Gunde Ninda Gudi Gantalu November 11th Episode: షీలా డార్లింగ్ బర్త్ డే వేడుకల్లో కనిపించని బాలు, బంగారం లెక్క తేల్చేసిన శ్రుతి తల్లి - గుండెనిండా గుడిగంటలు నవంబర్ 11 ఎపిసోడ్!

3 weeks ago 2
ARTICLE AD

గుండె నిండా గుడి గంటలు నవంబర్ 11 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 November 11th Episode

ఇంకా బాలు రాలేదని సుశీలమ్మ..మీనాను అడుగుతుంది. ఇంతలో ప్రభావతి వచ్చి సెటైర్స్ వేస్తుంది. బాలుని ఏమైనా అన్నావా అని ప్రభావతిని నిలదీస్తుంది..నాకేం అవసరం అని రివర్సవుతుంది. నోటికొచ్చినమాట్లాడుతుంటే.. బాలుని ఎప్పుడైనా తల్లిలా చూస్తే వాడు కూడా నీతో కొడుకులా ఉండేవాడు అని సుశీలమ్మ గట్టిగా క్లాస్ వేస్తుంది. ఇంతలో రవి, శ్రుతి వస్తారు. మీకో సర్ ప్రైజ్ అంటూ మౌనికను పిలుస్తారు. ఇంట్లో ఫంక్షన్ అని నాకు తెలియదు అంటుంది మౌనిక. ఏం చెప్పలేదా అని ప్రభావతిని క్వశ్చన్ చేస్తాడు సత్యం. దీపావళికి పిలిస్తే రాలేదు..అందుకే చెప్పలేదు అంటుంది ప్రభావతి. అంతా కలసి క్లాస్ వేస్తారు. పోనీలే వచ్చావ్ సంతోషం అంటారు. బామ్మపై ప్రేమతో వచ్చానంటుంది.  ఆ తర్వాత మీనాను మౌనికను తీసుకెళ్లి నువ్వు వస్తావని అనుకోలేదు, మీ ఆయన పంపిస్తారని అనుకోలేదు అంటుంది మీనా. ఇప్పుడు కూడా పంపించలేదు.. మా అత్తయ్య పంపించారు.. ఆవిడ చూసుకుంటారులే అంటుంది మౌనిక.

సుశీలమ్మను తీసుకెళ్లి రోహిణి మేకప్ వేస్తుంది. మేకప్ వేస్తున్నంత సేపూ రోహిణిని క్వశ్చన్స్ వేస్తుంటుంది సుశీలమ్మ. మీ అమ్మ ఎప్పుడు చనిపోయింది? మీ నాన్న ఎందుకు వదిలేశారు? మీ మావయ్య ఏమయ్యాడు? ఎప్పుడూ రాలేదు? నేను నా మనవలు రవి, బాలు అత్తింటివారిని చూశాను..మీ ఇంటి వాళ్లను చూడలేదు అంటుంది. ఈవిడకు మేకప్ వేసేందుకు తీసుకొచ్చి అడ్డంగా బుక్కయ్యా అనుకుంటుంది రోహిణి. నోరు మూయండి మీకు లిఫ్టిక్ వేస్తానంటూ మాటలు ఆపేస్తుంది. మేకప్ వేసుకున్న సుశీలమ్మను చూసి అంతా అవాక్కవుతారు. ఇంత అందంగా ఉన్నావ్ గ్రానీ ..మోడ్రన్ డ్రెస్ కూడా వేసుకో అంటుంది శ్రుతి. మేకప్ వేశాక చాలా బావున్నారు అంటుంది రోహిణి.. మేకప్ లేకపోయినా అమ్మమ్మగారు చాలా అందంగా ఉంటారు..నవ్వు ముఖమే ఆవిడ అందానికి కారణం అంటుంది మీనా. ఆ తర్వాత పండితుడిని పిలిపించి ఆశీర్వచనం చేయిస్తాడు కొడుకు సత్యం..

జంటలంతా ఒక్కొక్కరుగా సుశీలమ్మ దగ్గర ఆశీర్వచనం తీసుకుంటారు. బాలు వచ్చేవరకూ ఎదురుచూస్తే నానమ్మ ఆశీశ్సులు నీకు దక్కవ్ అన సెటైర్ వేస్తాడు మనోజ్. సెల్ఫీలు, ఫొటోలతో సందడి చేస్తారు.

మీనాన్న ఏమీ ఇవ్వనంటూనే ఏదో ప్లాన్ చేశారు..మీనాన్న నాతో చెప్పకుండా మంచి బహుమతి ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో.. మీ నానమ్మకి పూజలు, పునస్కారాలు ఇష్టం..అందుకే ఆ రూట్లో ఏదో ప్లాన్ చేసినట్టున్నారు..ఆవిడ ఇద్దాం అనుకున్న పెద్ద బహుమతి మీనాన్నకి ఇస్తే నాకు ఇచ్చినట్టే అని మనోజ్ తో చెబుతుంది ప్రభావతి.

మీనా వంట చేస్తుంటే..సుశీలమ్మ వెళ్లి మీనా వెళ్లి రెడీ అయి రా..వంట ఎవరైనా చేస్తారులే అంటుంది. బాలు నన్ను చూడగానే సందడిగా ఉండేవాడు.. వాడెక్కడికి వెళ్లాడు అని అడుగుతుంది.  ఏం జరిగింది? ఎందుకు బయటకు వెళ్లాడని అడుగుతుంది?.. ఇంట్లో ఉంటే బంగారం గురించి మాట్లాడాల్సి వస్తుందని వెళ్లిపోయారు అమ్మమ్మ..ఆ విషయం మీకెలా చెప్పాలని అనుకుంటుంది

Read Entire Article