Gunde Ninda Gudi Gantalu January 28 Episode: కాలుజారిన ప్రభావతికి, మీనాపై నిందలు.. శ్రుతి, బాలుల రియాక్షన్ అదుర్స్ - గుండెనిండా గుడిగంటలు జనవరి 28 ఎపిసోడ్!

2 months ago 9
ARTICLE AD

గుండె నిండా గుడి గంటలు జనవరి 28 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2026  january  28 Episode
మీరు చేసిన పనికి చాలా భయపడ్డా అంటాడు మనోజ్. ఇంత అర్థరాత్రి మీరు రచ్చ చేస్తుంటే బాలు, రవి ఎక్కడ అంటుంది ప్రభావతి. ఇద్దరూ లేరు అంటారు మీనా, శ్రుతి. నిన్ను తిట్టానని కక్షగట్టి శ్రుతితో ఇలా చేయించావ్ కదా అని మీనాపై ఫైర్ అవుతుంది ప్రభావతి. ఇది నా ప్లాన్ ఆంటీ మీనాను ఎందుకు అంటారు అని క్లారిటీ ఇస్తుంది శ్రుతి. ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దంటూ కోపంగా వెళ్లిపోతుంది ప్రభావతి. ఏం జరిగినా నన్నే అంటారని నీకు తెలుసుకదా మీనా అంటే సారీ అంటూ నవ్వించేస్తుంది శ్రుతి

మీ కళ్లు బాగా అలసిపోయినట్టున్నాయ్ అంటుంది మీనా. రాత్రంతా నిద్రలేదు..కంటిన్యూగా కారు డ్రైవ్ చేస్తూనే ఉన్నా అంటాడు బాలు. ఇలా రాత్రి పగలు తేడా లేకుండా తిరిగితే మీ ఆరోగ్యం ఏమవుతుందని బాధపడుతుంది మీనా. మళ్లీ ఇలా లాంగ్ డ్రైవ్ లు వద్దని చెబుతుంది. మరి మనం రూమ్ ఎలా కట్టుకుంటాం అంటాడు బాలు.

రవికి టీ షర్ట్ తీసుకొస్తుంది శ్రుతి. పాత టీషర్టునే బ్యాగ్ లో పెట్టి ఇస్తున్నావ్ అంటాడు. అదేంటి అలా అంటావ్ అనగానే.. నా దగ్గర సేమ్ ఉంది అందుకే అలా అన్నాను అంటాడు రవి. నీకు గిఫ్ట్ తీసుకొస్తే ఇలా మాట్లాడుతావా అని కోపంగా వెళ్లిపోతుంది శ్రుతి. కోపంగా బయటకు వెళుతుంది.. అప్పుడే బాలుకోసం నూనె తీసుకెళుతుండగా డ్యాష్ ఇస్తుంది. ఆ నూనె కిందపడిపోతుంది. అయ్యో సారీ మీనా నేను క్లీన్ చేస్తానంటే.. వద్దులే నేనే క్లీన్ చేస్తాను అంటుంది మీనా. సరే అని చెప్పి రూమ్ కి వెళ్లిపోతుంది. హమ్మయ్య వచ్చావా..కోపం తగ్గిందా అంటాడు రవి. కోపంగానే వెళ్లాను నూనె కిందపడేసి వెనక్కు వచ్చేసా అంటుంది శ్రుతి

మీనా వచ్చి కిందపడిన నూనె తుడిచేలోగా ప్రభావతి వచ్చి కాలుజారిపడుతుంది. ఇది నన్ను మర్డర్ చేసేందుకు ప్లాన్ చేసిందంటూ నోటికొచ్చినట్టు తిడుతుంది ప్రభావతి. నా నడుం విరిగి మంచాన పడితే ఏమయ్యేది అంటుంది ప్రభావతి. పెద్ద కోడలు గంజినీళ్లు పోయదు, చిన్నకోడలు అసహ్యించుకుని దగ్గరకు రాదు.. ఇన్నాళ్లు తిట్టినందుకు మీనా పట్టించుకోదు... డబ్బులు సంపాదించనందుకు మనోజ్ గాడు పట్టించుకోడు, ఈ రవి సంపాదన తక్కువ కాబట్టి వాడు ఏం చేయలేడు...నన్ను నువ్వు సరిగా చూడలేదు కాబట్టి నేనూ నిన్ను చూడను ...అందుకే ఆరోగ్యం బావున్నప్పుడే అత్తలు నోరు అదుపులో పెట్టుకోవాలి అంటాడు బాలు.

ఇంట్లో సగం సమస్యలకు మీనానే కారణం అంటాడు మనోజ్. దెబ్బ ఎక్కడ తగిలింది అత్తయ్యా అంటూ సేవలు చేస్తుంది రోహిణి. ఇదంతా మీనా కుట్రే అని మరింత ఎగదోస్తుంది రోహిణి...మీనా ఇంతకుముందులా లేదు, మారిపోయింది, మాటకు మాట జవాబిస్తోందంటూ మరింత రెచ్చగొడుతుంది. నేను మంచాన పడితే దాని ఇష్టం వచ్చినట్టు ఉండాలి అనుకుంటోంది అంటుంది. నన్ను అది చంపేస్తుంది అంటుంది ప్రభావతి. మీరు కథలు బాగానే అల్లుతున్నారే అంటూ శ్రుతి వచ్చి కోపంగా రిప్లై ఇస్తుంది..ఆయిల్ పడ్డానికి కారణం నేను, అది నేను చెప్పిన తర్వాత కూడా మీనాను అంటున్నారెందుకు అంటుంది. నువ్వెందుకు వాయిస్ రెయిజ్ చేస్తున్నావని రోహిణి అంటే..మీరెందుకు ఈవిడకు భజన చేస్తున్నారని అంటుంది. నువ్వెందుకు ఆ పూలమ్ముకునేదానికి సపోర్ట్ చేస్తున్నావని అంటుంది ప్రభావతి. మీనాను తిట్టేందుకు ఏం సాకు దొరుకుతుందా అని చూస్తుంటారు..దొరక్కపోతే క్రియేట్ చేసుకుంటారు..మీనా ఆయిల్ పడేసి ఉంటుంది... మీరు కళ్లెక్కడ పెట్టుకుని వచ్చారంటుంది. ఈసారి మీనా జోలికి వచ్చారంటే బావోదు అంటుంది. ఇద్దరూ కలసే ప్లాన్ చేస్తున్నట్టున్నారని రెచ్చగొడుతుంది రోహిణి.

మీనా తన స్నేహితులకు కాల్ చేసి ప్రభావతి వైద్యం గురించి మాట్లాడుతుంది..మంచి పని అయింది వదిలెయ్ అంటారు. నాటు వైద్యం చేయించేందుకు సిద్ధం అవుతుంది మీనా. ఇంతలో బాలు వచ్చి..నీళ్లలో పడిన తేలుని తీసేందుకు స్వామీజీ ట్రై చేస్తాడు..కానీ ఆ తేలు ప్రతిసారీ ఆయన్ను కుట్టేది..నీ తీరు కూడా అలానే ఉంది అంటాడు బాలు. నిన్ను ఆమె తప్పుపడుతున్నా..నువ్వు మంచి చేయాలని చూస్తున్నావు అంటాడు. రోహిణి వచ్చి.. ఎలా ఉంది అత్తయ్యా అంటుంది. ఇన్నాళ్లూ నాకు ఎదురుచెప్పేవాడు బాలుగాడే... ఇప్పుడు శ్రుతి కూడా ఎదిరించి మాట్లాడుతోంది అంటుంది. దీనికి పరిష్కారం చూపించాల్సిందే అంటుంది ప్రభావతి. శ్రుతి తల్లికి కంప్లైంట్ ఇస్తుంది..ఇదే అవకాశంగా తీసుకని మరింత గొడవలు పెంచేందుకు సిద్ధమవుతుంది శ్రుతి తల్లి

Read Entire Article