Gunde Ninda Gudi Gantalu: స్టార్‌మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ ఈరోజు ట్విస్టులపై ట్విస్టులతో సాగుతుంది.కారుకు నిజంగానే బ్రేకులు ఫెయిలయ్యాయని కానిస్టేబుల్ చెప్పినా అరుణ్‌ బాలుపై కోపంతో కేసు పెట్టాలని చూస్తాడు.ఇంటికి వచ్చిన తర్వాత బాలుదే తప్పన్నట్లు మనోజ్, రోహిణి మాట్లాడుండగా మీనా గట్టిగా బదులిస్తుంది. స్టేషన్‌కు వెళ్లి సీఐతో మాట్లాడదామని బాలుకు మీనా సలహా ఇస్తుంది.
బాలుపై కక్షగట్టిన అరుణ్
బాలు కారుతీసుకుని వస్తున్న కానిస్టేబుల్‌కు చేయివిరిగి, తలకు కట్టుకట్టుకుని రావడం చూసి ఏమైందని అరుణ్‌ అడుగుతాడు.ఆ కారుకు నిజంగానే బ్రేకులు పడటం లేదని అందుకే గోడకు గుద్దడంతో దెబ్బలు తగిలాయని చెబుతాడు.అంటే ఆబాలు చెప్పింది నిజమేనా అంటాడు.అవునని నిజంగానే కారుకు బ్రేకులు ఫెయిలయ్యాయని...అతను కావాలని మిమ్మల్ని ఢీకొట్టలేదని చెబుతాడు. మెకానిక్‌క తీసుకుని వచ్చి కారు బాగుచేయించి తీసుకుని వస్తున్నానని అంటాడు. అప్పుడు మెకానిక్ కూడా కారు బ్రేక్ వైరు తెగిపోయి ఆయిల్‌ మొత్తం లీకవ్వడం వల్ల ఇలా జరిగిందని అంటాడు. సాధారణంగా ఇలా జరగడం అరుదని...ఎవరో కారు బానెట్ ఓపెన్ చేసి బ్రేక్ వైరు కట్‌చేశారని చెబుతాడు.ఇదంతా చూస్తుంటే బాలుపై కుట్రతోనే ఇదంతా చేసినట్లుగా అనిపిస్తుందని అంటాడు.అయితే ఈవిషయం మీరు ఎవరికీ చెప్పొద్దని అరుణ్ అంటాడు. అయ్యే పాపం అతని తప్పులేదని తెలిసినప్పుడు అతని కారు అతనికి ఇద్దామని..లైసెన్స్‌ కూడా రద్దు చేయించవద్దని కానిస్టేబుల్ అంటాడు.వాడిమీద తీర్చుకోవాల్సిన పగ చాలా ఉందని..ఓ ఆరునెలలపాటు వాడిని కారుకు దూరం చేస్తేగానీ బుద్ధిరాదని అరుణ్ అంటాడు. మీరు ఈ విషయాలు ఎవరికీ చెప్పకుండా ఉండండని అంటాడు.
మనోజ్‌పై చేయిచేసుకోబోయిన సత్యం
ఉసూరుమంటూ ఇంటికి తిరిగివచ్చిన బాలు,మీనాను ఏమైందని ఎందుకు అలా ఉన్నారని సత్యం అడుగుతాడు.బాలు కారుకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పగానే సత్యం ఎంతో కంగారుపడతాడు. వాడికి ఏం కాలేదు కదా అని అంటాడు.అసలు ఏం జరిగిందని అనగా...ఈయన ఓ గర్భిణీని, పిల్లాడిని తప్పించబోయి రో‌డ్డుపక్కనే ఉన్న ట్రాఫిక్ ఎస్‌ఐ అరుణ్‌ బైక్‌ను ఢీకొట్టాడని అంటుంది.దీంతో అతను కారును స్టేషన్‌కు తీసుకెళ్లి సీజ్ చేశాడని...బాలు లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయిస్తానని అంటున్నాడని చెబుతుంది.వెంటనే కల్పించుకున్న ప్రభావతి వీడు నిజంగానే ఆ అరుణ్‌ను చంపడానికి ప్రయత్నించి ఉంటాడని అంటుంది. వీడికి వాడంటే అసలు పడదుకదా అని అంటుంది. మధ్యలో కల్పించుకున్న మనోజ్‌ కూడా వీడు కావాలనే ఆ పని చేసి ఉంటాడని మాట కలుపుతాడు. రోహిణి కూడా ఎప్పుడూ ఎవరితో ఒకరితో గొడవపడకుండా ఉండలేడు కదా అని అంటుంది. నా అంత డ్రైవర్‌లేడని గొప్పలు చెప్పుకుంటాడు కదా కనీసం బ్రేకుల్ ఫెయిల్‌ అయితే కారును ఆపడం కూడా రాదా అని మనోజ్ తిట్టగానే...సత్యంకు కోపం వస్తుంది. మనోజ్ చొక్కాపట్టుకుని గట్టిగా నిలదీస్తాడు. వాడుపెట్టిన బిక్షతోనే ఈరోజు నువ్వు చూడగలుగుతున్నావని నా కొడుకుని ఎవరైనా ఇంకొక్క మాట అంటే ఊరుకోనని అంటాడు. వాళ్లిద్దరూ పాపం తలిచి మీ కాపురం నిలబెట్టారని..ఇవాళ నువ్వు ఈ ఇంట్లో ఉన్నావంటే అది వాళ్ల చలువేనని నీకు తెలియదా అని రోహిణిని తిడతాడు. ఇంతలో మీనా అందుకుని మనోజ్‌, రోహిణిని గట్టిగా కడిగిపారేస్తుంది.ఎన్ని చేసినా వీళ్లకు బుద్దిరాదని తిడుతుంది. కారుపోతే ఇంకొకటి కొనుక్కుందామని నీకు ఏంకాలేదు కదా అదేచాలని సత్యం బాలును లోపలికి పంపిస్తాడు.
భర్తకు తాయత్తు కట్టిన మీనా
లోపలికి వెళ్లిన తర్వాత మీనా బాలును గట్టిగా మందలిస్తుంది.ఆ శృతితో కలిసి నువ్వు కూడా బాగా నా మాట వినడం లేదని తిడుతుంది. నేను కీడు శంకించే ఈ తాయత్తు తీసుకుని వచ్చానని కానీ మీరు నా మాట వినకుండా కట్టుకోలేదని మీనా అంటుంది.అందుకే ఈ సమస్య వచ్చిందని చెప్పి తాయత్తు కడుతుంది.రేపు స్టేషన్‌కు వెళ్లి పై అధికారులతో మాట్లాడదామని చెబుతుంది.