గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 24 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 December 24 Episode

తెలిసో తెలియకో మనింట్లో అందరూ వచ్చారు..బాలు మీనా కూడా వచ్చి ఉంటే బావుండేది అంటుంది శ్రుతి. అవును అనగానే...ఫోన్ రింగవుతుంది. అరేయ్ మేం పోటీలో పాల్గొనేందుకు వచ్చాం మీరెక్కడున్నారు అంటాడు బాలు. మీరెక్కడ అంటే ఎంట్రన్స్ లో అంటాడు. లోపలకు రండి కనిపిస్తాం అంటారు రవి శ్రుతి. బాలు మీనాను చూసి సంతోషిస్తారు. మనోజ్ , అమ్మావాళ్లు కూడా వచ్చి ఉంటే బావుండేది అంటాడుబాలు. లోపలకు వెళ్లు అన్నయ్యా నీకే క్లారిటీ వస్తుంది అంటాడు రవి.

లోపలకు వెళ్లిన బాలు మీనా...లక్షావతి వచ్చేసింది అన్నమాట అనగానే...లక్షలు మింగినోడు కూడా వచ్చాడు అంటుంది మీనా. కామాక్షి అత్త, లక్షావతి, లక్షలు మింగినోడు ఈ పోటీకి బాగానే ఉన్నారు అంటాడు బాలు. ఈ పోటీకోసం 25వేలు ఖర్చు చేశాం అంటుంది కామాక్షి. ఆ డబ్బులు బ్యాంకులో వేసుకుంటే వడ్డీ అయినా వచ్చేది కదా అంటాడు. గుడికి వెళతాను అన్నావ్ కదా అని సెటైర్ వేస్తాడు. మీరు కూడా పోటీకి వచ్చారా అని సత్యం అడుగుతాడు. అవును నాన్నా...మేం వద్దాం అని రాత్రి డిసైడ్ అయ్యాం ఉదయాన్నే చెబుదాం అనుకుంటే మీరెవ్వరూ లేరు..అందరూ అబద్ధాలు చెప్పి వచ్చారని కడిగేస్తాడు మనోజ్. మీనా కంట్రోల్ చేస్తున్నా బాలు మాత్రం తగ్గేదే లే అంటూ సెటైర్స్ వేస్తూనే ఉంటాడు.

నువ్వ పార్టిసిపేట్ చేయడానికే వచ్చావా అని మనోజ్ అంటే..మెదడు మోకాలిలో ఉన్న నువ్వే వచ్చినప్పుడు నేను రాకూడదా అంటాడు. నిమ్మకాయ రంగులు మార్చి భయపడిన నువ్వుకూడా నా గురించి మాట్లాడుతావా అని ప్రభావతికి సెటైర్ వేస్తాడు. ఇంతలో శ్రుతి వచ్చి ఇప్పటివరకూ ప్రశాంతంగా బోరింగ్ గా అనిపించింది..ఇప్పుడు మీరంతా రావడం సంతోషంగా ఉంది అంటుంది. మనవాళ్లపై మనమే సెటైర్స్ వేసుకోకూడదు అంటాడు రవి

పోటీ ప్రారంభమవుతుంది..
5 రౌండ్లు పోటీలు.. వివాహబంధానికి సంబంధించిన ప్రశ్నలతో పాటూ ఆటలు కూడా ఆడిస్తారు.. మీ మధ్య అనుబంధాన్ని చూసి మా జడ్జిలు విజేతలను సెలెక్ట్ చేస్తారని చెబుతుంది యాంకర్. ఆ తర్వాత అక్కడకు వచ్చిన కపుల్స్ అందర్నీ పరిచయం చేసుకోమని మైక్ ఇస్తారు..

మనోజ్ దగ్గరకు వచ్చి..మీరేం చేస్తుంటారని అడిగితే ( పార్కుకి వెళ్లి నిద్రపోతుంటాడు అని బాలు సెటైర్ వేస్తాడు)...నేను మనోజ్ బిజినెస్ మ్యాన్ అంటాడు. వాడిని నోరుమూసుకోమని చెప్పండి అంటుంది ప్రభావతి. బిగ్ షోరూం ఉందని మనోజ్ చెబుతాడు..సొంతంగా పార్లర్ నడుపుతున్నా అంటుంది రోహిణి. రవి-శ్రుతిని పరిచయం చేసుకుంటారు. నేను శ్రుతి డబ్బింగ్ ఆర్టిస్ట్ అనగానే.. ఏడుపుగొట్టు సీరియల్స్ కి వాయిస్ ఇస్తుంటుంది అంటాడు. శ్రతి నవ్వేస్తుంది. ఆ తర్వాత కామాక్షి దగ్గరకు వెళ్లి మీరేం చేస్తారని అడుగుతాడు..వ్యాపారం చేస్తున్నాని అంటుంది. చిట్టీల వ్యాపారం అని సెటైర్ వేస్తారంతా. మీరేం చేస్తారని ప్రభావతిని అడిగితే భరటనాట్యం స్కూల్ నడుపుతున్నా వందమంది స్టూడెంట్స్ ఉంటారని ఠక్కున అబద్ధం చెప్పేస్తుంది. నేను ఆర్టీసిలో డ్రైవర్ గా పనిచేసి రిటైర్ అయ్యా అంటుంది.

ఎవర్నీ వదిలిపెట్టకుండా వెంటపడుతున్న మీగురించి చెప్పండి అంటుంది యాంకర్. మైక్ తీసుకున్న బాలు.. అందరకీ నమస్కారం నేనొక కార్ డ్రైవర్ ని.. నా పేరు మీనా..పూల వ్యాపారం చేస్తుంటా అంటుంది మీనా. పరువంతా పోయిందని విసుక్కుంటాడు బాలు.. మన గురించి చెప్పినప్పుడు ఎవరూ చప్పట్లు కొట్టలేదని బాలు బాధపడతాడు..మనం తప్పుచేయలేదు ఎవరు ఏమనుకుంటే మనకెందుకు ఆటపై దృష్టి పెడదాం అంటుంది మీనా..