Gunde Ninda Gudi Gantalu: స్టార్‌మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ ఈరోజు ట్విస్టులపై ట్విస్టులతో సాగుతుంది. రోహిణి, మాణిక్యం ఇద్దరూ ఒకే పెళ్లికి వెళ్లారని తెలుసుకున్న విద్య...ఈ విషయం రోహిణికి చెప్పేందుకు చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఆమె ఫోన్‌ ఎత్తదు. ఇంతలో పెళ్లిమండపంలోకి ఓ దొంగల జంట వచ్చి కామాక్షి నగలపై కన్నేస్తుంది. వారిని మీనా గుర్తుపడుతుంది.అంతా పెళ్లి హడావుడిలో ఉంటే....విద్య మాత్రం చాలా టెన్షన్ పడుతుంది.
సుందరి పెళ్లి హడావుడి
సుందరి పెళ్లి పనుల్లో బాలు కుటుంబం మొత్తం బిజీగా ఉంటుంది. అటు మాణిక్యం కూడా వంటలను దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటాడు. ఇంతలో విద్య పదేపదే ఫోన్ చేస్తుంటే...ఎందుకు ఫోన్ చేస్తున్నావంటూ రోహిణి కాల్‌ లిప్ట్ చేసి అడుగుతుంది. ఆ మాణిక్యం ఫోన్ చేసి పెళ్లికి రమ్మని చంపుతున్నాడే అని అంటుంది. వాడు ఫోన్ చేస్తున్నాడనే నేను సైలెంట్‌లో పెట్టుకున్నానని చెబుతుంది. ఆల్రెడీ నేను ఇంకో పెళ్లికి వచ్చానని ఇక్కడ పెళ్లికుమార్తెకు మేకప్‌ వేయాల్సింది కూడా నేనే అని చెబుతుంది. కాబట్టి నువ్వు కూడా వాడు చెప్పిన పెళ్లికి వెళ్లొద్దు నన్ను విసిగించొద్దని ఖరాఖండింగా చెప్పి ఫోన్ కట్‌ చేయబోతుంది.ఇంతలో తాను ఏ కల్యాణమండపంలో ఉన్నానో చెప్పి పెట్టేస్తుంది. తీరిగ్గా ఆలోచించిన విద్య...మాణిక్యం చెప్పిన కల్యాణమండపం కూడా ఇదే కదా అని అనుకుంటుంది.వెంటనే వెళ్లి శుభలేఖ తెరిచి చూడగా అదే కల్యాణమండపం ఉంటుంది. అంటే ఇప్పుడు మాణిక్యం ఉన్న పెళ్లిలోనే రోహిణి తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని వెళ్లిందా అని ఖంగుతింటుంది.
కామాక్షి హడావుడి
పెళ్లికూతురు కన్నా కామాక్షి నగలన్నీ దిగేసుకుని చాలా హడావుడి చేస్తుంది. అక్కడికి వచ్చిన ప్రభావతి దాని పెళ్లికన్నా నీ హడావుడి ఎక్కువ ఉందని అంటుంది. ఏం చేస్తాం మాకు పిల్లలు లేరు కదా అందుకే ఎలాంటి ఫంక్షన్లు చేయలేదని..పెళ్లయినప్పటి నుంచి చేయించుకుని దాచుకున్న నగలన్నీ పెట్టుకుని అందరికీ చూపించాలని చాలా సంబరపడేదాన్ని అని అంటుంది.ఆ ముచ్చట ఇన్నాళ్లకు తీరిందని కామాక్షి అంటుంది. జాగ్రత్త వదిన పెళ్లిలో దొంగలు ఉంటారు అని చెప్పగా....ఇక్కడ అఅందరూ మనవాళ్లే ఉన్నప్పుడు నా నగలు ఎవరు కొట్టేస్తారని అంటుంది.ఇంతలో ఓ దొంగజంట పెళ్లిమండపంలోకి వస్తుంది. రాగానే కామాక్షి మెడలో ఉన్న హారాలు, బంగారం చూసి కొట్టేయడానికి పథకం వేస్తుంది. చిన్నగా కామాక్షి దగ్గరకు వచ్చి వరుసలు కలిపి దూరపు బంధువులమని చెప్పి మాట కలుపుతారు. కామాక్షి తొలుత అనుమానించినా...నగలు, చీర బాగున్నాయని చెప్పగానే కరిగిపోయి తన బంధువులేనని అందరికీ పరిచయం చేస్తుంది.
మనోజ్‌ కక్కుర్తి
పెళ్లి పనులన్నీ అయిపోయానని ఇంకా ఏమైనా పనులు ఉంటే చెప్పమని బాలు,రవి వాళ్ల నాన్ను అడుగుతారు. ఆయన శంకరాన్ని పిలిచి ఏమైనా పనులు ఉన్నాయా అని అడగ్గా....ముందు వెళ్లి టిఫిన్ చేసి రండని చెప్పి పంపిస్తాడు. ఈ మనోజ్‌గాడు ఎక్కడా కనిపించడం లేదని అంటుండగానే...ప్లేటుకు పట్టనంత టిఫిన్ వేయించుకుని అక్కడ తింటున్న మనోజ్‌ను చూసి బాలుకు కోపం వస్తుంది.వీడికి అసలు సిగ్గు అనేదే ఉండదా అని అంటాడు. తేరగా వచ్చిందని ఎలా తింటున్నాడో చూడు నాన్న అని అంటాడు. వెంటనే మనోజ్‌ దగ్గరకు వెళ్లి తిడతాడు. ఇంటి దగ్గరే కదరా మెక్కి వచ్చావు మళ్లీ ఎందుకు అలా తింటున్నావని అడుగుతాడు. మనం తినడానికే ఇవన్నీ పెట్టారని చెబుతాడు.అయితే మాత్రం అలా కక్కుర్తిగా తినాలా అని తిడతాడు.
విద్య ఆందోళన
మాణిక్యం కూడా అదే పెళ్లిలో ఉన్నాడని రోహిణికి చెప్పడానికి విద్య ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమె సెల్‌ఫోన్ సైలెంట్‌లో ఉండటంతో ముందుగా మనోజ్‌కు కాల్‌ చేస్తుంది. నేను టిఫిన్ తింటూ చాలా బిజిగా ఉన్నానని మీనా అక్కడే ఉందని తనకు చేయమని చెబుతాడు.దీంతో విద్య మీనాకు ఫోన్ చేసి రోహిణికి ఇవ్వమని అంటుంది. ఏదైనా అర్జెంట్‌ అయితే నాకు చెప్పమని మీనా అంటుంది. అలాంటిదేమీ లేదని పార్లర్‌ గురించి అని చెప్పగా...అక్కడికి వెళ్లిన తర్వాత చెబుతానంటుంది. ఇంతలో పెళ్లికూతురు రూమ్‌లో దొంగలను చూసిన మీనా వాళ్లను ఎక్కడో చూసినట్లు ఉందని గుర్తుపడుతుంది. వీళ్ల ఫొటోలు పేపర్‌లో చూశానే అని అనుకుంటుంది.