Maruti WagonR GST Price Cut: ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు మారుతి వ్యాగన్ ఆర్. GST 2.0 అమలు తర్వాత ఇది చాలా చవకగా మారింది. దీని బేస్ LXI వేరియంట్ రేటు ఇప్పుడు (కొత్త GST తర్వాత) రూ. 4,98,900 ఎక్స్-షోరూమ్ నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఈ కారును హైదరాబాద్‌ లేదా విజయవాడలో కొనుగోలు చేస్తే, RTO ఛార్జీలు & బీమా కలుపుకుని దాని ఆన్-రోడ్ ధర సుమారు రూ. 5.95 లక్షలు ఉంటుంది.

డౌన్ పేమెంట్ & EMI వివరాలు
మీరు రూ.30,000 ఆదాయంతోనూ ఒక కారును కొనాలని చూస్తున్నట్లయితే, వాగన్ R మంచి ఎంపిక. బేస్ LXI వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి, మీరు కనీసం రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఆ తర్వాత, మీరు బ్యాంకు నుంచి రూ. 4.95 లక్షల కారు లోన్ తీసుకోవాలి. 9% వడ్డీ రేటుతో బ్యాంక్‌ మీకు ఈ లోన్‌ మంజూరు చేసిందని అనుకుంటే...

నెలకు రూ. 7,952 EMI చెల్లిస్తే మీ లోన్‌ 7 సంవత్సరాల్లో తీరిపోతుంది.

నెలకు రూ. 8,909 EMI చెల్లిస్తే మీ లోన్‌ 6 సంవత్సరాల్లో క్లియర్‌ అవుతుంది.

నెలకు రూ. 10,259 EMI చెల్లిస్తే మీ లోన్‌ 5 సంవత్సరాల్లో మాఫీ అవుతుంది.

నెలకు రూ. 12,299 EMI చెల్లిస్తే మీ లోన్‌ చెల్లింపులు 4 సంవత్సరాల్లో పూర్తవుతాయి.

మీరు డౌన్ పేమెంట్ పెంచితే, EMI ఇంకా తక్కువగా ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ & బ్యాంక్ పాలసీలను బట్టి బ్యాంక్ లోన్ నిబంధనలు & EMI మొత్తం మారవచ్చు.

ఇంజిన్ & మైలేజ్
మారుతి వ్యాగన్ ఆర్ మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో వచ్చింది, అవి: 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ & CNG వేరియంట్. CNG వేరియంట్ 24 కి.మీ/కి.గ్రా. వరకు మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది మధ్య తరగతి కుటుంబాలకు & రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి అత్యంత అందుబాటు ధర ఎంపిక.

ఫీచర్లు & భద్రత
మారుతి వ్యాగన్ ఆర్‌, దాని విభాగంలో అత్యుత్తమమైన కారుగా గుర్తింపు పొందింది. ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ ప్లేకు మద్దతు ఇచ్చే 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ & 341 లీటర్ల బూట్ స్పేస్‌ దీనిలో ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం కంపెనీ ఇప్పుడు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందిస్తోంది. అదనంగా, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు & హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

వ్యాగన్ ఆర్ రైవల్స్‌
మారుతి వ్యాగన్ ఆర్.. Tata Tiago, Hyundai Exter, Renault Kwid &Maruti Suzuki Swift తో పోటీ పడుతోంది. టాటా టియాగో ఇటీవల ₹75,000 వరకు ధర తగ్గింపును పొందింది & ఇప్పుడు ₹4.57 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.