Gunde Ninda Gudi Gantalu Today Episode July 08: గుండెనిండా గుడిగంటలు జూలై 8 ఎపిసోడ్ మొత్తం మనోజ్ ఆపరేషన్ చుట్టూ తిరిగింది. బాలు మీనా మరోసారి ఆ కుటుంబానికి అండగా నిలిచారు..ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

గుండెనిండా గుడిగంటలు గడిచిన ఎపిసోడ్ లో...30 లక్షలు విల్లా కోసం తీసుకుని మోసం చేసిన సుభాష్ కనిపించడంతో వెంటబెడతాడు మనోజ్. దార్లో అందర్నీ తోసుకుంటూ వెళ్లి సుభాష్ ని పట్టుకోకుండా.. ఓ చిన్న ట్రక్ కి గుద్దుకుంటాడు. కళ్లలో గాజుపెంకులు గుచ్చుకుంటాయ్..

జూలై 08 ఎపిసోడ్ లో... కథ మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరిగింది. మనోజ్ పరిస్థితి ఏంటో తెలియక అంతా టెన్షన్ పడతారు. నీవల్లే , నీ శాపం వల్లే ఇదంతా జరిగిందని ప్రభావతి బాలుని కొడుతుంది. వాడికి కంటిచూపు తిరిగి రాకపోతే..నీ మొహం జీవితంలో చూడను అనేస్తుంది. డాక్టర్ రావడంతో మా అన్నయ్య కళ్లకు ఎలాంటి ప్రమాదం లేదు కదా అని అడుగుతాడు. అందుకు డాక్టర్లు, "ప్రస్తుతానికి ఏమీ చెప్పలేను..కళ్లలో గుచ్చుకున్న గాజు పెంకులు తొలగించాం..రిపోర్టులు వచ్చిన తర్వాత కంటిచూపు గురించి స్పష్టంగా చెప్పగలం అంటారు. ఆ మాట వినగానే మరింత కంగారుపడతారు సత్యం, ప్రభావతి. నా కళ్లు ఇచ్చుకుని అయినా మనోజ్ కి చూపు తెప్పిస్తా అంటుంది రోహిణి. బతికి ఉన్నవాళ్లు కళ్లు తీసుకోరు అంటుంది శ్రుతి...అంతదూరం ఎందుకు ఆలోచిస్తున్నావ్..ఏమీకాదని ధైర్యం చెబుతుంది.

మనోజ్ అందర్నీ తోసుకుంటూ పరిగెత్తినప్పుడు..నష్టపోయిన వ్యాపారులంతా హాస్పిటల్ కి వచ్చి మనోజ్ గురించి ఎంక్వైరీ చేస్తారు. వాడు మా అన్నయ్య అని బాలు చెప్పడంతో.. మా వ్యాపారాలు నష్టపోయాయి..అయినా వాడిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాం..మాకు 30 వేలు నష్టపరిహారం చెల్లించాలని అంటారు. మీరు నష్టపోయినా మా అన్నయ్యను తీసుకొచ్చి జాయిన్ చేసినందుకు సంతోషం ..మీ కారణంగా సకాలంలో ట్రీట్మెంట్ జరిగిందంటాడు. వెంటనే 30 వేలు ఇస్తాడు బాలు. ఆ తర్వాత నర్స్ ని కలసి ఏం జరిగింది..తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడుగుతారు. ముందు బిల్లు కట్టండి..అప్పుడు మరో ఆపరేషన్ చేస్తాం అంటారు.

బిల్లు ఎంతైందని ఎంక్వైరీ చేస్తే లక్షా 70 వేలు అంటారు. అంత డబ్బు ఎలా తీసుకురావాలి అనుకుంటారు. నావల్ల కాదంటూ రోహిణి చేతులెత్తేస్తుంది. బాలు-మీనా కలసి అందర్నీ అడిగి, అప్పుచేసి డబ్బులు కడతారు. విద్య కంగారుగా వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది.. డబ్బులు గురించి బాధపడుతుంది రోహిణి. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు..బాలు డబ్బులు కట్టేశాడు అంటుంది విద్య. బాలు మీనా తాము దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి కట్టేస్తారు. ఇంతలో ప్రభావతి వచ్చి.. ఏం జరిగిందని అడుగుతుంది..డబ్బులు సర్దుబాటు అయ్యాయా అని అడుగుతుంది..నేను చూసుకుంటాను అత్తయ్యా అని అబద్ధం చెబుతుంది.. బాలు కట్టాడని మాత్రం చెప్పదు. షాక్ అవుతుంది విద్య..నీకు పుట్టగతులు ఉండవే అని ఫైర్ అవుతుంది. అప్పటికి కూడా రోహిణికి బుద్ధి రాదు.

మనోజ్ ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తుంటారు... బాలు ఎమోషనల్ అవుతాడు, నిన్ను ఇకపై మనోజ్ అనే పిలుస్తాను, ఎలాంటి పేర్లు పెట్టను అంటాడు. అన్నయ్యా నిన్ను తీసుకుని తిరుపతికి వెళతాన అంటాడు బాలు. మనోజ్ ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. వాడికి చీకటి అంటే భయం..కళ్లు రావాలి వెలుగు చూడాలి అని దేవుడిని కోరుకుంటాడు సత్యం. మీరు చేసుకున్న పుణ్యం వల్లే మీ పెద్దబ్బాయి క్షేమంగా ఉంటారని ధైర్యం చెబుతుంది మీనా. బాలు కూడా తండ్రిని ఓదార్చుతాడు. కొద్దిసేపటి తర్వాత ఆపరేషన్ అయిందంటూ మనోజ్ ని బయటకు తీసుకొస్తారు.

కొద్దిసేపటి తర్వాత మనోజ్ కి స్పృహ వస్తుంది..నాకు కళ్లు వస్తాయా? నన్ను చూపులేనోడా అని పిలుస్తారా అని బాధపడతాడు. మీకు ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి మీ తమ్ముడు ఎంతగా తపిస్తున్నాడో మీకు తెలియదంటుంది మీనా. నువ్వు మొదటి సారి నా గురించి మంచిగా మాట్లాడావు అంటాడు మనోజ్. మరి మనోజ్ కి చూపు వస్తుందా?