గుండె నిండా గుడి గంటలు నవంబర్ 06 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 November 6th Episode

మీనా బంగారం ప్రభావతి దొంగతనం చేసి మనోజ్ కి ఇచ్చింది. మనోజ్ తాకట్టుపెట్టుకుని డబ్బులు తీసుకుంటాడు అనుకుంటే అమ్మేసి మరోసారి బద్ధిచూపించాడు. తీరా బాలు-మీనా వచ్చి బంగారం అడిగేసరికి అవాక్కైంది ప్రభావతి. ఆ ప్లేస్ లో గిల్ట్ నగలు పెట్టేసి అదే బాక్స్ మీనా చేతిలో పెట్టింది ప్రభావతి. ఆ విషయం తెలియని మీనా బాలు గోల్డ్ షాప్ కి వెళ్లి అవమానం ఎదుర్కొంటారు. ఇలాంటి దొంగతనాలు చేసి దొరికిపోయిన తర్వాత మాట మార్చుతున్నారా అని బంగారం షాపు యజమాని ఫైర్ అవుతాడు. బంగారమో కాదో ఇంటికెళ్లి తేల్చుకోవాల్సిందే అని బాలు కోపంగా బయలుదేరుతాడు. మొత్తం మనోజ్ చేశాడని బాలుకి డౌట్ వస్తుంది..అందులో ప్రభావతి హస్తం ఉందని కూడా పసిగట్టేస్తాడు.

సుశీలమ్మ బర్త్ డే సందర్భంగా ఇంట్లో అంతా సంతోషంగా ఉన్నారు..ఇలాంటి టైమ్ లో బంగారం గురించి మాట్లాడితే లేనిపోని గొడవ జరుగుతుంది.. అందుకే అమ్మమ్మ పుట్టినరోజు అయ్యేవరకూ ఆగండి, ఏమీ మాట్లాడకండి అని కంట్రోల్ చేస్తుంది మీనా. ఇంటికివెళ్లిన తర్వాత ఎలాంటి గొడవ చేయకూడదంటూ బాలు దగ్గర మాట తీసుకుంటుంది.

హాల్లో అంతా బెలూన్స్ ఊదుతూ డెకరేషన్ చేస్తుంటారు. బాలు కోపంగా లోపలకు వెళ్లి బెలూన్స్ ఊదడం స్టార్ట్ చేస్తాడు. ఆ బెలూన్స్ లో గాలి ఎక్కువై పేలిపోతుంటాయ్.. ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నాడని సత్యం అడుగుతాడు. కడుపులో మంట అగ్నిపర్వతంలా మండుతోందని మీనా చెబుతుంది. మనోజ్-ప్రభావతిలో టెన్షన్ పెరుగుతుంటుంది. అదే సమయానికి సుశీలమ్మ వస్తోందని కాల్ రావడంతో తీసుకొచ్చేందుకు వెళతాడు బాలు. ఎప్పుడూ నానమ్మను చూడగానే ఎగిరిగంతేసే బాలు.. ఈసారి అందుకు భిన్నంగా మౌనంగా ఉండిపోతాడు. లోలోపలే బాధను దాచుకుని బయటకు బాగానే మాట్లాడతాడు. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావని సుశీలమ్మ అడిగినా సమాధానం చెప్పడు.

మరోవైపు అమ్మమ్మ వస్తోందంటూ హారతి ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేస్తుంది మీనా. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన ప్రభావతి..మా అత్తగారికి సేవలు చేసి నువ్వు గొప్పదానివి అయిపోదాం అనుకుంటున్నావా.. ఆ హారతి రోహిణి, శ్రుతికి ఇవ్వు వాళ్లిస్తారు అంటుంది. అలా మీనా చేతిలో హారతి పళ్లెం రోహిణి, శ్రుతి చేతికి వెళుతుంది. అప్పుడే ఎంట్రీ ఇస్తుంది సుశీలమ్మ. రోహిణి, శ్రుతి హారతి ఇవ్వండమ్మా అంటుంది ప్రభావతి. మీనా ఎక్కడుందని చూస్తుంటుంది సుశీలమ్మ. హారతి... రోహిణి ఇస్తుందిలే అతమ్మా అంటుంది ప్రభావతి. ఆ హారతి మీనానే సిద్ధం చేసి ఉంటుంది షీలా డార్లింగ్..మధ్యలోనే పళ్లెం ఎత్తేశారంటూ సెటైర్ వేస్తాడు బాలు.

మొత్తానికి సుశీలమ్మ బర్త్ డే పూర్తయ్యేవరకూ బాలుని ఏమీ మాట్లాడొద్దని, బంగారం గురించి ప్రశ్నించవద్దని మీనా చెప్పింది..మరి మీనాకు ఇచ్చిన మాట ప్రకారం బాలు బయటపడకుండా ఉంటాడా? ఈలోగా బాలు సెటైర్స్ తట్టుకుని ప్రభావతి నిలవగలదా? మనోజ్ గురించి గొప్పగా చెప్పిన రోహిణి..బంగారం మింగేసిన సంగతి తెలుసుకుంటే ఎలా రియాక్టవుతుంది? ప్రభావతికి ఇప్పటికైనా బుద్ధి వస్తుందా?