Gunde Ninda Gudi Gantalu: స్టార్‌మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ ఈరోజు చాలా ఫన్నీగా సాగింది. కళ్లు కనిపించక మనోజ్‌ చేసే తింగరపనులు..అన్నను ఓ ఆట ఆడుకున్న బాలు చివరకు తాను చేసినపని తప్పని మనోజ్‌తోనే చెప్పించి క్షమాపణలు కోరడంతో నర్సును పిలిపించి కట్లు విప్పిస్తాడు బాలు.చివరిలో శృతివాళ్ల అమ్మ వచ్చి మరోసారి బ్లాంక్‌ చెక్‌ ఇవ్వడం,ఆమెకు బాలు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇవ్వడంతో ఈరోజు ఎపిసోడ్‌ ఎంతో రసవత్తరంగా సాగుతుంది.
కళ్లు కనిపించక మనోజ్ తిప్పలు
కళ్లకు గంతలు కట్టుకుని ఇబ్బందిపడుతున్న మనోజ్‌ను బాలు ఓ ఆట ఆడుకుంటాడు. పాలు తాగమని రోహిణి తెచ్చి ఇస్తే..చల్లారిన తర్వాత తాగుతానంటూ వాటిని టీపాయ్‌ మీదపెట్టి మనోజ్‌ నిద్రపోతాడు.అప్పుడే అటుగా వచ్చిన బాలు ఆ పాలు మొత్తం తాగేసి మీగడ మాత్రం మనోజ్‌ మూతికి రాస్తాడు. ఈ విషయం తెలియక నిద్రలేచిన మనోజ్‌ పాలకోసం ఆరాటపడుతుండగా...రోహిణి వచ్చి ఒక్కటిస్తుంది. పాలు తాగడమే కాకుండా అబద్ధాలు కూడా ఆడుతున్నావా అని అంటుంది. ఇంతలో ప్రభావతి అక్కడికి రాగా....మనోజ్‌ ఆమె ముందు ఓవరాక్షన్ చేస్తాడు. నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను కదమ్మా...ఇప్పుడు 24 గంటలు నిన్ను చూడలేకపోయానని బాధపడుతున్నట్లు నటిస్తాడు. నన్ను నీ గుండెల్లో పెట్టుకున్నావ్ కదారా అది చాలంటూ అంటుంది. సరే వెళ్లిపడుకోమని చెప్పి వెళ్లబోతుంది.ఇంతలో రోహిణీ అంటే మీ అమ్మగారిని చూడకుండా ఉండలేకుపోతున్నారు కానీ...నన్ను చూడకపోయినా పర్వాలేదా అని నిలదీస్తుంది. అమ్మ వెళ్లిపోయిందనుకుని మనోజ్‌ నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. మా అమ్మతో చెప్పిందంతా నిజం కాదని..ఇలా అప్పుడప్పుడు నాలుగు మాటలు పడేస్తే..మా అమ్మ ఎప్పుడూ నా పక్కనే ఉంటుందని అలా చెప్పానంటాడు.ఇదంతా విన్న వాళ్ల అమ్మ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ముష్టివాడికి మనోజ్ గౌరవం
మనోజ్‌ను హాల్‌లో కూర్చోబెట్టి లోపలకి వెళ్తూ....నాకోసం ఓ క్లైయింట్‌ వస్తాడని మీరు అతన్ని కూర్చోబెట్టి మాట్లాడుతుండండని చెప్పి రోహిణి వెళ్లిపోతుంది.ఇంతలో ముష్టివాడు ఇంటికి రాగా....వాడే రోహిణి క్లయింట్ అనుకుని మనోజ్ లోపలికి పిలిచి కూర్చోబెడతాడు. వద్దని వారించిన అతనికి మర్యాదలు చేస్తుంటాడు.ఇంతలో హాల్‌లోకి వచ్చిన మీనా ఇదంతా చూసి మనోజ్‌ను నిలదీస్తుంది. కళ్లు కనిపించని మనోజ్‌....తను రోహిణి క్లయింట్ అని చెబుతాడు.దీంతో మీనా అందిరనీ పిలుస్తుంది. ప్రభావతి వచ్చి ముష్టివాడిని వెళ్లగొడుతుంది. రోహిణి కూడా మనోజ్‌ను గట్టిగా తిడుతుంది. నీకు క్లయింట్‌కు, ముష్టివాడికి తేడా తెలియడం లేదా అని నిలదీస్తుంది.
బాలుకు మనోజ్‌ క్షమాపణలు
బాలు నోటితో ఏం అంటే అది జరుగుతుండటంతో మనోజ్‌ దగ్గరకు వచ్చి జాగ్రత్తరా కిందపడతావ్‌ అని అంటాడు.అలా అనగానే జరుగుతుంది.నీకు దణ్ణంరా బాబు నీ నోటితో ఏం అనొద్దని అంటాడు. నన్ను కొంచెం దేవుడి ఫొటో దగ్గరకు తీసుకెళ్తే దణ్ణం పెట్టుకుంటానని చెప్పడంతో బాలు తీసుకెళ్తాడు. తనకు త్వరగా కళ్లు రావాలని కోరుకుంటాడు. నువ్వు ఏం అంటే అది జరుగుతుంది కాబట్టి నాకు కళ్లు రావాలని అనమంటాడు మనోజ్‌.. అయితే నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకుని క్షమించమని వేడుకుంటూ చెంపలు వేసుకుంటే అంటానని బాలు చెబుతాడు. నాకు కళ్లు రావడంతో కోసం నువ్వు ఏం చేయమంటే అది చేస్తానని మనోజ్‌ ఆరాటపడతాడు. దీంతో బాలు చెప్పినట్లే చెప్పి క్షమించమని కోరడంతో బాలు నర్సుకు ఫోన్ చేసి మనోజ్‌ కళ్లకు గట్టిన గంతలు విప్పించడంతో మనోజ్‌ అందరినీ చూడగలుగుతాడు.
మళ్లీ బ్లాంక్‌ చెక్‌ ఇచ్చిన శృతి తల్లి...స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చిన బాలు
శృతివాళ్ల అమ్మ కోపంగా బాలు వాళ్ల ఇంటికి వస్తుంది. ఇదేంటీ తమరు మళ్లీ వచ్చారని మీనా నిలదీస్తుంది. ఇంటికి వచ్చిన వాళ్లతో ఇలాగేనా మాట్లాడేదని ఆమె తిడుతుంది.ఇంతలో ప్రభావతి, సత్యం అక్కడికి వచ్చి రండి కూర్చోండని పిలుస్తారు. తాను తీరిగ్గా కూర్చుని కాఫీలు తాగడానికి రాలేదని....బ్యాగ్‌లో నుంచి మళ్లీ బ్లాంక్ చెక్‌ తీస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు మీకు బ్లాంక్ చెక్కులు ఇచ్చే జబ్బుపోనట్లు ఉందని వెళ్లి డాక్టర్‌కు చూపించుకోమని చెబుతాడు. మీరందరూ కలిసి నా కూతురిని డబ్బుల కోసం హోటల్‌లో వెయిటర్‌గా పనిచేయిస్తున్నారని అందుకే ఈ చెక్‌ తీసుకుని మీ దరిద్రాన్ని క్లియర్ చేసుకోమని అంటుంది.దీంతో సత్యంకు కోపం వచ్చి నేను నా కోడళ్లను ఎవరినీ పని చేయమని చెప్పలేదని అంటుంది. అంతలో రోహిణి కలుగజేసుకుని అవునండీ మా ఇంట్లో ఎవరూ ఎవరినీ పనిచేయమని చెప్పలేదని నాకు ఇంట్రెస్ట్ ఉండటం వల్లే బ్యూటిషన్‌గా పనచేస్తున్నానని....మీనా కూడా పూల డెకరేషన్ చేస్తోందని అంటుంది. దీంతో శృతి తల్లి పూలు అమ్ముకునే వారితో నా కూతురిని పోల్చుకోదలుచుకోలేదని చెప్పడంతో ఈరోజు ఎపిసొడ్ ముగిసిపోతుంది.