Gunde Ninda Gudi Gantalu: స్టార్‌మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ ఈరోజు ట్విస్టులపై ట్విస్టులతో సాగుతుంది. శృతివాళ్ల అత్త చేసిన పనికి నీతూ తిట్టడంతో కోపంతో ఇంటికి వచ్చిన శృతిపై అరుస్తాడు. మా అమ్మ చేసిన పనికి నన్ను తిడతావేంటని శృతి కూడా ఎదురు మాట్లాడుతుంది.దీంతో ఇద్దరూ అలిగి అన్నం తినకుండా పడుకుంటారు. అప్పుడు బాలు మంచి ప్లాన్ వేసి వాళ్లిద్దరినీ ఎలా కలిపాడన్నదిఈరోజు ఎపిసోడ్‌లో ఆసక్తిగా సాగుతుంది.
కోపంతో రగిలిన రవి
శృతివాళ్ల అమ్మ రెస్టారెంట్‌ కొంటానని నీతూతో మాట్లాడటంతో...ఆమె రవిని పిలిచి తిడుతుంది. నువ్వు రెస్టారెంట్ పెట్టుకోవాలంటే ఇది పద్ధతి కాదని అందరి ముందు అవమానిస్తుంది.దీంతో కోపంతో రగిలిపోయిన రవి ఇంటికి వస్తాడు. శృతిని తీసుకుని మాట్లాడాలంటూ విసురుగా తన గదిలోకి తీసుకెళ్తాడు. ఏం జరిగిందని శృతి అడగ్గా...నువ్వు, నీ అమ్మ ఇక మారరా అని అరుస్తాడు. అసలు ఏం జరిగిందో చెప్పకుండా తిడతే ఏం అర్థమవుతుందని అంటుంది. ఎప్పుడు చూడూ మీకు డబ్బు పిచ్చి తప్ప అవతలి వాళ్ల ఫీలింగ్స్‌ అర్థంకావు అని అంటాడు. ఈరోజు రెస్టారెంట్‌లో నా పరువు మొత్తం పోయిందని చెబుతాడు. నీతూ అనరాని మాటలన్నీ అన్నదని...తిడతాడు. అసలు ఏం జరిగిందని అడగ్గా.. శృతి వాళ్లఅమ్మ రెస్టారెంట్‌కు వచ్చి చేసిన రచ్చ గురించి చెబుతాడు. మా అమ్మ చేసింది ముమ్మాటికీ తప్పే....కానీ నువ్వు రెస్టారెంట్‌ పెట్టుకుని బాగుపడాలని అనుకోవడం తప్పుకాదు కదా అనిఅంటుంది.నేను ఇప్పటికే వందసార్లు చెప్పానని నేను నా కాళ్లమీద నిలబడతాను తప్ప...మీ అమ్మగారి ఆస్తి తీసుకోనని అంటాడు. అందులో తప్పేముందని శృతి నిలదీస్తుంది. మనం అప్పుగానే తీసుకుందామని...రెస్టారెంట్‌ పెట్టి డబ్బులు సంపాదించిన తర్వాత తిరిగి ఇద్దామని అంటుంది. అయినా కానీ నేను తీసుుకోనని రవి అంటాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరడంతో రవి విసురుగా మేడపైకి వెళ్లిపోతాడు.
బాలు, మీనా సముదాయించే ప్రయత్నం
రవి,శృతి కొట్టుకోవడంతో బాలు, మీనా ఎంటర్‌ అవుతారు. బాలు వెళ్లి రవిని తిట్టి పెళ్లంతో ఎలా మాట్లాడాలో చెబుతాడు, అటు మీనా కూడా శృతితో మాట్లాడుతుంది.రవి వద్దన్నా నువ్వు ఎందుకు పదేపదే మీ ఇంటి డబ్బులు గురించి మాట్లాడుతున్నావని అడుగుతుంది. అతను తన కాళ్లపై తాను నిలబడతానని చెబుతున్నాడు కదా నువ్వు అర్థం చేసుకోమని చెబుతుంది.ఇద్దరిని సముదాయించి భోజనం చేయడానికి తీసుకుని వస్తారు. అప్పుడే అక్కడ మనోజ్‌ రోహిణికి అన్నం తినిపిస్తూ కనిపిస్తాడు.తను టాటూ వేయించుకుంది కదా అందుకే తినిపిస్తున్నానని చెబుతాడు. అప్పుడు మరోసారి అక్కడ డబ్బుల విషయం వస్తుంది.రోహిణి చూడు వాళ్ల ఇంటి నుంచి ఒక్కపైసా తీసుకురాకుండానే మనందరి సొమ్ములు నొక్కేసి వాళ్ల ఆయనకు ఇచ్చిందని బాలు, రవి అంటారు. ఇప్పుడు రవి కూడా శృతికి తినిపిస్తాడని బాలు అనగా....ఛీఛీ దీనికి నేను ఎందుకు తినిపిస్తానని రవి వెళ్లిపోతాడు. వాడు తినిపిస్తే నేనెందుకు తింటానని శృతికూడా వెళ్లిపోతుంది. దీంతో బాలు మంచి ప్లాన్ వేస్తాడు.
అర్థరాత్రి లేచి వంట
రవి,శృతి కోసం చేసిన వంటలన్నీ దాచిపెట్టమని బాలు మీనాకు చెబుతాడు. ఎందుకంటే నేను చెబుతానులే అని అవన్నీ దాచిపెట్టిస్తాడు. ఆకలికి ఆగలేని శృతి, రవి ఇద్దరూ నిద్రరాక తీవ్రంగా ఇబ్బందిపడుతుంటారు. అర్థరాత్రి శృతికి ఆకలివేయడంతో మీనా దగ్గరకు వస్తుంది.మీనాను నిద్రపోతున్నట్లు నటించమని చెప్పిన బాలు..శృతి రాగానే మీనా పడుకుందని చెప్పి వెళ్లిపొమ్మంటాడు. దీంతో శృతి వెళ్లి రవిని అడగ్గా....కిచెన్‌లోకి వెళ్లి టిఫిన్ చేసి పెడతాడు.దీంతో వాళ్లిద్దరూ తినిపించుకుంటూ ఉండటం చూసి బాలు, మీనా చాలా హ్యాపీగా ఫీలవుతారు.
రోహిణి చేతికి చిక్కినట్లే చిక్కిన దొంగ
రోహిణి, విద్య ఇద్దరూ కలిసి హోటల్‌లో భోజనం చేస్తుండగా....మనోజ్‌కు డబ్బులు ఇచ్చి ఎగ్గొట్టి వెళ్లిన బ్రోకర్‌ కూడా అక్కడికే వస్తాడు. వాడిని చూసి గుర్తుపట్టిన రోహిణి చొక్కాపట్టుకుని నిలదీస్తుంది. అతను బెదిరించాలని చూసినా పోలీసులకు ఫోన్ చేస్తామని చెప్పేసరికి పారిపోతాడు. విద్య, రోహిణి ఎంత వెంటబడి పరిగెత్తినా దొరకడు.దీంతో రోహిణి ఇంటికి వచ్చి మనోజ్‌కు ఈవిషయమే చెబుతుంది. చేతికి దొరికినవాడిని ఎలా వదిలిపెట్టావని మనోజ్‌ అడగ్గ..తమరు ఎలా వదిలిపెట్టారో నేను కూడా అలాగే వదిలిపెట్టానని చెబుతుంది.