోభనతో కలిసి బాలు కుటుంబంపై పగతీర్చుకునేందుకు కుట్రలు పన్నుతుంటుంది. ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకోవాలని బాలు కుటుంబం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.
నవరాత్రులకు పర్మిషన్
దసరా నవరాత్రులు సందర్భంగా ట్యాక్సీస్టాండ్ వద్ద అమ్మవారి విగ్రహం పెట్టి పూజలు చేసేందుకు బాలు పోలీసు పర్మిషన్ కోసం వెళ్లగా...అక్కడ అరుణ్ అడ్డుపడి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తాడు. నీకు దిక్కు ఉన్నచోట చెప్పుకోమని అరుణ్ బాలును హేళన చేస్తాడు. ఇక్కడి నుంచి వెళ్తే పర్మిషన్‌తోనే వెళ్తానని బాలు భీష్మించుకుని కూర్చుంటాడు. అప్పుడే మీనా ఫోన్ చేయగా...విషయం చెబుతాడు.ఆమె వెంటనే వెళ్లి గుడి ట్రస్ట్రీని కలిసి జరిగింది మొత్తం చెబుతుంది. మా ఆయనపై కోపంతో వాళ్లు పర్మిషన్ ఇవ్వడంలేదని...మీరు గుడి ధర్మకర్త కాబట్టి మీరు వెళ్లి అడిగితే ఇస్తారని చెప్పడంతో ఆయన సరేనని వెళ్లి ఎస్‌ఐని కలిసి పర్మిషన్ అడుగుతాడు. దీంతో వెంటనే పర్మిషన్ లెటర్‌పై ఎస్‌ఐ సంతకం పెడతాడు.అది తీసుకుని వచ్చి అతను బాలుకు ఇచ్చి వెళ్తాడు. ఇప్పుడు చూశావు కదా నా పవర్‌ ఏంటోనని బాలు అరుణ్‌తో చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు.
శోభనతో కలిసి తాయారు కుట్రలు
బాలువాళ్ల జరిగిన అవమానంతో శృతివాళ్ల అమ్మ శోభన కోపంతో రగిలిపోతుంటుంది. అప్పుడే అక్కడికి మంగతాయారు వచ్చి పరిచయం చేసుకుంటుంది. మీరు ఎవరో నాకు తెలియదని శోభన అనగా..మీరు నాకు బాగా తెలుసునని అంటుంది.అలాగే బాలు ఇంట్లో మీకు జరిగిన అవమానం కూడా తెలుసునని అంటుంద. నాకు ఆ మీనా బద్ధశత్రువు అయితే నీకు ఆ బాలుగాడు శత్రువు అని చెబుతుంది.కాబట్టి మీరు నాతో చేతులు కలిపితే మనమిద్దరం కలిసి ఆ కుటుంబాన్ని ముప్పతిప్పలు పెడదామని చెబుతుంది. దీనివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటని శోభన అడుగుతుంది. శత్రువుకు శత్రువు మిత్రులు అన్నట్లు...మన ఇద్దరి పగ తీరుతుందని చెబుతుంది.అదెలా అంటే నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఐడియా ఉందని...దీంతో ఆ కుటుంబం రోడ్డుమీదకు వచ్చేస్తుందని అంటుంది. కాబట్టి మీరు నాకు సాయం చేస్తానంటే ఇద్దరం కలిసి ఒకేసారి పగతీర్చుకుందామని చెబుతుంది.దీనికి శోభన కూడా సరేనంటుంది.
ఘనంగా దేవీ నవరాత్రులు
పోలీసు పర్మిషన్ రావడంతో ట్యాక్సీస్టాండ్ వద్ద చెట్టుకింద దుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. తొలిపూజకు బాలు కుటుంబం మొత్తాన్ని తీసుకుని అక్కడికి వచ్చి ఘనంగా పూజలు జరిపిస్తాడు. అక్కడ మనోజ్ నోటికొచ్చినట్లు మాట్లాడగా...బాలు వాడికి బుద్ధి వచ్చేలా చెంపలు వాయించుకోమని లేకపోతే నోరు పడిపోవాలని శపిస్తానని అనడంతో ప్రభావతి వాడిని చెంపలు వేసుకోమని చెబుతుంది.మనోజ్ అక్కడ కోతలు కోస్తుండటంతో రాజేశ్‌ను పిలిచి అమ్మవారి పూజకు చందారాయించమని బాలు పురమాయిస్తాడు.దీంతో రాజేశ్ అక్కడికి వెళ్లి మనోజ్‌ను చందా అడగ్గా...డబ్బులు లేనప్పుడు పూజలు ఎవడు చేయమన్నాడని అంటాడు. ఒక్కరూపాయి కూడా ఇవ్వనని చెబుతాడు. దీంతో రవి తాను ఇస్తానని చందా రాస్తాడు. అలాగే సత్యం కూడా ఇస్తానని చెబుతాడు.రోహిణి కూడా తాను చందా ఇస్తానని చెబుతుంది. దీంతో ప్రశాంతంగా పూజ ముగుస్తుంది.అయితే అప్పుడే అక్కడికి గుణ వచ్చి వడ్డీ డబ్బులు కోసం రాజేశ్‌ను బెదిరిస్తుంటాడు.దీంతో బాలు అక్కడికి వెళ్లి గుణకు వార్నింగ్ ఇస్తాడు.సత్యం వచ్చి కొడుకుని తిట్టి ఈ నవరాత్రులు అయిపోయే వరకు గొడవలకు వెళ్లనని ప్రమాణం చేశావు కదా అని తీసుకెళ్తాడు. ఈ మాటలు విన్న గుణ..వీడికి ఈనవరాత్రులు ముగిసేసరికి గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు.