Gujarat Jains join hands buy 186 luxury cars save Rs 21 crore: తెలివితేటలు ఉండాలి కానీ ఖర్చులోనే డబ్బులు మిగుల్చుకోవచ్చు. ఈ విషయాన్ని గుజరాత్ జైన్ సముదాయం నిరూపించింది. తమ బలమైన సంబంధాలు , వ్యాపార తెలివితేటలు ఉపయోగించి పెద్ద మొత్తంలో ఆదా చేసుకున్నారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JITO) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 186 లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. ఈ డీల్‌లో మొత్తం రూ. 149.54 కోట్ల విలువైన కార్లపై రూ. 21.22 కోట్ల డిస్కౌంట్ పొందారు. కార్ల ధరలు ₹60 లక్షల నుంచి ₹1.34 కోట్ల వరకు ఉన్నాయి. ఈ కొనుగోలులో అహ్మదాబాద్ సహా గుజరాత్ నుంచి ఎక్కువ మంది కొనుగోలుదారులు పాల్గొన్నారు.

JITO సంస్థ దేశవ్యాప్తంగా సుమారు 65,000 మంది సభ్యులను కలిగి ఉంది. ఈ సముదాయ కొనుగోలు ద్వారా ఆడి, BMW, మెర్సిడెస్ వంటి 15 టాప్ బ్రాండ్ల డీలర్‌షిప్‌లతో సంప్రదించి మంచి డీల్ పొందారు. బ్రాండ్లకు హామీ ఇచ్చిన వాల్యూమ్ సేల్స్ వల్ల మార్కెటింగ్ ఖర్చులు తగ్గుతాయి, సభ్యులకు ఆదా లభిస్తుంది.

JITO వైస్-చైర్మన్ హిమాన్షు షా గ్రూప్ గా కొనుగోలు మాకు బేరం ఆడే పవర్ ఇచ్చిందని చెప్పుకొొచ్చారు. ఈ డ్రైవ్‌లో మాత్రమే ₹149.54 కోట్ల విలువైన లగ్జరీ కార్లు కొనుగోలు చేసి ₹21.22 కోట్లు ఆదా చేశాం అని తెలిపారు. ఈ విజయంతో JITO ఇతర రంగాలకు కూడా విస్తరిస్తోంది. ఎలక్ట్రానిక్స్, మెడిసిన్స్, జ్యువెలరీ వంటి వాటికి కూడా గ్రూప్ కొనుగోలు డీల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ గుజరాత్‌లోని ఇతర సముదాయాల్లో కూడా కనిపిస్తోంది. భర్వడ్ సముదాయం భర్వడ్ యువ సంఘటన్ గుజరాత్ ద్వారా 121 JCB మెషిన్లను కొనుగోలు చేసి సుమారు ₹4 కోట్లు ఆదా చేశారు. యువతకు స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఈ డీల్ జరిగింది. ప్రతి మెషిన్‌పై సగటున ₹3.3 లక్షల డిస్కౌంట్ పొందారు. క్రెడిట్ స్కోర్ లేని వారికి కూడా పాన్, ఆధార్ ఆధారంగా జీరో డౌన్ పేమెంట్ అవకాశం కల్పించారు, సముదాయం రీపేమెంట్ గ్యారంటీ ఇచ్చింది.

Car Buying in Gujrat During Diwali: गुजराती लोग दुनिया भर में पैसा कमाने के लिए जाने जाते हैं, लेकिन वे समझदारी और एकता के कारण पैसे बचाने में भी माहिर हैं.

हाल ही में इसका एक उदाहरण भी देखने को मिला है जिसमें, जैन समुदाय ने जैन इंटरनेशनल ट्रेड ऑर्गनाइजेशन (#JITO) की पहल पर,… pic.twitter.com/wlO1c36rOo

— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) October 17, 2025

ఈ సంఘటనలు గుజరాత్ సముదాయాలు ఏకమై ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. లగ్జరీ కార్లు గానీ, హెవీ మెషినరీ గానీ – ఉత్తమ డీల్స్ పొందడంలో గుజరాతీలు ముందుంటున్నారు.