Gunde Ninda Gudi Gantalu Today Episode Oct 27:స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.శృతితో ఇంట్లో పనిచేయిస్తున్నారని శృతివాళ్ల అమ్మ వచ్చి గొడవ చేస్తుంది. ఇంట్లోవాళ్లను తిడుతుంది. దీంతో బాలుకుకోపం వచ్చి మెడపట్టి బయటకు గెంటివేస్తానని హెచ్చరిస్తాడు.శృతి కూడా వాళ్ల అమ్మను బయటకు వెళ్లిపొమ్మని హెచ్చరిస్తుంది.ఇదే అడ్వాన్స్‌గా తీసుకుని రోహిణి శృతికి ఎక్కించి చెప్పాలని చూస్తుంది. కానీ డబ్బులమ్మ తిరిగి గట్టిగా బుద్ధి చెబుతుంది.

బాలు కోపం
దసరా శరన్నవరాత్రుల కోసం ఇంట్లో అందరూ కలిసి ఇల్లు దులుపుతుంటే శృతి వాళ్ల అమ్మ అక్కడికి వచ్చి అందరినీ తిడుతుంది. నా కూతురితో పనులు చేయిస్తారా అని అరుస్తుంది. వాళ్లు ఏం చేయమని చెప్పలేదని నేనే చేస్తున్నానని శృతి చెబుతున్నా వినకుండా అందరినీ అనరాని మాటలు అంటుంది. పనులు చేయడానికి ఇద్దరు కోడళ్లు ఉన్నారు కదా గతిలేని వాళ్లతో చేయించుకోండని తిడుతుంది. దీంతో బాలుకు కోపం వచ్చి శృతి వాళ్ల అమ్మను గట్టిగా తిడతాడు.శృతి వాళ్ల అమ్మ మరింత రెచ్చిపోయి సత్యం గురించి మాట్లాడుతుంది.ఉద్యోగం లేకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుని ఉంటున్నాడు కదా ఆయనతో ఇల్లు దులిపించుకోవచ్చని అనడంతో బాలుకు కోపం రెట్టింపవుతుంది.ఇంకొక్క నిమిషం ఇక్కడే ఉంటే మెడపట్టుకుని బయటకు గెంటివేస్తానని హెచ్చరిస్తాడు. ఇప్పటి వరకు శృతి వాళ్ల అమ్మ అని మర్యాద ఇస్తున్నానని అంటాడు. మొగుడు అడ్డమైన పనులు చేసి అడ్డదిడ్డంగా సంపాదిస్తుంటే...వాటిని ఏం చేయాలో తెలియక నువ్వు నోటికొచ్చినట్లు వాగుతున్నావని అంటాడు. దీంతో శృతి కల్పించుకుని ఇక్కడి నుంచి వెళ్లకపోతే నేనే గెంటివేస్తానని హెచ్చరించడంతో వాళ్ల అమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దేవీనవరాత్రులు అయ్యే వరకు ఎవరితో గొడవ పెట్టుకోనని బాలుతో మీనా ప్రమాణం చేయిస్తుంది.

శృతిని రెచ్చగొట్టిన రోహిణి
శృతి వాళ్ల అమ్మకు ఇంట్లో జరిగిన అవమానం తలచుకుని బాధపడుతుంటుందనుకుని రోహిణి ఆమె దగ్గరకు వెళ్తుంది. ఏదోవిధంగా బాలుపై లేనిపోనివి చెప్పి శృతిని నావైపు తిప్పుకోవాలని రోహిణి అనుకుంటుంది. శృతి దగ్గరకు వెళ్లి ఆమెను ఓదార్చుతున్నట్లు నటిస్తుంది. బాలులాంటి వాడు ఇంట్లో ఉంటే మనలాంటి కోడళ్లకు ఇలాంటి పరిస్థితులే వస్తాయని అంటుంది. బాలు నోటికి అడ్డూ అదుపులేకుండా పోతున్నాయని అంటుంది. మీ అమ్మకు ఈ ఇంట్లో జరిగిన అవమానం చూస్తుంటే...తల్లిలేని నాకే గుండె తరుక్కుపోతుందని..ఇక నీ సంగతి చెప్పాల్సిన పనిలేదని అంటుంది. శృతి కోపంతో ఉందనుకుని మరింత రెచ్చగొడుతుంది. దీంతో శృతి ఆవేశంతో ఊగిపోతూ ఇప్పుడే వెళ్లి ఆ బాలును కడిగేస్తానని అంటుంది.ఇంటిని మూడు ముక్కలు చేసి వాడి పరువు బజారులో పెడతానని అంటుంది. ఈమాటలు విన్న రోహిణి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది.వెళ్లు వెళ్లు త్వరగా వెళ్లి ఆ బాలు పని చెప్పు అని అంటుంది.
రోహిణికి బుద్ధి చెప్పిన శృతి
ఇదంతా అక్కడే ఉండి వింటున్న రవి...చాలా కంగారుపడతాడు.మా వదిని శృతిని రెచ్చగొట్టినట్లు ఉందని...ఇప్పుడు కోపంలో ఇది ఏం చేస్తుందో ఏంటోనని ఆందోళన చెందుతాడు. శృతిని ఆపుదామని వెళ్తుండగానే శృతి ఒక్క అడుగు వెనక్కి వేసి రోహిణి దగ్గరకు వస్తుంది.ఇప్పుడు నేను వెళ్లి బాలుతో గొడవపెట్టుకుంటానని చాలా ఆశపడుతున్నావు కదా అని అంటుంది.నీలాంటి పిచ్చివాళ్లు చెప్పే మాటలకు నేన రియాక్ట్ అవ్వనని అంటుంది.అసలే బాలు మా అమ్మను తక్కువ తిట్టాడని నేను ఫీల్ అవుతుంటే..నువ్వేంటి మధ్యలో వచ్చి ఇలా అన్నాడు,అలా అన్నాడని అంటుంది. మా అమ్మ చేసిన పనికి నేను అయితే ఖచ్చితంగా కొట్టేదాన్ని అని అనడంతో రోహిణి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. భార్య చేసిన పనికి రవి ఆమెను ఎత్తుకుని గిరగిరా తిప్పుతాడు.

మళ్లీ ఎదురుపడిన బాలు, అరుణ్‌
ట్యాక్సీ స్టాండ్‌లో అమ్మవారి విగ్రహం పెట్టుకోవడానికి బాలు,రాజేశ్‌ పర్మిషన్‌ కోసం స్టేషన్‌కు వెళ్తారు. ఆ స్టేషన్‌ ఎస్‌ఐ అరుణ్ ఫ్రెండ్‌ కావడంతో అరుణ్‌ కూడా అక్కడికి వస్తాడు.ఎందుకు మళ్లీ సస్పెండ్ అయ్యావురా అని ఎస్‌ఐ అడగ్గా...ఓ ట్యాక్సీ డ్రైవర్‌గాడు పదేపదే నాకు అడ్డుపడుతున్నాడని చెబుతాడు. వాడి సంగతి నేను చూసుకుంటానని ఎస్‌ఐ అంటాడు. అప్పుడే అక్కడికి పర్మిషన్ కోసం బాలు రాగా...వాడేనని చూపిస్తాడు.దీంతో ఎస్‌ఐ విగ్రహం పెట్టుకోవాడనికి పర్మిషన్ ఇవ్వనని చెబుతాడు.