Guava Juice : రోజూ జామ రసం తాగితే.. ఆరోగ్యం, స్కిన్, హెయిర్‌కు ఇన్ని లాభాలా?

2 months ago 10
ARTICLE AD

Health Benefits of Guava Juice : పండ్లు ఆరోగ్యానికి మంచిది. అలాంటివాటిలో జామపండు ముందు వరుసలో ఉంటుంది. దీనిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందిస్తాయి. అయితే దీనిని కేవలం పండుగానే కాకుండా జ్యూస్​గా తీసుకున్నా మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఆరోగ్యం కోసం మీరు పండ్ల రసాలు తీసుకుంటే.. దానిలో జామ రసం కూడా భాగం చేయాలని చెప్తున్నారు. మరి దీనివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

ప్రతిరోజూ జామ పండు తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. దానిని ముక్కలుగా కోసి తినవచ్చు. అలాగే రసం చేసి కూడా తాగవచ్చు. రెండు సందర్భాల్లోనూ అనేక ప్రయోజనాలు లభిస్తాయి. రసంగా జామను తీసుకుంటే జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. మరి ఇది శరీరం, ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందంటే..

రోగనిరోధక శక్తి..

జామ రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి జామ పండ్ల రసం తాగడం వల్ల విటమిన్ సి శరీరానికి అంది ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనివల్ల సీజనల్ సమస్యలు దూరమవుతాయి. అలాగే అనారోగ్యానికి ఎక్కువగా గురికాకుండా ఉంటారు.

జీర్ణక్రియకై..

జీర్ణక్రియను సహజంగా మెరుగుపరచడానికి జామ రసం కూడా ఉపయోగపడుతుంది. అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. పచ్చిగా తినడం లేదా ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు కడుపు నొప్పి అనిపించవచ్చు. కానీ జ్యూస్ రూపంలో సరైన మోతాదులో తీసుకుంటే మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. ఎందుకంటే దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే సమస్యను పూర్తిగా దూరం చేసుకోవచ్చు.

స్కిన్ హెల్త్

నారింజ కంటే జామకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండు లేదా పండ్ల రసాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు స్కిన్ హెల్త్​కి మేలు జరుగుతుంది. శరీరానికి కావాల్సిన విటమిన్ సి అందితే.. అది చర్మానికి సహజంగా మెరుపును అందిస్తుంది. లోపలినుంచి చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. జుట్టుకి కూడా మంచి పోషణ అందుతుంది.

బీపీ కంట్రోల్

జామకాయలో మెగ్నీషియం చాలా ఉంటుంది. ఈ పదార్ధం మన శరీరంలో రక్తపోటు స్థాయిని తగ్గిస్తుంది. హైబీపీ ఉన్నవాళ్లు దీనిని రెగ్యులర్​గా తగిన మోతాదులో తీసుకుంటే మంచిది. అంతేకాకుండా ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం బాగుంటుంది.

మధుమేహం..

జామపండు తియ్యగా ఉన్నా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల డయాబెటిక్ రోగులు జామ లేదా జామ రసాన్ని సురక్షితంగా తీసుకోవచ్చు. వైద్యులు కూడా డయాబెటిస్ ఉన్నవారు దీనిని తినాలని సూచిస్తారు.

జామపండు నేరుగా తినలేని వాళ్లు ఇలా జ్యూస్​లో రూపంలో తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. జామ పండు రసాన్ని మీ డైట్​లో చేర్చుకోవాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Read Entire Article