Gunde Ninda Gudi Gantalu: స్టార్‌మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ ఈరోజు ట్విస్టులపై ట్విస్టులతో సాగుతుంది. సత్యం తన తల్లిని ఇంటికి తీసుకురావడంతో అందరూ ఆ మాట వింటారు. వెంటనే మనోజ్ రోహిణికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు.అటు ప్రభావతికి కూడా సత్యం ఫోన్ చేసి రమ్మనడంతో వచ్చేస్తారు. మరోసారి ప్రభావతి రోహిణిపై చేయిచేసుకోగా....వాళ్ల మేనమామ గురించి నాకు ముందే చెప్పిందని మనోజ్‌ అబద్ధం చెబుతాడు. దీంతో ప్రభావతి కొడుకుపై ఫస్ట్‌టైం చేయిచేసుకుంటుంది.భార్యను కాపాడుకోవడం కోసం మనోజ్‌ మరో కట్టుకథ అల్లుతున్నాడని బాలు, మీనా అంటారు. అసలు అబద్ధం ఎందుకు చెప్పావని సత్యం రోహిణిని నిలదీయడంతో మరో కట్టుకథ అల్లుతుంది.
బామ్మమాట బంగారు బాట
ఇంట్లో సమస్యలు చుట్టుముట్టడంతో సత్యం వెళ్లి తన తల్లిని తీసుకుని వస్తాడు. ఆమె మనోజ్‌ను తిట్టి రోహిణికి ఫోన్ చేయిస్తుంది. మనోజ్ పదేపదే ఫోన్ చేయడంతో విద్య తిట్టి రోహిణితో ఫోన్ లిప్ట్‌ చేయిస్తుంది. రోహిణి బెట్టు చేయాలని చూసినా...ఊరు నుంచి మా బామ్మ వచ్చిందని నీతో మాట్లాడాలి రమ్మని పిలుస్తోందని అంటాడు. అయితే నీకు ప్రేమ ఉండి ఫోన్ చేయలేదా అని అడిగితే...నువ్వు చెప్పిన అబద్ధాలకు ప్రేమకూడానా అని మనోజ్ తిడతాడు. అయితే నేను రానని చెప్పగా...నీ ఇష్టం వస్తే రా లేకపోతే లేదని చెప్పి ఫోన్ కట్‌ చేస్తాడు. విద్య రోహిణిని తిట్టి పంపిస్తుంది. అటు సత్యం కూడా ప్రభావతికి ఫోన్ చేసి మా అమ్మ వచ్చిందని చెప్పడంతో ప్రభావతి కూడా ఇంటికి బయలుదేరుతుంది.
అత్తాకోడళ్లు రుసరుస
అత్తాకోడళ్లు ఇద్దరూ ఒకేసారి ఆటోల్లో ఇంటి ముందు దిగుతారు. రోహిణిని చూడగానే ప్రభావతి కోపంతో రగిలిపోతుంది. ఆటోకి ఇవ్వడానికి చిల్లర లేకపోయేసరికి రోహిణి ఇస్తానన్న ప్రభావతి ఊరుకోదు.ఇంకోసారి నా ఎదుట నిలబడాలని చూస్తే చంపేస్తానని హెచ్చరించి ఆటోవాడికి 500రూపాయలు ఇచ్చి లోపలికి వచ్చేస్తుంది. గుమ్మం వద్దే ఆగిన అత్తాకోడళ్లను అక్కడే ఆగమని చెప్పి బామ్మ ప్రభావతికి దిష్టితీయమని చెబుతుంది. ముగ్గురు కొడుకులు, కోడళ్లతో నువ్వు కళకళలాడుతుండటం చూసి అందరూ దిష్టిపెట్టినట్లు ఉన్నారని బామ్మ చెప్పడంతో ప్రభావతి కొంచెం కూల్‌ అవుతుంది. మనోజ్‌ రోహిణిని లోపలికి పిలవడంతో బామ్మ అసలు ఏం జరిగిందని అడుగుతుంది. అంతే ప్రభావతి కోపంతో రగిలిపోతుంది.అసలు దీన్ని మళ్లీ ఇంటికి ఎందుకు రప్పించారని వెళ్లి రోహిణిని కొడుతుంది.
తప్పుపై తనపై వేసుకున్న మనోజ్‌
తల్లి రోహిణిని కొడుతుంటే మనోజ్ అడ్డుపడతాడు..మిగిలిన దెబ్బలు ఏమైనా ఉంటే నన్ను కొట్టమని అంటాడు. ఎందుకంటే రోహిణి వాళ్ల మేనమామ విషయం నాకు ముందే చెప్పిందని చెబుతాడు. ఈ మాటలు విన్న ఇంట్లో అందరూ షాక్ తింటారు. ప్రభావతి కొడుకు చెంపలు పగులగొడుతుంది. చేతగాని చవట దద్దమ్మలా మాట్లాడకు అని తిడుతుంది. ఎప్పుడూ ఎవరో ఒకరి చేతుల్లో మోసపోవడమే నీపని అని తిడుతుంది. మనోజ్ మాటలు వినగానే బాలు, మీనా కల్పించుకుని మరో కట్టుకథ మొదలుపెట్టారా అని అంటారు. మనోజ్‌కు ఏదైనా తెలిస్తే వాళ్ల అమ్మకు చెప్పకుండా అసలు ఉండడని ఇదంతా ఇప్పుడు రోహిణిని కాపాడేందుకు వేస్తున్న ఎత్తులని మీనా అంటుంది. అటు రవి కూడా వాళ్ల అన్నను తిడతాడు. మరి అమ్మ వదినను కొట్టి పంపించినప్పుడు ఎందుకు నిజం చెప్పలేదురా అని నిలదీస్తాడు. అమ్మకు కోపం వస్తుందనే చెప్పలేదని అనగా...ఇప్పుడు మాత్రం ముద్దుపెట్టుకుంటానా అని ప్రభావతి మండిపడుతుంది.
రోహిణి మరో కట్టుకథ
అసలు అబద్ధం ఎందుకు చెప్పావని రోహిణిని సత్యం అడుగుతాడు. నాకు మనోజ్‌ అంటే చాలా ప్రేమ అని అందుకే అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నానని ‌అంటుంది. నిజంగా మేం మలేషియాలోనే ఉండేవాళ్లమని...మానాన్న రోజూ తాగివచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడని చెబుతుంది. మా అమ్మ ఆబాధలు భరించలేక చనిపోయిందని..నేను మలేషియాలోనే బ్యూటీకోర్సు నేర్చుకుని ఇండియా వచ్చేశానని మరో అబద్ధం చెబుతుంది. చిన్నప్పటి ఫ్రెండ్ విద్య ద్వారా ఇక్కడ బ్యూటీపార్లర్‌లో చేరానని చెబుతుంది.