Gunde Ninda Gudi Gantalu October 28 Episode: కొత్తింట్లో బాలు మీనా, శృతి రవి రొమాన్స్, రోహిణికి నో చెప్పిన మనోజ్ - గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 28 ఎపిసోడ్!

1 month ago 2
ARTICLE AD

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 28 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 28th Episod

రూమ్ మనం కట్టించితీరాలని మీనా శపథం చేస్తుంది. బాలు సరే అంటాడు. మరో కారు కొందాం..అందుకు నేను మీ అమ్మకు తిరిగి ఇచ్చిన నగలు అడుగుతాను..వాటిని తాకట్టుపెట్టి కారుకొందాం ..అది రెంట్ కి ఇచ్చి చిట్టీ కట్టి...ఆ చిట్టిని ముందుగానే పాడేసి రూమ్ కడదాం అంటుంది మీనా. ఆ నగలు ఇప్పుడు అడిగితే..బావోదు..నేనే ఏదో ఒకటి చేస్తాను అనేసి వెళ్లిపోతాడు బాలు.

రోహిణి ఫర్నిచర్ షాప్ కి వెళుతుంది. కస్టమర్స్ ఎవరూ లేరేంటని అడుగుతుంది. వీక్ డేస్ కదా అంటాడు. నాకు ఓ రిసార్టు నుంచి ఇన్విటేషన్ వచ్చింది..ఓ రోజు బయటకు వెళ్లి రిలాక్సవుదాం అంటుంది. షాప్ ఎవరికీ అప్పగించి రావడం బిజినెస్ మెన్ లక్షణం కాదంటాడు మనోజ్. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయ్..టెన్షన్ గా ఉంటుంది..అందుకే నేను రిసార్ట్ లో ప్లాన్ చేశాను అంటుంది రోహిణి. అలాంటి ఆఫర్ మళ్లీ ఇవ్వను అనగానే.. సరే అంటాడు మనోజ్. ఇంతలో కాల్ వస్తుంది.. ఓ పది ఫ్లాట్స్ కి ఫర్నిచర్ కావాలని కాల్ వస్తుంది. రేపు వస్తాం డబ్బులిచ్చి ఫర్నిచర్ తీసుకెళ్తాం అంటారు. రేపు బయటకు వెళదాం అనుకున్నాం కదా అని రోహిణి అంటే..ఈ ఆఫర్ వదులుకోలేను అంటాడు మనోజ్. రోహిణి వెళ్లిపోతుంది

ఇంటికి చేరుకున్న బాలు ఏక్కడున్నావ్ అడిగితే అత్తారింట్లో ఉన్నాను అంటుంది. అయితే మీ అత్తారింటి బయటకు రా అంటాడు. మీనా బయటకు వెళుతుంటే ప్రభావతి వద్దంటుంది..ఏవండీ అని మీనా పిలవగానే వెళ్లు వెళ్లు అని భయంగా చెబుతుంది. మీనా బయటకు వచ్చి చూసేసరికి బాలు కార్లో ఇటుకలు ఉంటాయి. ఎందుకివి అని అడిగితే.. ఓ కస్టమర్ కారెక్కాడు..తనకి ఇటుకల బట్టీ ఉందట.. అందుకే డబ్బుల బదులు ఇటుకలు తీసుకున్నాను..ఇకపై అదే పనిచేస్తా అంటాడు. మీనా కూడా...అయితే నేను ఓ సిమెంట్ షాప్ ఓనర్ కి పూలు ఇస్తున్నా..నేను సిమెంట్ బస్తా తీసుకొస్తా అంటుంది. ఇద్దరూ కలసి.. ఇల్లు ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుని.. గృహప్రవేశం చేసినట్టు కలలు కంటూ కాసేపు సరదాగా టైమ్ స్పెండ్ చేస్తారు.

మనోజ్ కి ఫర్నిచర్ కోసం కాల్ చేసిన వ్యక్తి వచ్చి నేనే కాల్ చేశాను అని చెబుతాడు. పది ఫ్లాట్స్ కి ఫర్నిచర్ కావాలని అడిగింది తామే అని పరిచయం చేసుకుంటారు. మనోజ్ తెగ మర్యాదలు చేసేస్తాడు. ఫస్ట్ పెద్ద డీల్ మీదేనండి అని చెబుతాడు. డబ్బులకు బిల్లు ఇవ్వొద్దు అనవసరంగా ఇన్ కమ్ టాక్స్ గొడవ అంటారు. మరి బిల్లు ఇవ్వకుండా ఎలా నాకు సమస్య అవుతుంది కదా అంటాడు మనోజ్. మీక్కూడా టాక్స్ సమస్య ఉండదు అందుకే చెబుతున్నాం అంటారు. మీరు ఇవ్వకపోతే ఈ డీల్ మరొకరి దగ్గరకు తీసుకెళ్తాం అంటారు. సరే అని మనోజ్ బిల్లు లేకుండా ఫర్నిచర్ ఇచ్చేస్తాడు. డబ్బులు లెక్కపెట్టకుండా తీసేసుకుంటాడు. ఎక్కడికి పంపించాలి ఫర్నిచర్ అని అడిగితే.. మేం వెహికల్ తీసుకొచ్చాం తీసుకెళ్లిపోతాం అంటారు. సరే అంటాడు మనోజ్

ఇంటికి వచ్చేసిన శ్రుతిని చూసి..ఏంటి అప్పుడే వచ్చేశావ్ అని అడుగుతాడు రవి. బాగా అలసిపోయాను..నిల్చుని డబ్బింగ్ చెప్పి చెప్పి కాళ్లు లాగేస్తున్నాయ్ పట్టవా అని అడుగుతుంది. డోర్ వేస్తానని రవి అంటే.. అవసరం లేదంటుంది శ్రుతి. కాళ్లు పడతాడు రవి.. ఆ తర్వాత నెయిల్ పాలిష్ పెడతాడు. అది చూసి ప్రభావతి చికాకుపడుతుంది.. దీన్ని ఇలాగే వదిలేస్తే నా కొడుకుని మరీ తక్కువ చేసేస్తుందనుకుంటూ నేరుగా రూమ్ లోకి వెళ్లి ఏంటిది అని అడుగుతుంది....

కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

అరుణాచలంలో కార్తీక శోభ - గిరిప్రదక్షిణ అంటే అలా తిరిగేసి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!  ఆలయం నుంచి  వరుసగా 17వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

18వ ఎనర్జీ పాయింట్ నుంచి 44వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Read Entire Article