Gunde Ninda Gudi Gantalu January 14 Episode: మీనా-బాలు మధ్య గొడవపెట్టేసిన ప్రభావతి, సుమతితో శ్రుతి సీక్రెట్ డీల్ - గుండెనిండా గుడిగంటలు జనవరి 14 ఎపిసోడ్!

3 months ago 6
ARTICLE AD

గుండె నిండా గుడి గంటలు జనవరి  14 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2026  january  14 Episode

డబ్బులు వసూలుచేసుకునేందుకు ఓ ఇంటికి వెళ్లిన గుణ..ఇప్పటికిప్పుడు అప్పు తీర్చాల్సిందే అని పట్టుబడతాడు. ఏడాది పాటు వడ్డీ కడితే చాలు అన్నావుకదా అని ఆ వ్యక్తి అడిగితే..ఇప్పుడే డబ్బులు కావాలి అంటాడు. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పినా నువ్వు నా అప్పు తీర్చేవరకూ నీ ఇంట్లోనే ఉంటాను..ఇక్కడే తింటాను అంటాడు. బాలు క్యాబ్ లో వచ్చిన ఆ వ్యక్తి కార్లో బ్యాగ్ మర్చిపోతాడు. అది చూసి ఇచ్చేందుకు వచ్చిన బాలు..గుణ, శివను చూస్తాడు. గట్టిగా ఇచ్చిపడేస్తాడు. నేను నీ ఇంటికి వచ్చానా అని రివర్సవుతాడు. మన అవసరాలే వీళ్లకు అవకాశం, మీరు అమాయకంగా ఉంటే వీళ్లు మనదగ్గర డబ్బులు దోచుకుంటూనే ఉంటారు..వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి అంటాడు బాలు. నువ్వు పోలీసులకు ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు అంటాడు. చెప్పుకుంటే చెప్పుకో..పోలీసులు వస్తే నేను మంచినీళ్లు తాగేందుకు వచ్చానని చెప్తా అంటాడు గుణ. నువ్వు ఇలాంటివాడివి అనే వీడియో తీశానంటూ...గుణ బెదిరించిన వీడియో చూపిస్తాడు. చేసేది లేక నోర్మూసుకుని వెళ్లిపోతాడు గుణ. పోలీసులకు కాల్ చేయండి అని బాలు గట్టిగా చెబుతాడు..ఆ వ్యక్తి భార్య కూడా పోలీసులకు కాల్ చేయండి అంటుంది. నేను మిమ్మల్ని బెదిరించడానికి రాలేదు, డబ్బులు తీసుకెళ్లేందుకు వచ్చాను... వచ్చే నెల అసలు, వడ్డీ కలపి ఇచ్చేయండి అని టార్గెట్ పెడతాడు. ఓ పెన్ను పేపర్ తెప్పించి అదంతా రాయించి ...గుణతో సంతకం పెట్టించి మరీ పంపిస్తాడు.

సుమతికి కాల్ చేసి బయటకు రమ్మంటుంది శ్రుతి. నువ్వేంటి ఇక్కడ అని అడిగితే..నేను నువ్వు పనిచేసేదగ్గరకు రాకూడదా? నువ్వు నిజంగా జాబ్ చేస్తున్నావా లేదా అని తెలుసుకునేందుకు వచ్చాను అంటుంది. ట్రీట్ ఎప్పుడిస్తావ్ అని అడిగితే ..జీతం రాగానే అంటుంది సుమతి. నువ్వేం ఇవ్వాల్సిన అవసరం లేదులే..అంటూ నీకోసం వాచ్ గిఫ్ట్ అంటూ ఇస్తుంది. సుమతి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. రవి రాలేదా అని అడిగితే.. నేను ఒక్కదాన్నే ఇస్తే తీసుకోవా అంటుంది. సుమతి..నీతో ఓ విషయం గురించి మాట్లాడాలి..మరో ఆరునెలల్లో పర్మినెంట్ అయిపోతుంది కదా జాబ్..ఇక్కడకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలతో వస్తుంటారా అని అడుగుతుంది. నేను ఇలాంటి హాస్పిటల్ కి ఫస్ట్ టైమ్ వస్తున్నా అంటుంది. నువ్వు కూడా త్వరలో వస్తావులే అంటుంది సుమతి. నువ్వు పిల్లల్ని కనాలికదా అంటే..అమ్మో నాకు పిల్లలు కావాలి కానీ పెయిన్ వద్దు అంటుంది శ్రుతి. సరోగసి ద్వారా కనేందుకు ట్రై చేస్తాను..అందుకు ప్రాసెస్ ఏంటో కనుక్కో అని చెబుతుంది శ్రుతి

ఇంట్లో శివ బర్త్ డే సందర్భంగా గుడిలో ప్రసాదం పంచాలి అనుకుంటారు. మీనా వచ్చి హ్యాపీ బర్త్ డే అని చెబుతుంది. గుడికి వెళదాం.. అల్లుడి గారిని కూడా రమ్మను అంటుంది. ఆయన గుడికి రావడం నాకు ఇష్టం లేదు అనేస్తాడు శివ.

రెండో కారు రాజేష్ కి ఇచ్చాం కదా..డబ్బులు ఇచ్చాడంటూ మీనాకు తీసుకొచ్చి ఇస్తాడు. ఈ రోజు శివ బర్త్ డే గుడికి వెళదాం అంటుంది. నేను రాను..నువ్వు కూడా వెళ్లొద్దు, భర్తను అవమానించే ఇంటికి నువ్వు కూడా వెళ్లకూడదు అంటాడు.  కానీ ఆ తర్వాత శ్రుతివచ్చి...నీ పుట్టింటివాళ్లని బాధపెడతావా అని గట్టిగా చెప్పి శివ బర్త్ డే కి పంపిస్తుంది... ఆ విషయం బాలుకి చెప్పేస్తుంది ప్రభావతి.

Happy Bhogi 2026: భోగి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో చెప్పండి!

Makar Sankranti 2026 Wishes: మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ శ్లోకాల ద్వారా తెలియజేయండి!

Read Entire Article