Gunde Ninda Gudi Gantalu January 5 Episode: చింటూ బర్త్‌డేలో రోహిణి గుట్టు రట్టు , బాలు మీనా షాక్! - గుండెనిండా గుడిగంటలు జనవరి 5 ఎపిసోడ్!

3 months ago 9
ARTICLE AD

గుండె నిండా గుడి గంటలు జనవరి 3 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2026  january  3 Episode

కొడుకు చింటూ బర్త్ డే సెలబ్రేట్ చేసేందుకు అత్తారింట్లో అబద్ధాలు చెప్పి వచ్చింది రోహిణి. చింటూకోసం బట్టలు తీసుకొచ్చింది , కేక్ ఆర్డర్ చేసింది, మొత్తం డెకరేట్ చేసింది. చుట్టుపక్కలవారంతా వస్తారు..చింటూ తన ఫ్రెండ్స్ అందర్నీ పిలుచుకుంటాడు. ఇక సలెబ్రేషన్స్ జరగడమే లేట్ అనే టైమ్ లో బాలు మీనా ఎంట్రీ ఇస్తారు. వాళ్లను చూసి షాక్ అయిన రోహిణి..ఇప్పుడే రావాలా అని విసుక్కుంటూ వంటగదిలో దాక్కుని ఉండిపోతుంది. చింటూ వాళ్లను లోపలకు రమ్మంటాడు..వాళ్లకు పని ఉందేమో అని ఇన్ డైరెక్ట్ గా కవర్ చేస్తుంది రోహిణి తల్లి. కానీ పనేంలేదు.. చింటూకోసమే వచ్చాం ...డ్రెస్ తీసుకొచ్చాం అని ఇస్తారు. కేక్ కట్ చేసేవరకూ ఉండి వెళదాం అని ఫిక్సవుతారు. రోహిణ తలపట్టుకుని కూర్చుండిపోతుంది..ఇప్పుడు నా కొడుకుకోసం వీళ్లకు ఎదురుపడాలా? నా కాపురం కోసం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలా? అని బాధపడుతుంది.

బాలు మీనా లోపలకు వెళతారు. చింటూతో కేక్ కట్ చేయించేందుకు అన్నీ సిద్ధం చేస్తారు. అమ్మ ఏది అని అడుగుతాడు... ఏంటి వీళ్ల అమ్మ వచ్చిందా అని మీనా అడుగుతుంది. నిజం ఎక్కడ బయటపడుతుందో అని రోహిణి కంగారుపడుతుంది. రోహిణి తల్లి కవర్ చేస్తుంది. అమ్మ ఉంటే బావుండేదని వాడికి అనిపిస్తోందని చెప్పేస్తుంది. ఆ తర్వాత రోహిణి లేకుండానే చింటూ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు బాలు మీనా.. కానీ ఆ బాబుమొహంలో తల్లిలేని లోటు స్పష్టంగా తెలిసిపోతుంది. మీ ఆరోగ్యం బాలేదు..చుట్టూ ఇన్ని సమస్యలు పెట్టుకుని చింటూని ఎలా చూసుకుంటారని బాలు అడుగుతాడు. అవును బాబూ.. రేపు నాకు ఏదైనా అయితే వీడిని ఎవరు చూస్తారని బాధపడుతుంది. దూరం నుంచి ఇదంతా చూస్తూ రోహిణి కన్నీళ్లుపెట్టుకుంటుంది

సెలబ్రేషన్స్ పూర్తైన తర్వాత.. రోహిణి తల్లితో మాట్లాడుతారు మీనా బాలు. అసలేం జరిగింది? చింటూ తల్లి ఏమైంది? వాళ్ల అత్త ఎందుకు వదిలేసి వెళ్లిపోయింది? మీరెందుకు బాధలుపడుతున్నారు వాడితో అని వరుస ప్రశ్నలు వేస్తారు బాలు మీనా. ఇక వీళ్లకు నిజం చెప్పడమే మంచిది అనుకున్న చింటూ అమ్మమ్మ...రోహిణి పేరు చెప్పదు కానీ జరిగినదంతా చెబుతుంది. అంతా విని బాలు మీనా షాక్ అవుతారు. అప్పు చేసి మీరు.. తప్పు చేసి తల్లి..ఏ తప్పూ చేయకపోయినా శిక్ష అనుభవించేది మాత్రం చింటూనా అని నిలదీస్తాడు బాలు. అప్పుడున్న పరిస్థితుల్లో నాకు మరో దారిలేక నా కూతుర్ని ఒప్పించి ఆ పెళ్లి చేశానని ఏడుస్తూ చెబుతుంది. మీ అమ్మాయితో నేనే మాట్లాడుతాను..ఓసారి నంబర్ ఇవ్వండమ్మా అని అడుగుతాడు బాలు. ఇదంతా వింటూ రోహిణి టెన్షన్ పడుతుంది. నంబర్ లేదని చెప్పలేదు, ఇస్తే రోహిణి గుట్టు బయటపడుతుంది, ఏం చేయాలో అర్థంకాక.. నేను మాట్లాడుతానులే బాబూ అని కవర్ చేస్తుంది. కానీ బాలు-మీనాకు ఏదో అనుమానం వస్తుంది. అక్కడ ఇంట్లోనే రోహిణి ఉన్నట్టు చూస్తే అప్పుడు ఓ క్లారిటీ వచ్చే ఛాన్సుంది... వచ్చే వారం మొత్తం రోహిణి చుట్టూనే తిరిగేలా ఉంది...

Read Entire Article